అనసూయ గుడిలో నందు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళు రావడంతో సంతోషిస్తుంది. వాడికి జనరల్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది, ఆ సంతోషంలో నా పేరు మీద పూజ చేయించాలని నన్ను రమ్మని అడిగారు గుడికి రమ్మని చెప్పాను వచ్చారని చెప్తుంది. వాడి సంగతి నీకు తెలియదా అని పరంధామయ్య అంటాడు కానీ అనసూయ మాత్రం నందు, లాస్యని ఆశీర్వదిస్తుంది. అందరూ కలిసి అమ్మవారికి పూజ చేయించడానికి వస్తుంది. తులసి పూజ చేయించబోతుంటే ఆపి మేము చేయిస్తామని లాస్య అంటుంది. శ్రుతి, అంకితలతో ముడుపులు కట్టిస్తుంది తులసి. నాకు అన్నయ్య వాళ్ళతో ఆడుకుని బోర్ కొడుతుంది ఛేంజ్ కావాలి మేనల్లుడో, మేనకోడలో కావాలని దివ్య అనేసరికి అయితే నువ్వే ముడుపు కట్టు త్వరగా పెళ్లి అయిపోతుందని అంటుంది.


ఇద్దరు కోడళ్ళు కలిసి ముడుపులు కట్టేందుకు చూస్తుంటే చెట్టు అందడు. ముడుపులు కట్టడానికి భర్తలని సాయం చేయమని పంతులు చెప్తాడు. దీంతో ఇద్దరు వెళ్ళి వాళ్ళ వాళ్ళ భార్యల్ని ఎత్తుకుని ముడుపులు కట్టిస్తారు. ఇక కాలనీలో దసరా సంబరాలు మొదలవుతాయి. ఆ వేడుకకి హనీ కూడా వస్తుంది. తులసిని బతుకమ్మ పాట పాడి సంబరాలు మొదలుపెట్టమని కాలనీ ప్రెసిడెంట్ అడుగుతుంది. అందరూ కలిసి బతుకమ్మ ముందు డాన్స్ చేస్తూ సరదాగా ఉంటారు. లాస్య మాత్రం సామ్రాట్, తులసి మధ్య ఉన్న రిలేషన్ పూర్తిగా తెగిపోయేలా చేస్తేనే నాకు నిజమైన దసరా అని అనుకుంటుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే హనీని అవకాశంగా మార్చుకుంటుంది. తన దగ్గరకి వెళ్ళి మాయమాటలు చెప్తుంది. మీ నాన్న రాలేదు ఏంటి అని అడుగుతుంది.


Also Read: సూపర్ ట్విస్ట్, పూలదండలతో ఇంటికి వచ్చిన రిషిధార- ఖంగు తిన్న దేవయాని


మీ నాన్నని వదిలేసి ఒక్కదానివే ఎంజాయ్ చేస్తావా? మరి మీ మీ నాన్న ఇక్కడే అలా ఇంట్లో ఉంటే బాగుంటుందా అని ఉసిగొల్పుతుంది. లాస్య ఫోన్ తీసుకుని హనీ సామ్రాట్ కి ఫోన్ చేస్తుంది. సడెన్ గా కడుపులో నొప్పిగా ఉంది, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్లు ప్లీజ్ అని అడుగుతుంది. సామ్రాట్ వెంటనే కంగారుగా బయల్దేరతాడు. తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది. సంబరాల్లో భాగంగా రకరకాల గేమ్స్ ఆడుతూ కాలనీ వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా భర్త చేసిన సైగలు బట్టి భార్య అదేంటో గుర్తు పట్టాలి అని చెప్తుంది. అంకిత, అభి ఆడేందుకు వెళ్తారు. ఒక సినిమా పేరు ఇచ్చి అభిని సైగల ద్వారా చెప్పమంటారు కానీ అంకిత గుర్తు పట్టలేకపోతుంది. సామ్రాట్ చాలా కంగారుగా వస్తు ఉంటాడు. తర్వాత లాస్య, నందు వంతు వస్తుంది. లాస్య కూడా నందు సైగలు అర్థం చేసుకోలేకపోతుంది.


Also Read: మోనిత కుట్ర తెలుసుకున్న కార్తీక్- చుక్కలు చూపించిన దుర్గ, దీపకి అండగా నిలిచిన రాజ్యలక్ష్మి


తరువాయి భాగంలో..


సామ్రాట్, తులసి కలిసి కోలాటం ఆడుతూ ఉంటారు. అది చూసి లాస్య పుల్ల వేస్తుంది. కోలాటం ఆడిన తర్వాత అనసూయ సామ్రాట్ ని తిడుతుంది. ఇంకెప్పుడు మా కాలనీ వైపు కూడా రావొద్దు అని చెప్తుంది. మీ ఇద్దరినీ దూరంగా ఉంచాలనే తులసిని ఉద్యోగం నుంచి తీసేయమని నిన్ను అడిగాను అని ఆవేశంలో అనసూయ నిజం చెప్పేస్తుంది. అది విని తులసి షాక్ అవుతుంది.