కార్తీకదీపం మార్చి 22 మంగళవారం ఎపిసోడ్
ఆటో డ్రైవర్ గా ఎంట్రీ ఇచ్చిన శౌర్య వేరేవాడిని చితక్కొడుతుంది. ఈ ఆటోపై వదిలేదేలే అని రాశారంటే ఎవర్ని నాలాంటి వాళ్లనా అని అడిగితే... మళ్లీ యాక్సిడెంట్ విషయం, హిమ గురించి తలుచుకుంటుంది శౌర్య ( అమూల్య గౌడ). అమ్మా-నాన్నల్ని చంపేసిన హిమని వదిలేదేలే అనుకుంటుంది. మీ పేరేంటి అని అడిగితే 'జ్వాల' అని చెబుతుంది ( శౌర్య పేరుని జ్వాలగా మార్చుకుందన్నమాట). ఎక్కడున్నావ్..నిన్ను వదిలేదే లే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అటు హిమ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఇంతలో మరో హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇంకెవరు సౌందర్య మనో మనవడు ప్రేమ్ అన్నమాట. ఏంటి ప్రేమ్ అని హిమ మొదలెట్టేలోగా.. నువ్వేమంటావో నాకు తెలుసు, ఇంత లేటా అని అడుగుతావ్ అంతేగా అంటాడు. మీ అన్నదమ్మలు ఇద్దరూ చెరోదగ్గర ఉంటున్నారు, మీరైనా అమ్మా-నాన్నని కలపొచ్చుకదా అని సౌందర్య అంటే.. వాళ్లని కలిపే ప్రయత్నంలో మా ఇద్దరి మధ్యా గొడవలు వస్తాయేమో అంటారు ప్రేమ్-నిరుపమ్. అక్కడకు వచ్చిన గెస్టులు రెండు కేకులు చూసి ఒక బర్త్ డేకి రెండు కేకులు ఉన్నాయేంటి అని అడుగుతారు... అది మా ఇంకో మనవరాలు కోసం అని సౌందర్య చెబితే..శౌర్య నా సిస్టర్ అంటుంది హిమ. శౌర్య నన్ను బాగా చూసుకునేది, తన ఆలోచనలు నాకన్నా ముందుండేవి అందుకే తను నాకు అక్క అని రిప్లై ఇస్తుంది హిమ. పలకరింపులు అయ్యాక కేక్ కట్ చేస్తుంది హిమ.
Also Read: జగతి కోసం మహేంద్ర డేరింగ్ స్టెప్, రిషి రియాక్షన్ ఎలా ఉండబోతోంది
అటు శౌర్య ( జ్వాల) బర్త్ డేని ఆటో వాళ్లంతా కలసి సెలబ్రేట్ చేయాలి అనుకుంటారు. కానీ ఇవన్నీ నాకు ఇష్టం లేదంటుంది జ్వాల. నేను పుట్టిన రోజే ఆ హిమ కూడా పుట్టింది అది ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే రోజు నేను ఆనందంగా ఉండడం నాకు నచ్చదు అనుకుంటుంది. ఇప్పుడీ కేక్ అంతా తినేయండి..రేపు నేను సెలబ్రేట్ చేసుకుంటా అంటుంది. అంతా బతిమలాడడంతో కేక్ కట్ చేస్తుంది శౌర్య అలియాస్ జ్వాల. ఆటోవెనుక వదిలేదేలే అని రాసిఉండడంపై చర్చించుకుంటారంతా.
Also Read: ఒకరు ప్రకృతి-మరొకరు ప్రళయం, హిమ-శౌర్యగా కీర్తి కేశవ్ భట్, అమూల్య గౌడ ఎంట్రీ
కట్ చేస్తే జైల్లోంచి విడుదలవుతారు ఇంద్రుడు, చంద్రమ్మ. ఎంతమంది మనుషులో రంగంలోకి దిగుదామా అంటుంది చంద్రమ్మ. జైల్లోంచి విడుదలైన సందర్భంగా నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వు, షాపింగ్ చేయించవా అని అడుగుతుంది. జైల్లో నాలుగు వేలు వెనకేశాం, మరో ఆరువేలు కావాలి పదివేలు ఉంటే పాపకి దిద్దులు కొనిద్దాం అంటుంది. అలవాటు పోయినట్టుంది చేయి వణుకుతోందంటాడు ఇంద్రుడు. చంద్రమ్మ డబ్బులు కొట్టేసి పర్స్ మళ్లీ జేబులో పెడుతుండగా జ్వాల వచ్చి పట్టుకుంటుంది. తీరా వాళ్లు కొట్టేసిన పర్స్ జైల్లో అధికారిది. దొంగతనం మానేసి బుద్ధిగా బతకండి అని చెబుతాడు. పర్స్ పడిపోందో, కొట్టేశారో నాకు తెలుసు లోపలకు పదండి అంటాడు. అడ్డుపడిన జ్వాల విడిపిస్తుంది. నువ్వెంతో ఆదర్శనవంతంగా ఉంటావ్...కానీ వీళ్ల కడుపున నువ్వెలా పుట్టావ్ అంటాడు ( శౌర్యని చిన్నప్పటి నుంచీ పెంచింది వీళ్లే). నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు వాళ్లకు వంటచేసే భార్య-భర్త కావాలంట వీళ్లని అక్కడ పనిలో పెట్టు అని సలహా ఇస్తాడు జైలర్. ఆటో వెనుక వదిలేదేలే అని ఉండడం చూసి జైలర్ కూడా అడుగుతాడు... ఎపిసోడ్ ముగిసింది...