తెలుగు బుల్లితెరపై నవ్వుల పువ్వులు పూయించే కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. ప్రేక్షకులను బాగా అలరించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది కమెడియన్లు సినిమాల్లో హీరోలుగా, కమెడియన్లుగా రాణిస్తున్నారు. జబర్దస్త్ ద్వారా పలువురు లేడీ కమెడియన్లు సైతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. చక్కటి కామెడీ టైమింగ్ తో ఆడియెన్స్ ను అలరించారు. సత్య శ్రీ లాంటి లేడీ కమెడియన్లు సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు.
ప్రేమించి వ్యక్తితో జబర్దస్త్ పవిత్ర నిశ్చితార్థం
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన మరో లేడీ కమెడియన్ పవిత్ర. చూడ్డానికి బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ సూపర్ పంచులతో ఆకట్టుకుంటుంది. ఈ అమ్మాయి తాజాగా సోషల్ మీడియా వేదికగా కీలక విషయాన్ని వెల్లడించింది. త్వరలో సంసార జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు చెప్పింది. అంతేకాదు, తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. అయితే, గతంలో పెళ్లి గురించి ఫ్రాంక్ వీడియోలు చేసింది పవిత్ర. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా తన నిశ్చితార్థం అంటూ పెట్టిన ఫోటోలను మొదట్లో చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ, నిజంగానే ఎంగేజ్ మెంట్ జరుపుకున్నది. తన ప్రియుడు సంతోష్ తో నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకుంటూ ఫోటోలకు పోజులిచ్చింది.
ఏడాది తర్వాత ప్రేమకు గ్రీన్ సిగ్నల్
ఇక తన ప్రేమ కోసం ఏడాదిగా సంతోష్ ఎదురు చూస్తున్నట్లు పవిత్ర వెల్లడించింది. సంతోష్ తో నిశ్చితార్థం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెప్పింది. “నా జీవితంలో ఈ రోజు ఎంతో స్పెషల్. నా ప్రేమ కోసం ఎదురు చూస్తున్న సంతోష్ కు ఓకే చెప్పాను. అతడిని పెళ్లి చేసుకునేందుకు సరే అన్నాను. అనుకోకుండా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అతడు నా మీద చూపించే ప్రేమ ఎంతో నచ్చింది. నా కోసం, నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఎదురు చూపులు ముగిశాయి. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఇద్దరం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. ఇప్పుడు జీవిత భాగస్వామిగా నా జీవితంలోకి అడుగు పెట్టినందుకు ధన్యవాదాలు. ఇకపై ఇద్దరం కలిసి నడుద్దాం” అంటూ పవిత్ర రాసుకొచ్చింది. తమ ప్రేమకు అంగీకరించిన ఇరు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పింది.
గతంలోనే పవిత్రకు లవ్ ప్రపోజ్ చేసిన సంతోష్
వాస్తవానికి పవిత్ర, సంతోష్ ప్రేమ గురించి బుల్లితెర అభిమానులకు తెలుసు. గతంలో ఓసారి స్టేజి మీదనే ఆమెను ప్రపోజ్ చేశాడు. అప్పుడు తను ఎలాంటి సమాధానం చెప్పలేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సంతోష్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలోనూ పాల్గొన్నది. ఇప్పుడు తనే పెళ్లి చేసుకోబోతున్నది. ఈ సందర్భంగా నెటిజన్లు ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు.
Read Also: మన హీరోలనూ వదలని డీప్‌ఫేక్ గాళ్లు, ఈ వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial