బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షోకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షో స్టార్ట్ అయిన అతి కొద్ది కాలంలోనే టాప్ రేటింగ్ తో నెంబర్ వన్ స్థానం లోకి వెళ్లిపోయింది. దీంతో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ను కూడా స్టార్ట్ చేశారు. ఈ కామెడీ షోలో కంటెస్టెంట్‌లుగా చేస్తున్న చాలా మంది కమెడియన్‌లు ఇప్పుడు సెలబ్రెటీలుగా మారిపోయారు. సినిమాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇంకొంత మంది సొంతంగా యూట్యూబ్ చానెళ్లు పెట్టుకొని ఫేమస్ అయిపోతున్నారు. అలాగే ‘జబర్దస్త్’లో ప్రేమ జంటలకు కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. సుధీర్-రష్మీ నుంచి ఇమ్మాన్యూయేల్-వర్ష వరకూ అన్ని జంటలూ ఆన్ స్క్రీన్ లో సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో కొంత మంది నిజ జీవితంలో పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘జబర్దస్త్’లో మరో కొత్త జంట పెళ్లికి రెడీ అవుతోందట. అదే జబర్దస్త్ తేజ-పాగల్ పవిత్ర జంట. ఔనా? ఇదెప్పటి నుంచి? అస్సలు ఊహించలేదే అని అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా వారి పెళ్లి షాపింగ్ వీడియో చూడాల్సిందే.
తేజ, పవిత్రల పెళ్లి నిజమేనా?
‘జబర్దస్త్’లో చిన్న కంటెస్టెంట్ గా వచ్చి మంచి కమెడియన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు తేజ, పవిత్ర. ప్రస్తుతం వీరిద్దరూ కలసి చేసిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో తేజ-పవిత్ర ఇద్దరూ.. ‘‘మాకు పెళ్లి కుదిరింది. అందుకే పెళ్లి చీరలు కోసం షాపింగ్ చేయడానికి వచ్చాం’’ అంటూ ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. అక్కడ వీరు చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. పవిత్రను టార్గెట్ చేస్తూ తేజ వేసిన పంచ్ లు ఫన్నీగా ఉన్నాయి. షాపింగ్ చేస్తున్నంత సేపూ తేజ తన కామెడీ టైమింగ్ తో పవిత్రకు చిరాకు తెప్పించాడు. షాపింగ్ మాల్ లో సిబ్బందికి వీరికి మధ్య జరిగిన సంభాషణలు నవ్వు తెప్పించాయి. తేజ ఎంత చిరాకు తెప్పించినా పవిత్ర మొత్తానికి షాపింగ్ పూర్తి చేసి బిల్ మాత్రం తేజాకు తెలియకుండా అతని కార్డు నుంచే కట్టి రివేంజ్ తీర్చుకుంది.
అయితే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీరికి నిజంగా పెళ్లి ఫిక్స్ అవ్వ లేదని, ఓ వీడియో కోసం మాత్రమే వీరు పెళ్లి పేరుతో షాపింగ్ చేశారని తెలుస్తోంది. వీడియో దేనికోసం చేసినా చాలా ఫన్నీగా ఉందని.. తేజ, పవిత్ర కాంబినేషన్‌లో కామెడీ అదిరిపోయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ‘జబర్దస్త్’ పవిత్ర ఇల్లు చూశారా? నాన్న లేరు, ఇంటి బాధ్యతలన్నీ ఆమెవే, ఆ నవ్వుల వెనుక ఎంత బాధ!