Attack On Hyper Adi: హైపర్ ఆది. తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చాడు. చక్కటి కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. నెమ్మదిగా అదిరిపోయే పంచులతో పాపులర్ అయ్యాడు. అదిరిపోయే కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జబర్దస్త్’  షో మాత్రమే కాకుండా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, ‘ఢీ’ షోలలోనూ అలరిస్తున్నాడు. తన మార్క్ పంచులతో నవ్వుల పువ్వులు పూయిస్తున్నాడు. ఓవైపు బుల్లితెరపై రాణిస్తూనే మరోవైను సినిమాల్లోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 20కి పైగా సినిమాల్లో నటించాడు. సినిమాల్లోనూ తన మార్క్ పంచ్ డైలాగులుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.  


హైపర్ ఆదిని కొట్టిన ఒంగోలు వాసులు?


ఇక అమ్మాయిపై హైపర్ ఆది వేసే పంచులు బాగా ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి ఆయన వేసే డబుల్ మీనింగ్ డైలాగులు, సటైర్లు నవ్వించినా, మరికొన్నిసార్లు చికాకు పుట్టిస్తాయి. కొద్ది రోజుల క్రితం ఒంగోలులో ఓ ఈవెంట్ కు వెళ్లారట హైపర్ ఆది. అక్కడ ఓ అమ్మాయి పట్టుకుని డబుల్ మీనింగ్ పంచ్ వేశారట. దీంతో ఆ అమ్మాయికి చిర్రెత్తుకొచ్చి విషయం తన వాళ్లుతో చెప్పిందట. అందరూ కలిసి హైపర్ ఆది వీపు విమానం మోత మోగించారట. ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ వార్తలపై ఇప్పటి వరకు హైపర్ ఆది ఎలాంటి వివరణ ఇవ్వాలేదు.


దాడి గురించి అసలు విషయం చెప్పిన ఆది


తాజాగా ఈ వార్తల గురించి హైపర్ ఆది స్పందించారు. అసలు ఏం జరిగింది? అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. జోర్దార్ సుజాత హోస్ట్ గా ఓ ఛానల్ లో ‘జోర్దార్ పార్టీ విత్ సుజాత’ పేరుతో ఓ టాక్ షో రన్ అవుతుంది. రీసెంట్ గా హైపర్ ఆది ఈ షోలో పాల్గొన్నారు. తన షోకు గెస్టుగా వచ్చిన ఆది నుంచి సుజాత ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఓ అమ్మాయిని అల్లరి చేసినందుకు ఒంగోలులో కొట్టారంట కదా? అని అడిగింది. దీంతో హైపర్ ఆది వివరణ ఇచ్చారు.


తాను స్కిట్లలో అమ్మాయిల పట్ల కామెంట్స్ చేసినంత మాత్రాన బయట అమ్మాయిలతోనూ అలాగే మాట్లాడుతాను అనుకుంటే పొరపాటు అన్నారు. నేను బయట అమ్మాయిలతో అసలు మాట్లాడను అని చెప్పారు. తన గురించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. మొత్తంగా ఇన్నాళ్లు ఆది గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయిందని కొందరు అంటుంటే, ఎవరైనా తన్నులు తింటే తిన్నాం అని చెప్తారా? అలాగే ఆది కూడా ఏం జరగలేదని చెప్తున్నారంటూ మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. అమ్మాయిలతో అస్సలు మాట్లాడను అని ఆది చెప్పడమే అబద్దం అని ఇంకొంత మంది అంటున్నారు.


Read Also: ‘హనుమాన్‘తో ‘శ్రీఆంజనేయం‘ - ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేసిన తేజ సజ్జ