విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటించిన సినిమా 'జిన్నా' (Ginna Movie). ఈ రోజు థియేటర్లలో విడుదల అయ్యింది. దీనికి కలెక్షన్ కింగ్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. మోహన్ బాబు ఆశీసులతో... ఆయన నిర్మాణంలో అవ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందింది. ఈ సినిమాకు నిర్మాతగా మాత్రమే కాదు... మరో శాఖలో కూడా మోహన్ బాబు వర్క్ చేశారు. అది ఏంటంటే...


'జిన్నా'కు మోహన్ బాబు స్క్రీన్ ప్లే!
అవును... మీరు చదివింది నిజమే! 'జిన్నా' సినిమాకు మంచు మోహన్ బాబు స్క్రీన్ ప్లే రాశారు. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఆయన సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి అసలు కథ... దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి అందిస్తే, కోన వెంకట్ స్క్రిప్ట్ రాశారు. మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందించారు. 'జిన్నా' టైటిల్ కార్డ్స్‌లో ''స్క్రీన్ ప్లే, నిర్మాత - మోహన్ బాబు'' అని వేశారు. అదీ సంగతి!  


దీపావళి సందర్భంగా శుక్రవారం ఉదయం థియేటర్లలో విడుదలైన 'జిన్నా'కు (Ginna Public Response) మిశ్రమ స్పందన లభించింది. విమర్శకుల్లో కొందరికి సినిమా నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల నుంచి కూడా అదే విధమైన స్పందన లభిస్తోంది. లాజిక్స్ లేకుండా చూస్తే ఎంజాయ్ చేయవచ్చని కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. మరికొందరు బాలేదని ట్వీట్స్ చేస్తున్నారు. వసూళ్లు ఏ విధంగా ఉన్నాయనేది సోమవారం తర్వాత క్లారిటీ వస్తుంది.


'జిన్నా' జాతర - విష్ణు మంచు ట్వీట్!
థియేటర్లలో సినిమా విడుదల కావడానికి కొన్ని గంటల క్రితం 'జిన్నా... జిన్నా...  ఈ రోజు నుంచి జిన్నా జాతర'' అని విష్ణు మంచు ట్వీట్ చేశారు. సాయంత్రం లవ్, నమస్కారం పెడుతున్న ఎమోజీలు పోస్ట్ చేశారు. సినిమాకు లభిస్తోన్న  స్పందన పట్ల తన సంతోషాన్ని ఆయన ఈ విధంగా వ్యక్తం చేసినట్లు ఉన్నారు.


'జిన్నా' విడుదలకు కొన్ని రోజుల ముందు 'ఆదిపురుష్' టీజర్, ప్రభాస్ మీద విష్ణు మంచు కామెంట్స్ చేసినట్లు మీమ్స్ వచ్చాయి. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని విష్ణు మంచు క్లారిటీ ఇచ్చారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని పేర్కొన్నారు. ఈ విషయం ప్రభాస్ వరకు చేరినట్లు ఉంది. 'జిన్నా'విడుదల సందర్భంగా విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశారు.


Also Read : 'ప్రిన్స్' రివ్యూ : శివకార్తికేయన్, 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా ఎలా ఉందంటే?


 సన్నీ లియోన్... పాయల్... ఫుల్ గ్లామర్!
'జిన్నా'లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటించారు. వాళ్ళిద్దరి గ్లామర్ సినిమాకు హెల్ప్ అయ్యిందని టాక్. అన్నపూర్ణమ్మ, రఘు బాబు, సీనియర్ నరేష్, సునీల్, 'వెన్నెల' కిశోర్, చమ్మక్ చంద్ర, సద్దాం తదితరులు నటించారు. ఈ సినిమాతో తన కుమార్తెలు అరియానా - వివియానాను సింగర్స్  గా పరిచయం చేశారు విష్ణు మంచు. కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.