Kajal Aggarwal: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు ప్రకటించని ఈ సినిమాని ‘#NBK108’ అని పిలుస్తూ ఉంటారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘#NBK108’లో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలను కీలక పాత్రకు తీసుకున్నారు.
ఎవరూ ఊహించని విధంగా శ్రీలీలను ఈ సినిమా షూటింగ్ లో పరిచయం చేశారు మేకర్స్. అయితే ఈ చిత్రంలో ఆమె పాత్ర ఏమిటనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. శ్రీలీల.. బాలయ్య కు కూతురిగా నటించబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని వర్గాలు మాత్రం ఆమె శరత్ కుమార్‌కు కూతురుగా నటిస్తుందని అంటున్నారు. మూవీ టీజర్, ట్రైలర్ లేదా గ్లింప్స్ విడుదలయ్యాకే దీనిపై క్లారిటీ వస్తుంది.
గతంలో దర్శకుడు అనిల్ ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ఉంటుందని, బాలయ్య క్యారెక్టర్ ఎక్కువసేపు ఉంటుందని హింట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాలో శ్రీలీల కూతురి క్యారెక్టర్ చేస్తుందని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం 20 నుంచి 30 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చిందట శ్రీలీల. మూవీలో ఆమె పాత్ర కూడా ఎక్కువసేపు ఉండదని టాక్. అందుకే డెేట్స్ తక్కువగా ఉండటం తో ఈ మూవీకు ఓకే చేసిందట శ్రీలీల.
‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కు పరిచయం అయింది శ్రీలీల. ఈ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ. ఇప్పటికే ‘ధమాకా’ సినిమాతో మంచి హిట్ అందుకుంది శ్రీలీల. వీటితో పాటు పలు పెద్ద ప్రాజెక్టులలో శ్రీలీల భాగం అవ్వబోతోంది. బాలయ్య సినిమా షూటింగ్ తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది శ్రీలీల.
ఇక అనిల్ రావిపూడి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట. ఈ మూవీలో బాలకృష్ణ ను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించనున్నారని సమాచారం. మూవీలో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని అంటున్నారు. ఈ మూవీలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలకృష్ణ గత రెండు సినిమాలకు థమన్ పవర్ ఫుల్ సంగీతాన్ని అందించారు. తాజాగా మరోసారి బాలయ్య సినిమాకు థమన్ పనిచేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బేనర్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.