Rudravanam PS Web Series Review - రుద్రవనం పీఎస్ రివ్యూ: అడవిలో తల లేని మొండెం - రుద్రవనంలో హత్యల మిస్టరీ సిరీస్ ఎలా ఉందంటే?
Rudravanam PS Series Review In Telugu : నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ రుద్రవనం పీఎస్. మరి ఈ సిరీస్ ఎలా ఉందంటే?

Zee5 Crime Thriller Web Series Rudravanam PS Review In Telugu : క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళం, మలయాళం థ్రిల్లర్స్ తెలుగులోనూ సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అయితే, తెలుగులో డైరెక్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ రేర్‌గా వస్తుంటాయి. రీసెంట్‌గా ఈ జానర్‌లో వచ్చిన వెబ్ సిరీస్ 'రుద్రవనం పీఎస్' (Rudravanam PS). అక్టోబర్ 30 (శుక్రవారం) నుంచి ప్రముఖ ఓటీటీ 'జీ5' (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది.
శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించిన 7 ఎపిసోడ్ల ఈ సిరీస్‌లో నరేశ్ అగస్త్య, శ్రావణి రెడ్డి, ప్రీతి సుందర్, బెనర్జీ, చారు వాకన్, రాజా రవీంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉంది? ఎంతవరకు మెప్పించింది? అనేది ఓసారి చూస్తే...
కథ ఏంటంటే (Rudravanam PS Series Story In Telugu) : రుద్రవనం అనే ఊరిలో ఎస్సైగా పని చేస్తుంటాడు శివకుమార్ (నరేశ్ అగస్త్య). గర్భవతైన భార్య శ్రావణి (శ్రావణి రెడ్డి)ని చూసుకునేందుకు సెలవు తీసుకుందామనుకునే టైంలోనే ఊరిలో గుర్తు తెలియని శవం దొరుకుతుంది. పోలీసుల పొరపాటు వల్ల ఆ శవం తల కూడా మిస్ అవుతుంది. సరిగ్గా అప్పుడే ఎమ్మెల్యే (రాజా రవీంద్ర) తమ్ముడు కూడా మిస్ అవుతాడు. ఇక, ఊరిలో పేరు మోసిన లాయర్ బంధువు ఇంట్లో రూ.25 లక్షల నగలు చోరీకి గురవుతాయి. ఇలా వరుస కేసుల శివకుమార్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఊరి చుట్టుపక్కల ఇతర ప్రాంతాల్లో వరుసగా మిస్ అయిన కేసుల గురించి తెలుస్తుంది. అసలు ఆ శవం ఎవరిది? తలను ఎవరు తీసుకెళ్లారు? లాయర్ ఇంట్లో చోరీ చేసింది ఎవరు? శవాలకు దొంగతనాలకు ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసుల చిక్కుముడిని ఎస్సై శివకుమార్ ఎలా విప్పాడు? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ (Rudravanam PS Web Series Review In Telugu) : క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటేనే సగటు మూవీ లవర్ ఓ ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటాడు. మధ్య మధ్య సాగే ట్విస్టులు, చిక్కుముడులు విప్పలేని ప్రశ్నలు.. చివరకు దొరికే సమాధానాలు ఇవే అందరి మదిలో మెదులుతాయి. ఇక తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రుద్రవనం పీఎస్ విషయానికి వస్తే... డైరెక్టర్ శశిధర్ మున్నంగి ఆడియన్స్ ఆ థ్రిల్ పంచడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
మొదటి ఎపిసోడ్‌లో శవం దొరకడంతో మొదలైన కథ... తల మిస్ కావడం దగ్గర నుంచి ఒక్కో మిస్సింగ్ కేసు, చోరీలు వాటిని లింక్ చేస్తూ ఛేదించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ క్యూరియాసిటీ పెంచుతాయి. అయితే, ఫైనల్‌కు వచ్చేసరికి మాత్రం అంత హైప్ క్రియేట్ చేయలేదు. హంతకుడు పోలీసుల చుట్టూనే తిరుగుతున్నా... సగటు పోలీస్ ఆఫీసర్ అతన్ని పట్టుకోలేకపోయాడా? అనే ఆలోచన కలిగిస్తుంది. స్టోరీ నెమ్మదిగా సాగడం ఆడియన్స్‌కు విసుగు కలిగిస్తుంది.
దర్శకుడు చెప్పదలుచుకున్న స్టోరీని కేవలం ల్యాగ్ చేయడం కోసమే సిరీస్‌ను 7 ఎపిసోడ్స్ రూపొందించారన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ప్రతీ ఎపిసోడ్‌లోనూ స్టోరీ నెరేషన్ చాలా స్లోగా సాగుతుంది. ఇది ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుందనే చెప్పాలి. మధ్య మధ్యలో వచ్చే కొన్ని అనవసరమైన పాత్రలు ఎందుకు పెట్టారో కూడా తెలియదు. కథకు అవసరం లేని, కొన్ని లింక్స్ చూపిస్తారు. ఇది కొంత కన్ఫ్యూజన్ కలిగిస్తుంది. చివరకు వచ్చే సరికి కొంత క్లారిటీ వస్తుంది.
క్లైమాక్స్ హైలైట్ : స్టోరీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఆడియన్ కొంత సాటిస్‌ఫై అవుతాడు. ఎస్సై శివ కుమార్ హంతకుడిని గుర్తించడంలో గొప్ప గొప్ప ట్విస్టులు ఏమీ ఉండవు. సింపుల్‌గానే గుర్తించినా తర్వాత అన్నీ హత్యలు అతనే చేసినట్లు తెలుస్తుంది. ఇందులో కొంత సైకలాజికల్ మెథడ్‌ను కూడా చూపించారు. హంతకుడి దారిలోనే వెళ్లి అతని నుంచి నిజం రాబట్టడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అయితే, నిందితుడు ఎస్సైకు మాత్రమే నిజం చెప్పడం చూస్తే కొందరు ఆడియన్స్‌కు కనెక్ట్ కాదు. మొత్తంగా రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ టైమ్ పాస్ చేయాలంటే చూసే ఓ సింపుల్ క్రైమ్ థ్రిల్లర్ అనే చెప్పొచ్చు.
ఎవరెలా చేశారంటే? : ఎస్సై శివకుమార్‌గా నరేష్ అగస్త్య బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. అయితే, పోలీస్ ఆఫీసర్‌గా ఆ గాంభీర్యం, కొంచెం కఠినత్వాన్ని రాబట్టడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. ఇక సీఐగా బెనర్జీ, ఎమ్మెల్యేగా రాజా రవీంద్ర పర్వాలేదనిపించారు.
బలాలు : ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, సైకలాజికల్ కోణం, ఎపిసోడ్స్ రన్ టైం.
బలహీనతలు : వెరీ స్లో నెరేషన్, కథకు అవసరం లేని సంఘటనలు పాత్రలు.
రేటింగ్ : 2.5/5
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















