టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా ఆయన ఎంత బిజీగా ఉన్నా.. బ్రాండ్స్ ను మాత్రం పక్కన పెట్టడు. ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ను మహేష్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా మహేష్ లిస్ట్ లో మరో బ్రాండ్ వచ్చి చేరింది. అదే మౌంటెన్ డ్యూ. 


ఈ బ్రాండ్ ను ఇండియాలో మహేష్ బాబు ప్రమోట్ చేస్తున్నారు. ఇదివరకే ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాజాగా దీనికి సంబంధించిన యాడ్ ను మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. ఇందులో బుర్జ్ ఖలీఫా లాంటి ఎత్తైన కట్టడం నుంచి బైక్ డ్రైవ్ చేసుకుంటూ కిందకు వచ్చే యాక్షన్ స్టంట్ లో మహేష్ బాబు కనిపించారు. 


మౌంటెన్ డ్యూని ప్రమోట్ చేస్తూ.. కొన్ని డైలాగ్స్ కూడా చెప్పారు. ఈ యాడ్ చాలా యూనిక్ గా ఉందని.. మహేష్ కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నడంటూ మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదివరకు అఖిల్ అక్కినేని మౌంటెన్ డ్యూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేవారు. ఇప్పుడు మహేష్ చేతుల్లోకి ఈ బ్రాండ్ వచ్చింది. 


ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 12న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.