Chiranjeevi :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా ఒకర్ని మించి మరొకరు దూసుకెళ్తున్నారు. కెరీర్లో ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు సైన్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటున్నారు. వీళ్లతో పాటూ సీనియర్ హీరోలు కూడా పోటీపడుతున్నారు. వార్ 2 పోటాపోటీగా బరిలో దిగిన రజనీకాంత్ ప్రేక్షకాదరణ, సక్సెస్ విషయంలో పైచేయి సాధించారు. ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి కలెక్షన్లలో వార్ 2 కన్నా కూలీనే ఎక్కువ వసూలు చేసింది. అయినప్పటికీ కూలీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదన్నది ప్రేక్షకుల అభిప్రాయం. లోకేష్ కనగరాజ్ గత చిత్రాలతో పోల్చుకుంటే కూలీ నిరాశపర్చింది..కానీ..సూపర్ స్టార్ క్రేజ్, స్టైల్, నాగ్ స్వాగ్ మూవీని నడిపించింది. 

ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజైన పెద్ద సినిమాలేవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. హరిహరవీరమల్లు కూడా కేవలం పవన్ ఫ్యాన్స్ ని మెప్పించింది. VFX వర్క్ విషయంలో ఓ రేంజ్ లో విమర్శలు ఎదుర్కొంది హరిహరవీరమల్లు.ఇక రీసెంట్ గా వచ్చిన వార్ 2 గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. RRR, దేవర 2తో ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న తారక్  బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు ఇది సరైన సినిమా అనిపించుకోలేదు. అసలు ఈ ప్రాజెక్టుకి కేటాయించిన సమయం మన తెలుగు దర్శకులకు ఇచ్చి ఉంటే లెక్క మరోలా ఉండేది. NTR కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ పడేది. వరుస ఫ్లాపుల్లో ఉన్న  విజయ్ దేవరకొండ..కింగ్డమ్ తో గట్టెక్కేస్తాననుకున్నాడు. మంచి అంచనాలతో రిలీజైన ఈ మూవీకూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.  

విశ్వంభర వైపే అందరి చూపు!

పెద్ద సినిమాలన్నీ ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేయడంతో వాట్ నెక్ట్స్ అంటే విశ్వంభర అని ఆన్సర్ వస్తోంది. ఓజీ, అఖండ 2 దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కు సిద్ధమవుతున్నాయ్. అయితే వీటికన్నా ముందే విశ్వంభర రాబోతోందని టాక్..లేదంటే దసరాకి తమ్ముడు వస్తే దీపావళికి అన్నయ్య వచ్చే ఛాన్స్ ఉంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వంభర టీజర్ మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా వస్తుందని టాక్. ఇదే రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. వాస్తవానికి ఏడాది ఆరంభంలో రావాల్సిన విశ్వంభర VFX వర్క్స్ కారణంగా ఆలస్యం అవుతోంది.  

ఆగష్టు 22 న టీజర్ వస్తుందా?

2025 ఆగష్టు 22న వచ్చిన టీజర్ పై విమర్శలు వెల్లువెత్తాయ్. ఏకంగా VFX టీమ్ ని మార్చేసే రేంజ్ లో సోషల్ మీడియాలో ఏకిపడేశారు.  అందుకే రిలీజ్ కాస్త ఆలస్యం అయినా కానీ క్వాలిటీపై కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే వార్ 2 లో జరగాల్సిన డ్యామేజ్ కన్నా ఎక్కువే జరిగింది. అసలే సోషల్ మీడియాలో ట్రోలింగ్ బ్యాచ్ లు యాక్టివ్ గా ఉంటాయ్. అందుకే ప్రతి ఫ్రేమ్ చెక్ చేసుకున్నాకే రిలీజ్ చేయడం మంచిదన్నది విశ్వంభర టీమ్ ఆలోచన. కుదిరితే టీజర్ లేదంటే పోస్టర్ తో సరిపెట్టాలని ఫిక్సయ్యారట. ఏం జరుగుతుందో చూద్దాం.. 

పెద్ద సినిమాలేవీ సౌండ్ లేవ్!

అయితే.. ఇప్పటివరకూ వచ్చిన పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సౌండ్ చేయలేకపోయాయి.  అందుకే విశ్వంభర రిజల్ట్ ఎలా ఉంటుందో అనే డిస్కషన్ జరుగుతోంది. మరి విశ్వంభర రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం..