'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఆ తరువాత కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అయితే స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. పెద్ద హీరోల సరసన అవకాశాలు కూడా రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో లావణ్య త్రిపాఠి పెళ్లి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. 


మెగాహీరో వరుణ్ తేజ్ తో ఆమె డేటింగ్ చేస్తుందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల వరుణ్ తేజ్ తన పుట్టినరోజు నాడు లావణ్యకి పెళ్లి ప్రపోజల్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది ఈ బ్యూటీ. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించింది లావణ్య. 


తన కొత్త సినిమా 'హ్యాపీ బర్త్ డే' గురించి ఈ లైవ్ సెషన్ లో చెబుతూ.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే ఎక్కువ మంది లావణ్య పెళ్లి విషయం గురించి అడగ్గా.. 'నాకైతే నా పెళ్లి గురించి తెలియదు మరి వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందో..?' అంటూ వెటకారంగా బదులిచ్చింది. అయితే తను సింగిల్ అని కానీ, ఎవరితో డేటింగ్ చేయడం లేదని మాత్రం లావణ్య చెప్పలేదు. 


కొందరు నెటిజన్లయితే.. 'కేవలం మ్యారేజ్ గాసిప్స్ ను ఖండిస్తున్నారా..? లేక వరుణ్ తేజ్ తో ఎఫైర్ లేదని చెబుతున్నారా..?' అని ప్రశ్నించగా.. వాటిపై మాత్రం లావణ్య రెస్పాండ్ అవ్వలేదు. దీంతో ఆమె ప్రేమలో ఉన్న మాట నిజమేనని ఫిక్స్ అయిపోతున్నారు నెటిజన్లు.