కార్తీక్ నిద్రపోతూ ఉంటే శివ వచ్చి నిద్రలేపుతాడు. అయినా తెల్లారి ఉంటే మీ మేడమ్ నన్ను పడుకోనిస్తదా ఎప్పుడో సుప్రభాతం మొదలుపెట్టి ఉంటది వెళ్ళు నన్ను నిద్రపోనివ్వమని కార్తీక్ నిద్రలోనే చెప్తాడు. సర్ చెప్పింది నిజమే మేడమ్ అసలు పడుకొనివ్వదు కదా ఒకసారి ఫోన్ చేసి అడుగుదామని అనుకుంటాడు. ఈరోజు నేను మౌన వ్రతం అని చీటి మీద రాసి ఇచ్చింది, అయినా నిద్రపోనివ్వదు కదా.. ఈరోజు సర్ ఇంకా నిద్రపోవడానికి మేడమ్ మౌన వ్రతానికి ఏదైనా సంబంధం ఉందా అని శివ అనుకుంటాడు. ఇక దీప కాపాడిన డాక్టర్ ఇంట్లో వాళ్ళ పెళ్లి రోజు ఘనంగా ఏర్పాటు చేస్తారు. అది చూసి దీప ఎమోషనల్ అవుతుంది. దీప కార్తీక్ తో గడిపిన క్షణాలు తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నీభర్త త్వరలోనే తిరుగి వస్తాడు అని డాక్టర్ తల్లి చెప్తుంది.


సౌందర్య శౌర్య గురించి ఆలోచిస్తూ ఉండగా ఏమైందని ఆనందరావు అడుగుతాడు. అప్పుడే అక్కడికి హిమ వచ్చి బయలుదేరండి శౌర్య దగ్గరకి వెళ్దాం అని అంటుంది. తను రాను అని మొన్న చెప్పింది కదా తను కోపంగా ఉంది రాదు అని సౌందర్య చెప్తుంది. శౌర్య ఎంత మొండిదో తెలుసు కదా మనం పట్టుబట్టే కొద్ది తను అంతా పంతం పెంచుకుంటుంది. అందుకే తన కోపం తగ్గే వరకు మౌనంగా ఉండటం మంచిదని ఆనందరావు చెప్తాడు. అవన్నీ నాకు తెలియవు తాతయ్య ఎలాగైనా మనం శౌర్య దగ్గరకి వెళ్ళాలి. శౌర్యని బాగా చూసుకోమని అమ్మానాన్న చెప్పిన మాటలు నాకు ఇనాక్ గుర్తుకు వస్తూనే ఉన్నాయి. ఏ పని చేస్తున్నా అమ్మనాన్న నా కలల ముందుకు వచ్చి హిమా శౌర్య ఎక్కడ తనని పట్టించుకోకుండా ఉంటున్నావా అని ప్రశ్నిస్తున్నట్టు ఉందని హిమ బాధపడుతుంది. తనని తీసుకురావాలనే బాధ్యత మాకు మాత్రం లేదా అది రాను అంటే ఏం చెయ్యను ఒకవేళ బలవంత పెడితే పూర్తిగా దూరం అవుతుందో అని భయంగా ఉందని సౌందర్య అంటుంది. ఎందుకు కుదరదు నానమ్మ నేను భోజనం మానెయ్యడం చేస్తే అప్పుడు కుదురుతుంది, నేను కూడా శౌర్యలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అంటే అప్పుడు కుదురుతుందని అంటే సౌందర్య కోపంగా హిమ చెంప చెళ్లుమనిపిస్తుంది.


ఇప్పుడు వద్దని చెప్తే అది హిమ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని మనసులో అనుకుని సరే మనం శౌర్య దగ్గరకి వెళ్దామని ఆనందరావు చెప్తాడు. దీప కార్తీక్ కనిపించిది గుర్తు చేసుకుని మిమ్మల్ని ఎలాగైనా నా దగ్గరకి చేర్చుకుంటాను అని అనుకుని వెతికేందుకు బయల్దేరుతుంది. శౌర్య దీప వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. అప్పుడే చంద్రమ్మ ఇంద్రుడు అక్కడికి వస్తారు. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు నిన్ను దత్తత తీసుకుని మేము బాగా చూసుకోడం లేదని అనుకుంటారని ఇంద్రుడు అంటాడు. అలా ఎందుకు అనుకుంటారు బాబాయ్ దారిన పోయే ఆడపిల్లని దత్తత తీసుకుని ఎవరు పెంచుకుంటారు, మీరే లేకపోయి ఉంటే ణ పరిస్థితి ఏమై ఉండేదని శౌర్య అంటుంది. కానీ నీ బాధ తీర్చలేకపోతున్నామని గుండె తరుక్కుపోతుందని చంద్రమ్మ బాధపడుతుంది.


అమ్మ వాళ్ళని తలుచుకుంటేనే ఏడుపు ఆగడం లేదు పిన్ని అమ్మ ఒక దగ్గర నాన్న ఒక దగ్గర ఎప్పుడు కలుస్తారు. ఇద్దరితో కలిసి వద్దామని ఎదురు చూసినందుకు ఒక్కరూ కూడా లేకుండా పోయారు ఏంటి పిన్ని అని ఎమోషనల్ అవుతుంది. అమ్మానాన్నలు ఉన్నారు వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళ బాడీలు హాస్పిటల్ లో ఉండాలి కదా కానీ ఎక్కడా లేవు అంటే ఎక్కడో ప్రాణాలతో ఉన్నారు, ఇదే ఊరిలో ఇక్కడో ఎక్కడో ఉన్నారు మనం వెతుకుదాం అని అంటుంది. అందుకు ఇంద్రుడు కూడా సరే అంటాడు.


తరువాయి భాగంలో..


దీప రోడ్డు మీద వెళ్తూ ఉంటే కార్తీక్ ఫోటో పట్టుకుని మోనిత ఎదురు పడుతుంది. దీపని చూసి షాక్ అవుతుంది. నువ్వు బతికే ఉన్నావా అని మోనిత దీపని అడుగుతుంది. ఆపవే నీ నాటకాలు నా డాక్టర్ బాబుని తీసుకెళ్లింది నువ్వే కదా దీప కోపంగా అంటే హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్లడమెంటి దీప అని మోనిత అయోమయంగా అడుగుతుంది. కార్తీక్ నాదగ్గర ఉంటే పిచ్చిదానిలా ఇలా ఫోటో పట్టుకుని ఎందుకు తిరుగుతాను దీప కార్తీక్ కోసం పిచ్చిదాన్ని అయిపోతున్నా దీపా.. ఎవరు తీసుకెళ్లారు అని మోనిత ఏడుస్తూ ఎక్కడున్నావ్ కార్తీక్ అని ఏడుస్తుంది.


Also Read: నువ్వెవరో తెలియదన్న కార్తీక్, ఇన్విస్టిగేషన్ ప్రారంభించిన దీప, మోనిత ఎంట్రీకి టైమ్ వచ్చేసింది


Also Read: రిషి చేయించిన రింగ్ మెడలో వేసుకున్న వసు, మళ్లీ రంగంలోకి దిగిన దేవయాని-సాక్షి