Jennifer Lawrence: హాలీవుడ్ సినిమాలపై ఆసక్తి ఉన్న వారికి జెన్నిఫర్ లారెన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. అందానికి అందం.. నటనకు నటన ఆమె సొంతం. హాలీవుడ్‌లో అత్యదిక పారితోషికం తీసుకునే మహిళల్లో ఆమె ఒకరు. ఆమె రేంజ్ కు చూస్తే.. అత్యంత ఖరీదైన కార్లు, మ్యాన్షన్లు, యాచ్‌లతో విలాసంగా జీవిస్తూ ఉంటారని అనుకుంటారు. కానీ ఆమె లైఫ్ స్టైల్ చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు.
ఏదైనా వేడుక కోసం సొంత కార్లో రావాల్సి వస్తే ఆమె వాడే కారు సెకండ్ హ్యాండ్ ఛెవర్లెట్ కారు. నిర్వాహకులు పంపే లగ్జరీ కార్లలో వస్తారు కానీ ఆమె సొంతం కాదు.సొంత డబ్బులతో కొనుగోలు చేసింది కేవలం సెకండ్ హ్యాండ్ చెవర్లేట్ కారు మాత్రమే. అలాగే ఆమె నివాసం ఉండే ఇల్లు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఆమె కోటల్లో నివాసం ఉండదు. ఓ చిన్న అపార్టుమెంట్ లో నివాసం ఉంటారు. అది కూడా సొంతం కాదు. నాలుగు వేల డాలర్లు చొప్పున అద్దె కట్టి అక్కడ ఉంటారు. ఇంట్లో లగ్జరీగా ఒక్క వస్తువు కూడా ఉండదు.సింపుల్ గా ఎలా లైఫ్ లీడ్ చేయాలో అలా చేస్తారు.
హాలీవుడ్ స్టార్ కాబట్టి ఆమె రోజువారి దిన చర్య మీద చాలా మంది కన్నేసి ఉంచుతారు. అంతే రహస్యం కాదు.. తాను ఉండే వీధిలోనే ఆమె వాకింగ్ చేస్తారు. అందరితోనూ కలిసి పోతారు. తానే పెద్ద స్టార్ ను కాదని.. తనను చూడాలంటే.. ఏదో రిస్క్ చేయాల్సిన పని లేననట్లుగా ఉంటారు. పేపరాజ్జీ తనపై లేనిపోనివి రాసే అవకాశం కల్పించరు. ఓ గ్యాలరిస్ట్ ను పెళ్లి చేసుకుని .. భర్తతో సింపుల్ గా జీవిస్తూ ఉంటుంది.
ఆదాయంతో పోలిస్తే అత్యంత పొదుపుగా జీవించే జెన్నిపర్ లారెన్స్ మరి తన ఆదాయాన్ని ఏం చేస్తుంది ?. పిసినారి తనంగా అంతా దాచి పెట్టుకుంటుందా.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుందా..అని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఆమె ఎలాంటి పెట్టుబడులు పెట్టదు. సంపాదించినది మొత్తం చారిటీకి ఉపయోగిస్తుంది. తన సౌకర్యాల కోసం అత్యంత తక్కువగా ఉంచుకుని మిగతా మొత్తాన్ని ఆపన్నుల సాయానికి ఖర్చు చేస్తూంటుంది. ఆస్పత్రుల్లో వైద్యం పొందలేని వారికి.. నిరుపేద కుటుంబాల్లోని చిన్న పిల్లకు విద్య, ఆహార ఖర్చులూ ఇస్తుంది. అందుకే జెన్నిఫర్ లారెన్స్ అందమైన గోల్డెన్ హార్ట్ అంటూంటారు.
సినిమా తారలు కాస్తంత లగ్జరీ లేకపోతే ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. కానీ జెన్నిఫర్ లారెన్స్ మాత్రం చిన్న లగ్జరీని కూడా కోరుకోరు. అత్యంత సింపుల్ లైఫ్‌తో అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు.