స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'విక్రమ్'. ఈ మధ్యకాలంలో కమల్ హాసన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో వెండితెరపై కనిపించలేదు. దాదాపు మూడేళ్లుగా ఆయన నటించిన సినిమా ఏదీ కూడా విడుదలవ్వలేదు. 'ఇండియన్ 2' సినిమా సమస్యలు ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చాయి. త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారు కమల్. ఇక ఆయన ప్రస్తుతం 'విక్రమ్' సినిమాలో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఆయన నటిస్తోన్న సినిమా ఇది. 

ఆదివారం నాడు కమల్ హాసన్ పుట్టినరోజు కావడంతో 'విక్రమ్' సినిమా నుంచి ఫస్ట్ గ్లాన్స్ ను విడుదల చేశారు. ఇందులో కమల్ హాసన్ ఆయన అనుచరులు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. వారిపై పోలీసులు, రౌడీలు కాల్పులు జరుపుతారు. అయితే వారిని అడ్డుకోవడానికి ఇనుప కవచాలు వాడుతూ..  బుల్లెట్స్ కి ఎదురెళ్తాడు కమల్. ఈ మొత్తం టీజర్ లో కమల్ ని బాగా ఎలివేట్ చేశారు. టీజర్ ను బట్టి ఇది పక్కా మాస్ అండ్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. 

Also Read: బ్రేకప్ అయింది.. బాధలో ఉన్నా.. విజయ్ దేవరకొండ కామెంట్స్..

ఈ గ్లాన్స్ చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. . రాజ్ కమల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.మ‌హేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్‌హాస‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి