అన్వేషించండి

Assi Telugu Review : 'అస్సీ' తెలుగు రివ్యూ - రేప్ కేస్, కోర్ట్ రూం డ్రామా ఎలా ఉంది? లాయర్‌గా తాప్సీ యాక్టింగ్ మెప్పించిందా?

Assi Review In Telugu : తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కోర్ట్ రూం డ్రామా 'అస్సీ' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ కోర్ట్ రూం డ్రామా ఎలా ఉందో? తెలుసుకోండి.

Tapsee Assi Movie Telugu Review : హీరోయిన తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఇంటెన్సివ్ కోర్డ్ రూమ్ డ్రామా 'అస్సీ'. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే సెన్సిటివ్ సోషల్ అంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది? సమాజంలో ప్రస్తుతం పరిస్థితులకు అస్సీ నిజంగా అద్దం పట్టిందా? అనేది ఓసారి చూస్తే...

కథ ఏంటంటే?

మహిళలపై లైంగిక హింస, న్యాయ వ్యవస్థ, సామాజిక బాధ్యత ప్రధానాంశాలుగా ఈ మూవీ సాగుతుంది. ఇక కథ విషయానికొస్తే... స్కూల్లో టీచర్‌గా వర్క్ చేసే యువతి పరిమ (కని కుస్రుతి). ఓ రోజు స్కూలులో ఆలస్యమై లేట్‌గా ఇంటికి వస్తుంటుంది. ఇదే టైంలో నిర్మానుష్య ప్రదేశంలో కొంతమంది దుండగులు కారులో ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. ఈ కేసు సెన్సేషన్ అవుతుంది. కోర్టులో అత్యాచార బాధితురాలు పరిమ తరఫున మహిళ న్యాయవాది రావి (తాప్సి) వాదిస్తుంది.

నిందితులని నిర్దోషులుగా నిరూపించేందుకు అపోజిషన్ లాయర్ విశ్వ ప్రయత్నాలు చేస్తాడు? అసలు రావి ఈ కేసును ఎలా హ్యాండిల్ చేసింది? బాధితురాలికి న్యాయం జరిగిందా? నిందితులకు ఎలాంటి శిక్షలు పడ్డాయి? అత్యాచార కేసుల్లో బాధితురాలు ఎదుర్కొనే తీవ్ర మానసిక, సామాజిక ఇబ్బందులు. ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

దేశంలో ప్రతీ 20 నిమిషాలకు ఒక అత్యాచార ఘటన జరుగుతుంది. 24 గంటల్లో మొత్తం ఘటనల సంఖ్య 80. ప్రస్తుతం సమాజంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచార బాధితురాలు ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు మేకర్స్ చూపించారు. మూవీ చూస్తున్నంత సేపు హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది. ఒక్కో సీన్ హృదయాన్ని కదిలిస్తుంది. ప్రభుత్వం, పోలీసులు, పరిపాలన, సమాజం చూసే చూపులు చాలా ఎమోషన్‌గా అనిపిస్తాయి. టీచర్‌పై అత్యాచారం జరిగిన తర్వాత విద్యార్థులంతా వాట్సాప్ గ్రూపుల్లో ఆమె ఎగతాళి చేసే సీన్ నిజంగా సీట్లలో కూర్చోనివ్వదు.

డైరెక్టర్ అనుభవ్ సిన్హా ఇంతకు ముందు ఎన్నో హిట్ సినిమాలు తీసినా... ఈ మూవీలో సెన్సిటివ్ అంశాన్ని అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఏదైనా అత్యాచార ఘటన జరిగినప్పుడు రేపిస్టులను నడిరోడ్డుపై కాల్చేయ్యాలి అనే కోపం సమాజంలో కలగడం సహజం. అదే కోణాన్ని మరింత ఎమోషన్‌గా  చూపించారు. అత్యాచార బాధితురాలు పడే బాధ వర్ణనాతీతం. ఆ సీన్లను సెన్సిబుల్‌గా డీల్ చేశారు. కోర్టు సన్నివేశాలు మూవీకే హైలెట్ అనే చెప్పాలి. 

Also Read : పవర్ స్టార్ Vs మైఖేల్ జాక్సన్ - దేఖ్‌లేంగే సాలా... ఇండియన్ సినిమాలో మిరాకిలా...

ఎవరెలా చేశారంటే?

లాయర్ పాత్రలో హీరోయిన్ తాప్సి నటన అద్భుతం. కోర్టులో బలమైన డైలాగ్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో రోల్‌ను తన నటనతో మరింత పవర్ ఫుల్‌గా మార్చారు. ఓ సీన్‌లో కోర్టు బయట ఆమె ముఖంపై ఇంక్ చల్లుతారు. ఆమె అలాగే కోర్టు రూంకు వచ్చి తన వాదన ప్రారంభిస్తుంది. అత్యాచార బాధితురాలి భర్తగా మహ్మద్ జీషన్ అయూబ్ సెన్సిటివ్ యాక్టింగ్ అద్భుతం.

కుముద్ మిశ్రాను తెరపై ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. అస్సీలో ఆయన రోల్ చాలా కాలం గుర్తుండిపోతుంది. నిందితుల తరపు న్యాయవాదిగా సత్యజీత్ శర్మ అసాధారణంగా నటించాడు. ఆయన నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లి తాప్సీ పాత్రను బలోపేతం చేసింది. కని, జీషన్ కొడుకుగా అద్విక్ జైస్వాల్ గాఢమైన ప్రభావాన్ని చూపాడు. రేవతి న్యాయమూర్తిగా బాగా నటించారు. మనోజ్ పహ్వా, సీమా పహ్వా, సుప్రియా పాఠక్, ముఖేష్ ఛబ్రా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

రచన & దర్శకత్వం - అనుభవ్ సిన్హా, గౌరవ్ సోలంకి రచన అద్భుతంగా ఉండటమే కాకుండా చాలా సున్నితంగా ఉంది. వారు ఏం చెప్పాలనుకున్నారో ఫుల్ క్లారిటీగా చెప్పడంతో స్టోరీ మిమ్మల్ని ముందే ఓ ఫ్లోలోకి తీసుకెళ్తుంది. అనుభవ్ సిన్హా దర్శకత్వం అద్భుతం. ప్రతి పాత్రకు అవసరమైన సన్నివేశాలను కేటాయించి, కథను హీరోగా చేశాడు. మొత్తం మీద 'అస్సీ' తప్పక చూడాల్సిన చిత్రం.

రేటింగ్ - 4.5/5

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
Iran Warns US: ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
Iran Warns US: ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
Pithapuram Latest News: చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
Vijay Sethupathi: 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?
200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?
Dhanush D56 Movie : ధనుష్ మూవీలో డ్రాగన్ బ్యూటీ? - క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా...
ధనుష్ మూవీలో డ్రాగన్ బ్యూటీ? - క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా...
Trisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?
ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?
Embed widget