గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 21st Today Episode 587)


రిషి ముందు జగతి-మహేంద్రని ఇరికించిన దేవయాని..రిషి వెళ్లిపోయిన తర్వాత వాళ్లిద్దర్నీ టార్గెట్ చేస్తుంది. మీరేం తల్లిదండ్రులు, మీరు ఇంట్లోంచి వెళితే అయినా రిషి ప్రశాంతంగా ఉంటాడు అనిపిస్తోందని ఇన్ డైరెక్ట్ గా పొమ్మని చెబుతుంది. ఆ మాటలు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు జగతి-మహేంద్ర. ఇలా మాటలు పడడం నావల్ల కాదు ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అనుకుంటారు. దేవయాని అక్కయ్య అన్న మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయని జగతి అంటే.. సమాధానం ఇవ్వాలి లేదంటే పరిష్కారం ఆలోచించాలంటాడు మహేంద్ర. 


వసు దగ్గరకు వెళ్లిన రిషితో..ఏంటి సార్ సడెన్ గా వచ్చారని అడిగితే..రావాలనిపించిందని రిషి..చూడాలనిపించిందని వసు అంటారు. ఇద్దరూ ఓ దగ్గర ఒకరికొకరు చేరబడి కూర్చుని మాట్లాడుకుంటారు.నమ్మకం, ప్రేమ, చీటకి, వెలుగు , చినుకులు, మనిద్దరం అంటూ  మాట్లాడుకుంటారు. ‘ఈ సమయం నాకు చాలా ఆనందంగా ఉంది వసుధార’ అని రిషి అంటే ‘అందుకే ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా.. మన ఇద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి కారులో పెట్టేశాను’ అంటుంది వసు. రిషి షాక్ అవుతూ హా.. అంటూ వెనక్కి తిరగడంతో.. డైరెక్ట్‌గా వసు రిషి ఒడిలోకి వాలిపోతుంది...కాసేపు చూపులు కలసి అలాగే ఉండిపోతారు.


Also Read: శౌర్య ని ఫాలో అవుతున్న కార్తీక్ -దీప, ట్యాబ్లెట్స్ బయటపడడంతో మోనితలో టెన్షన్


లగేజ్ సర్దుకుని వచ్చిన మహేంద్రని చూసి నిజంగా ఇంట్లోంచి వెళుతున్నామా అని అడుగుతుంది.
మహేంద్ర: అక్కయ్య అందికదా రిషి ప్రేమకు మనమే శత్రువులం అని..మనం వెళ్లిపోవడమే పరిష్కారం జగతి.. ఈ ఇంటికి ఈ బంధాలకు ఇక ఎలాంటి సంబంధం లేదు పద.. అంటూ..రిషి,మహేంద్ర కలిసి దిగిన ఫొటో ఫ్రేమ్ అందుకుని మారిపోతున్నాను అన్నావ్ కదా నాన్నా.. మారిపోయానో.. పారిపోతున్నానో..’ అంటూ ఎమోషనల్‌గా ఆ ఫొటోకి ముద్దు పెట్టుకుని.. ఫ్రేమ్ నుంచి ఆ ఫొటో తీసి.. తన జేబులో పెట్టుకుంటాడు. ఆ ఫ్రేమ్ మీద ఏదో రాసి బయలుదేరుతాడు. 
కన్నీళ్లతో అత్యంత బాధగా...కారు దగ్గరకు వెళ్లి వెనక్కు చూస్తారు...పైనుంచి చూస్తున్న దేవయాని ఓపనైపోయిందుకుని క్రూరంగా నవ్వుకుంటుంది..


Also Read: రిషి ముందు జగతి మహేంద్రని బుక్ చేసిన దేవయాని, ధీమాగా ఉన్న వసు


అదే సమయంలో రిషి..మళ్లీ జీవితం, అమావాస్య, వెన్నెల గురించి మాట్లాడుతాడు. మనం మనగురించి మాత్రమే మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది..ఇది ఇలాగే కొనసాగేలా చూద్దాం వసుధారా..ఎప్పుడూ గలగలా మాట్లాడుతుంటావ్ కదా ఈరోజు నేను మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉన్నావ్
వసు: మీరు మాట్లాడుతుంటే వినడం, మీరు నవ్వితే చూడడం సంతోషంగా ఉంటుంది. మీ ఫోన్లో నా పేరు పొగరు అని ఎదుకుంది
రిషి: చిన్నపిల్లలకు అందమైన పేర్లున్నా చిన్ను, చింటి, బుజ్జి అని ఎందుకు పిలుస్తారు
వసు: అవి ముద్దుపేర్లు...
రిషి: నీ పేరు బావుంది..ఎన్నోసార్లు ఎందరో పిలుస్తారు..అందిర ఫోన్లో అదే పేరు ఉంటుంది..కానీ ‘నువ్వు నాకు స్పెషల్ కదా వసుధార.. అందుకే నీకు ముద్దుగా పొగరు అని పేరు పెట్టుకున్నా.. పొగరు అంటే తిట్టు అనుకున్నావా? కాదు.. ప్రేమ.. ఈ పిలుపు నాకే సొంతం..’
వసు: ఈ రోజు ఏంటో గుండె తట్టుకోలేనంత ఆనందంగా ఉంది
రిషి: కానీ ఇలాంటప్పుడే భయమేస్తోంది
వసు: భయమెందుకు సార్
రిషి: నేను ఎవరిని ఇష్టపడినా.. వాళ్లు నాకు దూరం అయిపోతున్నారు ఏంటో.. మనం కూడా..’ అని ఆవేదనంగా మాట అనబోతుంటే.. ‘సార్.. అలా అనకండి సార్..’ అంటూ తన చేతిని రిషి నోటికి అడ్డం పెడుతుంది వసు.
రిషి: అయినా నాకంటూ నేను ఇష్టపడేవాళ్లు ఎవరు ఉన్నారు? నువ్వు డాడ్ అంతే కదా.. డాడ్‌ అంటే నాకు ప్రాణం.. నా సంగతి కాదు..డాడ్ నన్ను చూడకుండా ఉండలేరు తెలుసా?’ అంటూ మహేంద్ర గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు రిషి.


జగతి మహేంద్ర ఓ కారులో..రిషి వసు మరో కారులో వెళుతుంటారు... మనసుకి ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని రిషి అంటే.. అదే సమయంలో మహేంద్ర గుండె బరువెక్కిపోతోంది జగతి.. రిషికి నేను దూరంగా వెళుతున్నాను జగతి..ఇది  కలైతే బావుండేది కదా అంటాడు. రిషి ఆనందం కోసం మనిద్దరం కలసి రిషికి అందిస్తున్న కానుక అనుకుందాం అంటుంది జగతి. ఆ దేవుడు నాకిచ్చిన కానుక నువ్వు అని రిషి ..లేదు లేదు మీరే నాకు కానుక అని వసు అంటారు...