Captain Miller Twitter Review: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లోకి వచ్చింది. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీని దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ రూపొందించారు. జనవరి 12న తమిళంలో విడుదల అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌కు సొంతమైంది. మూవీ ప్రిమియర్స్‌ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ తమ రివ్యూను ప్రకటిస్తున్నారు. ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ మరికొందరిని నిరాశ పరిచింది. కొందరు మూవీ గందరగోళంగా ఉందంటూ ట్వీట్‌ చేస్తుండగా.. ఫ్యాన్స్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందంటూ కెప్టెన్‌ మిల్లర్‌ను కొనియాడుతున్నారు. మొత్తానికి పండుగ సందర్భంగా తమిళంలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకుందో ఇక్కడ చూద్దాం!


ధనుష్ లాంటి నటుడు ఉన్న కోలీవుడ్ చాలా లక్కీ..


ఈ సినిమా చూసిన ఓ ట్విటర్‌ యూజర్‌ ధనుష్‌ నటనను కొనియాడుతూ మూవీ రివ్యూ ఇచ్చాడు. ఫస్ట్‌ హాఫ్‌ బాగుందని ప్రతి ఒక్కరు సినిమాను చూడాలని పేర్కొన్నాడు. ధనుష్‌ లాంటి సహాజ నటుడు ఉన్న కోలీవుడ్‌ పరిశ్రమ చాలా లక్కీ అన్నాడు. థియేటర్లోనే ఈ సినిమా చూడాలని ఆడియన్స్‌ని సూచించారు. 






గందరగోళంగా ఉంది.. 


మరో నెటిజన్‌ సినిమా గందరగోళంగా ఉందన్నాడు. "కెప్టెన్ మిల్లర్‌ స్వాతంత్య్రానికి పూర్వం కథతో తెరకెక్కింది. అసమానాతలకు వ్యతిరేకంగా హీరో చేసే పోరాటాన్ని చూపించారు. ఇది స్వాతంత్య్ర పోరాటంతో పాటు అసురన్, కర్ణన్‌ను పోలి ఉంది. ఫస్ట్‌ హాఫ్‌ చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది" అంటూ తన అభిప్రాయం చెప్పాడు. 






హాలీవుడ్ స్టాండర్స్‌కు ఏమాత్రం తీసిపోని సీన్స్‌..


"కెప్టెన్‌ మిల్లర్‌ మూవీ చాలా అద్భుతం. సినిమా కథ, సన్నివేశాలు, పాత్రలు, డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. విజువల్స్‌ అయితే అద్భుతమే అనాలి. ముఖ్యంగా ఇంటర్వేల్ చేజ్‌లో వచ్చే సన్నివేశాలు హాలీవుడ్‌ స్టాండర్స్‌కు ఏం మత్రం తీసిపోకుండ ఉన్నాయి. చిన్న ట్విస్ట్‌తో మూవీ ఎండ్‌ అవుతుంది. ఇప్పటి వరకు అయితే మూవీ బాగానే ఉంది" అని ప్రశంసించారు. 






ఫస్టాఫ్ ఎలా ఉందంటే : 


'కెప్టెన్ మిల్లర్ ఫస్టాఫ్ పూర్తైంది. ఇందులో ఇంటర్వెల్ సీక్వెన్స్ పర్వాలేదు. కానీ, మంచిగా సెట్ చేయలేదు. ఫైట్స్ మొత్తం సింక్ అవలేదు. ఇప్పటి వరకూ మొత్తం యావరేజ్‌గా ఉంది. ఫస్టాఫ్‌కు నా రేటింగ్ 2/5' అని చెప్పుకొచ్చారు.






జీవీ ప్రకాశ్‌ BGM నెక్ట్స్‌ లెవెల్‌:


"ధనుష్‌ మరోసారి తన యాక్షన్‌ అదరగొట్టాడు. మూవీ మేకింగ్‌ చాలా బాగుంది. యాక్షన్‌, విజువల్స్‌ మెప్పించాయి. అసాధారణమైన జీవీ ప్రకాశ్‌ మ్యూజిక్‌, బీజీఎం హైలెట్‌ అని చెప్పాలి. ఫస్ట్‌ హాఫ్‌ మాత్రం ఫ్యాన్స్‌ ఏమాత్రం నిరాశ పరచదు" అని పేర్కొన్నాడు. 






అతడి కెరీర్‌లోనే బెస్ట్ : 
'కెప్టెన్ మిల్లర్ ప్రేక్షకులకు ఓ యావరేజ్ సినిమా చూసిన ఫీలింగ్‌ కలిగిస్తుంది. జీవీ ప్రకాశ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీకి హైలెట్‌. అదే లేకపోతే మూవీ ప్లాప్‌ అనే చెప్పాలి. ది అతడి కెరీర్‌లోనే బెస్ట్ ఔట్‌పుట్' అని వివరించారు.