గుప్పెడంత మనసు డిసెంబరు 15 ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 15th Update Today Episode 634)


దేవయాని కాలేజీ స్టాప్ తో మాట్లాడుతూ ఒక్కొక్కసారి మనం ఓడిపోయి ఎదుటివారిని గెలిపించాలి. ఇక్కడికి జరిగింది కూడా అదే. ఇప్పుడు వసుధార కాదు గెలిచింది నేను అని అంటుంది దేవయాని. కాలేజీ స్టాఫ్ కి.. దేవయాని మాటలు అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. రిషిపై ప్రేమ చూపించినట్టు నటిస్తాను కానీ నేను చేసేది నేను చేస్తానుయ. జగతి మేడం స్థానంలో వసుధార కూర్చుంటే మన కూర్చుని చప్పట్లు కొడదామా అని వాళ్ళు అడగడంతో.. గెలుపు వచ్చిందనే సంతోషంలో వాళ్లుండగా మనం ఊహించిన దెబ్బ కొట్టాలని చెబుతుంది. 


Also Read: పండరి మోనిత మనిషా, కార్తీక్-దీప మళ్లీ విడిపోతారా, సౌందర్య ఏం చేయబోతోంది!


జగతి వసుధార ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. కంగ్రాట్యులేషన్స్ వసు ఇది నీకు పెద్ద విజయం అనడంతో ఇది నా విజయం కాదు మేడం మీది రిషి సార్ ది అని అంటుంది. నా గెలుపుని ఆపాలని చాలామంది లోపల ప్రయత్నాలు చేశారు లేండి అంటే నేను చూశాను అంటుంది జగతి. రిషి మనసులో గొప్పదానిగా నిలిచిపోవాలని దేవయాని అక్కయ్య ఆలోచన అందుకే అలా చేసిందని క్లారిటీ ఇచ్చిన జగతి..నీ పనిని నువ్వు సమర్థవంతంగా పూర్తిచేయి అని చెబుతుంది. ఇంతలో కాలేజీ స్టాఫ్ అక్కడకు వచ్చి కంగ్రాంట్స్ చెబుతారు. 
వసు: నా గెలుపును ఆపాలని చాలామంది కష్టపడ్డారు 
కాలేజీ స్టాఫ్: అభిప్రాయాలు చెప్పమన్నారు అంతే కదా. అయినా నీ తెలివితేటలు చూస్తుంటే ముచ్చటేస్తోంది. నువ్వు ఎంత తెలివైనదానివంటే భలేగా బుట్టలో వేసుకుంటావ్.. రిషి సార్ ని బుట్టలో వేసుకోపోతే నీ ఆటలు ఇలా సాగుతాయా చెప్పు
వసు: మేడం మర్యాదగా మాట్లాడండి..
కాలేజీ స్టాఫ్: నేను మర్యాదగానే మాట్లాడుతున్నా..నువ్వు ఈ కాలేజీలో పేరుకే స్టూడెంట్ వి ఎండీ తర్వాత ఎండీ తర్వాత లాంటిదానివి కదా.. నీతో వైరం పెట్టుకుంటే మాకు మనుగడ లేదని ఇప్పుడే తెలుసుకున్నాం. నీకు ఇంత చిన్న వయసులో ఇంతలా ఎదిగిపోయావ్..నీకు ఎలా సాధ్యమైంది..ఎదుటి వారి బలహీనత తెలుసుకోవడమే బలం అన్నట్టు రిషి సార్ బలహీనతలు వసు కనిపెట్టేసి ఇలా ఎదిగింది
వసు: మేడం ఆపుతారా అని అరుస్తుంది
కాలేజీ స్టాఫ్: నీకు రిషి సార్ సపోర్ట్ లేదా.. అర్థరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా మీరు కార్లో షికార్లు చేయడం తెలిసిన విషయమే కదా.. లివిన్ టుగెదర్ మాటలు వినడమే కానీ ప్రత్యక్షంగా ఇక్కడే చూస్తున్నాం..
వసు: దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి..మీరు లెక్చరర్లు కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నాను వెళ్లండి..
కాలేజీ స్టాఫ్: కోపం ఎందుకు..నీ విజయాలు, నీ గొప్పలు, నీ ఆదర్శాల వెనుకా రిషి సార్ లేరా... ఓ స్త్రీ విజయం వెనుక రిషి సార్ ఉన్నారు..నువ్వు జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం అని వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతారు..


Also Read: ఈ మనిషే నీవాడు వసుధార, చిన్న పిల్లాడిలా మురిసిన రిషి - ఆఖరి నిముషంలో ఝలక్ ఇచ్చిన దేవయాని


ఆ తర్వాత వసుధార ఆటోలో వెళుతూ కాలేజీ స్టాప్ అన్న మాటలు తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు రిషి వసుధార కోసం వెతుకుతూ ఉండగా ఇప్పుడే కాలేజీ బయటకు వెళ్లడం చూశాను అని అంటాడు మహేంద్ర.జరిగిన విషయం మొత్తం జగతికి చెప్పి బాధపడుతుంది. కాలేజీ స్టాప్ కి అంత ధైర్యం ఎలా వచ్చిందో  వాళ్ళ వెనకాల ఎవరున్నారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అనడంతో దేవయాని ఎంట్రీ ఇస్తుంది. 
దేవయాని: మీ గురు శిష్యులు ఇలా ఉంటే నాకు చూడ్డానికి ఎంత సంతోషంగా ఉందో అని వెటకారంగా మాట్లాడుతుంది
జగతి: వసుధార ఇప్పటికే బాధలో ఉంది తనని మీరు ఏమి అనకండి 
దేవయాని: సిగ్గు లేకుండా ఇక్కడికి వస్తావని అనుకోలేదు వసుధార అనడంతో మర్యాదగా మాట్లాడండి అక్కయ్య అని అంటుంది జగతి. అప్పుడు దేవయాని మర్యాద అంటే ఏమిటి జగతి అర్ధరాత్రి అపరాత్రులు కలిసి తిరగడమేనా మర్యాద అంటే అని అంటుంది.నేను ఎక్కడికి వెళ్ళినా నా హద్దుల్లో నేను ఉంటాను అని అనగా వెంటనే దేవయాని హద్దుల గురించి నువ్వు మాట్లాడకు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. దేవయాని మాటలకు సీరియస్ అవుతుంది వసుధార..దేవయాని అంటే చాలా తక్కువ అంచనా వేస్తున్నావ్..నేను నీపై కరెక్ట్ గా దృష్టిపెడితే ఏమవుతుందో తెలుసా....
వసుధార: మేడం నేను ఇంటికి వస్తే మీకేంటి ఇబ్బందని అడిగితే నీకున్న హక్కేంటని క్వశ్చన్ చేస్తుంది.  ఈ ఇంటికి రావడానికి నీకు ఏం హక్కుందని రివర్స్ లో అడుగుతుంది దేవయాని....  ఏ అర్హత గురించి అడుగుతున్నారో అది అర్హతతో ఇదే ఇంట్లో నేను అడుగు పెడతాను అంటుంది. మీ రేంటో మీ బుద్ధులేంటో రిషి సార్ కి తెలిసేలా చేస్తాను  అనేసి వెళ్లిపోతుంది...


ధరణి పిలుస్తుండగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంది వసుధార. అదే సమయానికి కాలేజీ నుంచి గులాబీపూల బొకే తీసుకుని బయలుదేరుతాడు రిషి... అటు ఇంట్లో దేవయాని మాత్రం సంతోషంగా ఉంటుంది..