థియేటర్లలో గణతంత్ర దినోత్సవం నాడు నైట్రో స్టార్, యువ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) సందడి చేశారు. ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తాజా సినిమా 'హంట్' (Hunt Telugu Movie) జనవరి 26న విడుదల అయ్యింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... అతి త్వరలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది.
ఫిబ్రవరి 10న ప్రైమ్‌లో 'హంట్'!
Hunt Movie OTT Release On Amazon Prime Video : 'హంట్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకు... అంటే 16 రోజుల్లో ఈ సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది.
షాక్ ఇచ్చిన సుధీర్ బాబు'హంట్' సినిమాలో సుధీర్ బాబు డిఫరెంట్ రోల్ చేశారు. ఆన్ స్క్రీన్ గే (స్వలింగ సంపర్కుడి) పాత్రలో కనిపించారు. ఆయన అటువంటి రోల్ చేయడం చూసి చాలా మంది ఆడియన్స్ షాక్ అయ్యారు. సినిమా విడుదలైన మరుసటి రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సుధీర్ బాబు... తాను రెగ్యులర్ సినిమాలు చేయనని తెలిపారు.
''నేను రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పటి వరకు చేసిన చిత్రాలన్నీ డిఫరెంట్ సినిమాలే. ఇప్పుడీ 'హంట్' కూడా చాలా డిఫరెంట్ సినిమా'' అని సుధీర్ బాబు అన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన 'హంట్'లో సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. మహేష్ దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషంగా ఉందని హీరో, దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి
మొదట భయపడిన మాట వాస్తవమే!
'హంట్' విడుదలకు ముందు, తర్వాత క్లైమాక్స్ గురించి డిస్కషన్ నడిచింది. ఈ సినిమా మలయాళ హిట్ 'ముంబై పోలీస్'కు రీమేక్ అని ప్రచారం జరిగింది. స్టోరీ బాబీ - సంజయ్ అని టైటిల్ కార్డ్స్‌లో వేయడం ద్వారా ఒరిజినల్ రైటర్లకు మూవీ యూనిట్ క్రెడిట్స్ ఇచ్చింది. సో... ఆ విషయంలో క్లారిటీ వచ్చింది.
Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
సినిమా విడుదలకు ముందు క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని తనకు ఆసక్తిగా ఉందని సుధీర్ బాబు తెలిపారు. ఆ విషయంలో తాము భయపడిన మాట వాస్తవమేనని ఈ రోజు సక్సెస్ ప్రెస్‌మీట్‌లో ఆయన చెప్పారు. అయితే... చివరి 20 , 30 నిముషాలకు అద్భుత స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. ''సినిమాకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకులంతా సెకండాఫ్‌లోని 30 మినిట్స్ ఎక్సట్రాడినరీ అని చెబుతున్నారు. థియేటర్లలో సినిమా చూడండి'' అని సుధీర్ బాబు చెప్పారు.
'హంట్'లో హీరోయిన్ ఎవరు లేరు. ఒక్కటంటే ఒక్క సాంగ్ మాత్రమే ఉంది. అది కూడా ఐటమ్ సాంగ్. ఇటువంటి కథ చేయడానికి ముందుకు వచ్చిన సుధీర్ బాబుకు దర్శకుడు మహేష్ హ్యట్సాఫ్ చెప్పారు.