Mahesh Babu travel to Germany for technical work of SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ విడుదలైనా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ వసూళ్ల పరంగా ఫర్వాలేదు అనిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓ రీజినల్ మూవీ ఈ రేంజిలో వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి అని చిత్రబృందం వెల్లడించింది.


‘SSMB29’ కోసం జర్మనీకి వెళ్లిన మహేష్ బాబు


‘గుంటూరు కారం’ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకధీరువు రాజమౌళితో కలిసి ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు తాత్కాలికంగా ‘SSMB29’ అని పేరు కూడా పెట్టేశారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు సుమారు 2 సంవత్సరాల పాటు డేట్స్ కేటాయించాలని రాజమౌళి చెప్పినట్లు తెలుస్తోంది. రాజమౌళితో సినిమా అంటే ఆ మాత్రం ఉంటుందని భావించిన మహేష్ బాబు ఓకే చెప్పారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొదలయ్యింది. స్ర్కిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘SSMB29’ మూవీ టెక్నికల్ వర్క్ కోసం మహేష్ బాబు తాజాగా జర్మనీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు ఇవాళ ఉదయం జర్మనికి వెళినట్లు సమాచారం. ‘SSMB29’ టెక్నికల్ వర్క్ కోసం మహేష్ మూడు రోజుల పాటు జర్మనీలో ఉండే అవకాశం ఉందట. ఈ వర్క్ కంప్లీట్ కాగానే ఆయన, ఇండియాకు తిరిగి వచ్చి ‘గుంటూరు కారం’ గ్రాండ్ సక్సెస్ మీట్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.   


అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ‘SSMB29’ 


తొలిసారి రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. ‘SSMB29’  అడ్వెంచర్ మూవీగా రూపొందనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.  పౌరాణిక సూపర్ హీరో హనుమంతుడి నుంచి ప్రేరణ పొందిన పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆంజనేయుడికి ఉన్న లక్షణాలు ఈ సినిమాలో మహేష్ కు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ కీలక పాత్ర పోషించేందుకు సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే చిత్రం బృందం ఈ విషయంపై అధికార ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


‘గుంటూరు కారం’ మూవీ గురించి..


మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘గుంటూరు కారం’ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జయరామ్, ప్రకాష్ రాజ్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీని అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించగా, తమన్ సంగీతం అందించారు.


Read Also: విజువల్‌ ట్రీట్‌ ఇచ్చిన 'హనుమాన్‌' విగ్రహం నిజంగా ఉందా? మూవీ షూటింగ్‌ లొకేషన్స్‌ ఎక్కడంటే..