పెద్దమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు నాలుగు రోజులు బాధపడింది తప్ప ఇలా ద్వేషం పెంచుకోలేదు. కానీ ఇప్పుడు ఏంటో శత్రువులా చూస్తుంది. నన్ను ఎప్పుడు దూరం పెట్టలేదు ఇప్పుడే ఇలా జరిగింది. ఆలోచించి ఆలోచించి నా మనసు అలిసిపోయిందని మనసులో బాధనంతా చెప్పుకుంటాడు. కృష్ణ మురారీని ఒడిలో పడుకోబెట్టుకుని ఓదారుస్తుంది. మురారీ విషయంలో కృష్ణ ప్రాణాలకు తెగించి అత్తయ్యకి ఎదురు నిలబడింది. దాంతో అత్తయ్యతో పాటు అందరి సానుభూతి దక్కించుకుంది. పెద్దత్తయ్య చెప్పింది కదా అని నాతో అసలు మాట్లాడడు. కృష్ణతోనే మాట్లాడి మాట్లాడి తనకి మరింత దగ్గర అయిపోతాడు విడిపోయే విషయంలో నిర్ణయం మార్చుకుంటే నో అని గట్టిగా అరుస్తుంది. వెంటనే భవానీ తన మీద చెయ్యి వేసి ఏమైంది అలా ఉన్నావని అడుగుతుంది.


ముకుంద: మీరు నందినికి ఇష్టం లేని వాడితో పెళ్లి జరిపించాలని అనుకుని తప్పు చేశారు అత్తయ్య


భవానీ: మాట్లాడే స్వతంత్రం ఇచ్చాను కదా అని నా తప్పునే ఎత్తి చూపించకు


Also Read: విడాకుల పేపర్స్ ఇచ్చిన వసంత్- వేద, యష్ మళ్ళీ కలుసుకుంటారా?


ముకుంద: ఆ నిర్ణయం వల్ల ఏం ఒరిగింది. అందరూ నందినికి న్యాయం జరిగిందనే అంటున్నారు ఇప్పుడు కృష్ణ మురారీలకు శిక్ష కాదు వేసింది చిలుకా గోరింకల్లా ఉండమని చెప్పినట్టు ఉంది మంచి ప్రైవసీ దొరికిందని అనేసి వెళ్ళిపోతుంది


రేవతి ఎదుస్తూనే పని చేసుకుంటుంటే ఈశ్వర్ వచ్చి ఆకలవుతుందని అంటాడు. కోపంగా వెళ్లిపోతుంటే ఆపుతాడు. ఇక నుంచి నేను మీతో మాట్లాడను. ఏ తప్పు చేయని నా కొడుకు కోడలికి తప్పు చేసిన మీరు శిక్ష వేయడం కరెక్ట్ కాదు. నందిని జీవితం నిలబెట్టినందుకు శిక్ష విధిస్తారా? ఇష్టమైన వాళ్ళు మాట్లాడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. అందుకే ఇక నుంచి నేను కూడా మీతో మాట్లాడనని వెళ్ళిపోతుంది. మురారీకి కృష్ణ సోరి చెప్తుంది. నువ్వు మంచే చేశావ్ కానీ ఆ మంచి ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అందువల్ల ఎవరూ మాట్లాడటం లేదు. అంతే తప్ప మన మధ్య దూరం వచ్చే పని అయితే కాదని మురారీ అంటాడు.


Also Read: 'ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలా' అంటూ నందుకి అవమానం- ఫస్ట్ నైట్ జరగకుండా అడ్డుపడిన రాజ్యలక్ష్మి


భోజనానికి వెళ్దామని కృష్ణ అంటుంది. పెద్దమ్మ ఇప్పుడు నా మొహం కూడా చూడరు ఉండలేనని బాధపడతాడు. కృష్ణ కాసేపు భర్తకి ఊరటనిచ్చే మాటలు చెప్తుంది. మనుషులు కూడా మారతారని సర్ది చెప్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. కృష్ణ వాళ్ళు తినడానికి వచ్చి కూర్చుంటారు. వెంటనే భవానీ తినడం ఆపేసి లేచి నిలబడుతుంది. అందరూ తినకుండా లేస్తారు. మురారీ ఆకలి లేదని వెళ్లిపోదామని కృష్ణని పిలుస్తాడు. వాళ్ళిద్దరూ వెళ్లిపోగానే భవానీ కూర్చుంటుంది. కొడుకు, కోడలు తినకుండా వెళ్లిపోయినందుకు రేవతి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నిష్టూరంగా మాట్లాడి రేవతి వెళ్లిపోతుంటే భవానీ ఆపుతుంది. నీది కడుపుకోత నాది గుండె కోత కన్నందుకు నీకు పెంచినందుకు నాకు ఈ శిక్ష తప్పదని అంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భోజనం చేశాక మిగిలిన భోజనం తీసుకెళ్ళి సెక్యూరిటీకి ఇచ్చేయమని ముకుందకి చెప్తుంది. అందరూ తిన్న తర్వాత కృష్ణ, మురారీ వస్తారు. గిన్నెలు ఖాళీగా ఉండటం చూసి చాలా బాధపడతారు.