రాత్రంతా నిద్రపోకుండా 70కేజీల లడ్డులు చేసేశావా అని జానకిని రామ ఆశ్చర్యపోతాడు. పని అంతా ఒక్కతే చేసినందుకు మెచ్చుకుంటాడు. ఆ ఆర్డర్ రావడానికి కారణం అత్తయ్యని జానకి భర్తతో చెప్తుంది. దీని గురించి జ్ఞానంబ, గోవిందరాజులు మాట్లాడుకున్న విషయం జానకి చెప్తుంది. వాళ్ళ మాటలు విని మల్లిక షాక్ అవుతుంది. అమ్మ ఎవరికి తెలియకుండా ఇంత సహాయం చేసిందంటే చాలా ఆనందంగా ఉందని రామా అంటాడు. మనకే తెలియకుండా మనకి సహాయం చేశారంటే అత్తయ్య త్వరలో మాట్లాడతారని జానకి ధైర్యం చెప్తుంది. అదే జరిగితే మేము ఈ కొంపలోనే ఉండిపోవాల్సి వస్తుందని మల్లిక అనుకుంటుంది. వాళ్ళు సంతోషంగా మాట్లాడుకోవడం చూసి మల్లిక తిట్టుకుంటుంది. కోపంగా విష్ణు మొహం మీద చీరలు వేస్తుంది. వాటిని మడత పెట్టి ఐరన్ చేయించమని అంటుంది.


Also Read: కేఫ్ లో గొడవకు దిగిన లాస్య- తులసి చేసిన బర్గర్ తిని బిత్తరపోయిన కస్టమర్


తిక్కతిక్కగా ఉందా అని విష్ణు సీరియస్ అవుతాడు. మీ అన్నయ్య జానకికి నీళ్ళు పెడుతున్నాడని చెప్తుంది. మీ అన్నయ్య చేయగా లేనిది మీరు చేస్తే తప్పేముంది అని కాసేపు విష్ణుతో గొడవపడుతుంది. మన ముందు మాత్రం మాట్లాడకుండా ఉంటునట్టే ఉండి బయట నుంచి ఆర్డర్ వచ్చేలా చేస్తున్నారని నిజం చెప్పేస్తుంది. అది విని విష్ణు ఆశ్చర్యపోతాడు. పాటలు పాడుకుంటూ మలయాళం పాయసం చేస్తూ ఉంటే మల్లిక వస్తుంది. అందులో కరివేపాకు వేయడం లేదేంటి అని అడుగుతుంది. వెళ్ళి కరివేపాకు తీసుకుని రా అని బయటకి పంపించి ఎవరూ చూడకుండా జానకి బ్యాగ్ లో మల్లిక ఉంగరం వేస్తుంది. ఇంట్లో సునామీ సృష్టించేందుకు ప్లాన్ వేస్తుంది.


పాయసంలోకి కరివేపాకు వేయాలి కదా అని మలయాళం చెప్పేసరికి జ్ఞానంబ, గోవిందరాజులు షాక్ అవుతారు. ఏరి కోరి భలే వాడిని తీసుకొచ్చారని జ్ఞానంబ నవ్వుతుంది. నిజం చెప్పు అసలు నీకు వంట వచ్చా అని గోవిందరాజులు మలయాళం నిలదీస్తాడు. వామ్మో వంట మీద అనుమానం వచ్చిందని మలయాళం ఏదో చెప్పి కవర్ చేసేస్తాడు. కాలేజీకి వెళ్లేందుకు జానకి రెడీ అవుతుంటే మల్లిక తన ప్లాన్ అమలు చేస్తుంది. జానకి వెళ్లబోతుండగా పోయింది నా అదృష్టం అంతా పోయిందని మల్లిక ఏడుపు మొదలుపెడుతుంది. ఏమైందని గోవిందరాజులు అడుగుతాడు. తన ఉంగరం పోయిందని అది చాలా సెంటిమెంట్ అని మల్లిక చెప్తుంది. ఎక్కడైనా పెట్టి ఉంటావ్ సరిగా చూడమని జ్ఞానంబ చెప్తుంది.


Also Read: అభిమన్యుతో చేతులు కలిపిన విన్నీ- వేద కోసం పార్టీకి వచ్చిన యష్


అవసరం వచ్చి ఎవరైనా కొట్టేశారు ఏమో అని మల్లిక అంటుంది. నీ వస్తువులు కొట్టేయాల్సిన అవసరం ఏముంటుందని జ్ఞానంబ అడుగుతుంది. శుభమా అని జానకి వాళ్ళు బయటకి వెళ్తుంటే నువ్వు ఏంటని గోవిందరాజులు అంటాడు. వదినకి కాలేజ్ కి టైమ్ అవుతుందని వెళ్లనివ్వమని వెన్నెల అంటుంది. కానీ తన ఉంగరం దొరికే దాకా ఎవరిని బయటకి వెళ్లనిచ్చేది లేదని మల్లిక గొడవ చేస్తుంది. ఆదాయం తక్కువ ఎవరికి ఉంటే వాళ్ళు తీస్తారని మల్లిక నిందలు వేస్తుంది.