గుప్పెడంతమనసు జనవరి 5 గురువారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 5th Update)


గురువారం ఎపిసోడ్ లో
జైల్లో ఉన్న వసుధార దగ్గరకు వెళతాడు రిషి... మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు వెళ్లిపోండని అంటుంది వసుధార. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదా అని క్వశ్చన్ చేస్తాడు రిషి..వెళ్లిపోమ్మంటున్నా కదా అని సీరియస్ గా రిషివైపు తిరుగుతుంది వసుధార...అప్పుడు మెడలో తాళి చూసి రిషి షాక్ అవుతాడు.. జగతి-మహేంద్ర కూడా అక్కడే ఉంటారు. 
ఆ తాళి అని జగతి అడిగితే...దానికి నాకు సంబంధం లేదు ఆ తాళి నేను కట్టలేదంటాడు రిషి...ఆ పక్కనే నిల్చున్న రాజీవ్ ఇదంతా విని షాక్ అవుతాడు.. ఆ తాళి రిషి కట్టకపోతే వసు మెళ్లోకి ఎలా వచ్చిందని రాజీవ్ ఆలోచనలో పడతాడు. అంటే రాజీవ్..పెళ్లిచేసేసుకున్నాడని రిషి ఆలోచనలో పడతాడు.. మొత్తానికి గురువారం ఎపిసోడ్ ...గుప్పెడంత మనసు సీరియస్ ని మరోమలుపు తిప్పనుంది



Also Read: వెళ్లిపొమ్మన్న వసు, అల్లాడిపోయిన రిషి - మెడలో నల్లపూసలు చూసి రాజీవ్ షాక్!


బుధవారం జరిగిన కథ
ఇంటికి వచ్చిన రిషి వసుధారని పెళ్లిబట్టల్లో చూసి కంగారుపడతాడు..ఏం జరుగుతోంది వసుధారా మనం వెళ్లిపోదాం రా అని అడిగితే..రిషి చేయి విసిరికొట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అరుస్తంది.  నన్ను వెళ్లిపోమంటున్నావా .. మనిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం కదా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కదా నిన్ను ఎవరైనా బెదిరించారా అని అడుగుతాడు. అయినా వసు మాట్లాడకుండా రిషిని దూరంగా నెట్టేస్తుంది. మహేంద్ర-జగతి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం ఉండదు. వాళ్లని కూడా వెళ్లిపొమ్మని అంటుంది. జగతి కోపంతో రగిలిపోతూ వసుధార చెయ్యి పట్టుకుని పిచ్చి పట్టిందా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు...ఈ పెళ్లేంటి,  నువ్వు పెళ్లి కూతురుగా రెడీ అవ్వడం ఏంటి? నీ పెళ్లి గురించి మాట్లాడడానికి కదా రమ్మన్నావు. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు ఏమైంది వసు అని కోపంతో మాట్లాడుతుంది. మహేంద్ర కూడా ఏంటమ్మా ఇదంతా అని అడుగుతాడు...ఇది మా ఇంటి సమస్య మీరు వెళ్లిపోండని చెబుతుంది వసుధార. అప్పుడు మహేంద్ర వెళ్దాం పద జగతి లేకపోతే మేడం మెడబట్టి బయటకు గెంటించేలా ఉంది అని వెళ్లిపోతారు. 


Also Read: దీపను చంపేసి కార్తీక్ ను పెళ్లిచేసుకుని ఇంటికొస్తానన్న చారుశీల, సౌందర్యలో మొదలైన అనుమానం


రాజీవ్, చక్రపాణి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు పెళ్లి పీటలపై కూర్చున్న రాజీవ్..వసుధారని తీసుకురమ్మని చెబుతాడు. లోపలకు వెళ్లిన సుమిత్ర..వసుధారని బాధగా చూస్తుంది. అప్పుడు వసుధార మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది. వసుధార: ఏంటమ్మా అలా చూస్తున్నావ్ వెళ్దాం పద అని బయటకు పెళ్లి పీటల మీద కూర్చుంటుంది.
రాజీవ్: పంతులు గారు మంత్రాలు చాలు  మాంగల్యధారణ జరిపించండి
వసుధార:నాది చిన్న సందేహం మెడలో ఒక మంగళసూత్రం ఉన్న తర్వాత మరొక మంగళసూత్రం కట్టొచ్చా అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. 
పంతులు: రెండు తాళిబొట్లు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు
వసు: అదే మాట ఈ పెళ్లి కొడుక్కి చెప్పండి 
రాజీవ్: నా నుంచి తప్పించుకునేందుకు నువ్వు కొత్త డ్రామా ఆడుతున్నావా..ఆ తాళి తెంచైనా నీ మెళ్లో తాళికడతా అంటాడు రాజీవ్..
వసుధార: దగ్గరకు వస్తే చంపేస్తాను బావా అని అరుస్తూ..రాజీవ్ ఎంత దుర్మార్గుడో తండ్రికి చెప్పేందుకు ప్రయత్నిస్తుంది కానీ చక్రపాణి అస్సలు వినడు
రాజీవ్-వసుధార మధ్యలోకి చక్రపాణి రావడంతో..ఇద్దరూ నెట్టుకున్నప్పుడు చక్రపాణి దూరంగా పడి తలకు దెబ్బతగులుతుంది. దగ్గరకు వస్తే చంపేస్తాను బావా అంటు దీపం చేతిలోకి తీసుకుంటుంది...