తులసి వాళ్ళు రాజ్యలక్ష్మి ఇంటికి వస్తారు. దివ్య తనే పిలిపించానని చెప్తుంది. నువ్వు ఏదైనా పని చేసే ముందు ఇంటి పెద్ద మీ అత్తకి చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. ఈవిడ ఎన్ని అవమానాలు అయినా భరిస్తుందని మనమే అర్థం చేసుకోవాలని బసవయ్య అంటాడు. అప్పుడే విక్రమ్ తల్లి చెప్పులు కుట్టించి తీసుకొస్తాడు. అల్లుడు చేతిలో చెప్పులు చూసి తులసి వాళ్ళు షాక్ అవుతారు. కావాలని చేస్తున్నారు విక్రమ్ ఎప్పటికీ తెలుసుకుంటాడో ఏమోనని అనుకుంటుంది. రాజ్యలక్ష్మి కావాలని చెప్పుల మీద మరక ఏంటని అనేసరికి తన చొక్కాతోనే తుడుస్తాడు. తనే కింద కూర్చుని తల్లి కాళ్ళకి చెప్పులు తొడుగుతాడు. అది చూసి తులసి వాళ్ళు బాధపడతారు.


విక్రమ్: మీ అమ్మానాన్నని అలా నిలబెట్టి మాట్లాడుతున్నావ్ ఏంటి ఇదేం మర్యాద  


దివ్య: అత్తయ్య పర్మిషన్ లేకుండా అమ్మానాన్నని రమ్మని పిలిచాను


Also Read: పెళ్లి చూపులు చెడగొట్టుకున్న స్వప్న- రాహుల్ పెళ్లి కోసం ఇంట్లో గొడవకు దిగిన రుద్రాణి


విక్రమ్: తప్పేంటి


దివ్య: అత్తయ్య ఏమి అనలేదు మీ మావయ్య గొడవ చేస్తున్నారు దేవత లాంటి అత్తయ్యకి చెడ్డ పేరు వచ్చేలా చేస్తున్నారు


విక్రమ్: నీ వల్లే సగం తలనొప్పులు మావయ్య. మాట్లాడే ముందు వెనుకా ముందు ఆలోచించవా? దివ్య అమ్మానాన్న ఈ ఇంటికి పర్మిషన్ తీసుకుని రావడం ఏంటి? జరిగిన దానికి మావయ్య తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా. అత్తయ్య వాళ్ళని లోపలికి తీసుకెళ్లు


తులసి వాళ్ళు లోపలికి వెళ్ళగానే రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతుంది. లాస్య, భాగ్య నందు కేఫ్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. దెబ్బ మీద దెబ్బ కొడితే బావ ఎలా తట్టుకుంటాడు నీతో ఎలా కాపురం చేస్తాడని భాగ్య అంటుంది. కేఫ్ తాళాలు ఇవ్వమని మేనేజర్ ని లాస్య అడుగుతుంది. మర్యాదగా వచ్చిన దారిలోనే వెళ్ళమని మా బాస్ చెప్పారని చెప్తాడు. ఈ కేఫ్ నాది అని లాసీ అరిచినా కూడా మేనేజర్ మాత్రం కీస్ ఇచ్చేందుకు ఒప్పుకోడు. తులసి వాళ్ళు డల్ గా ఉండటం చూసి ఇక్కడ పరిస్థితి తెలిసిపోయిందా ఏంటని అనుకుంటుంది. ఇక్కడ బాగానే ఉన్నావా అని నందు అడుగుతాడు.


ఇంట్లో ప్రతీ ఒక్కరూ తనని హ్యపీగా చూసుకుంటున్నారని దివ్య అబద్ధం చెప్తుంది. మీ అత్త తమ్ముడు ఎప్పుడు అలాగే వంకరగా మాట్లాడతాడా అని నందు అంటాడు. ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తుంది. అత్త మంచిదని లేనిపోని అనుమానాలు మనసులో పెట్టుకోవద్దని ధైర్యం చెప్తుంది. విక్రమ్ వచ్చి దివ్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నానని అంటాడు. అల్లుడు మాటలు అసలు నమ్మొద్దు అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. కనీసం ఇప్పటి వరకు తలలో పెట్టుకోవడానికి పూలు కూడా తీసుకురాలేదని కాసేపు టెన్షన్ పెడుతుంది. విక్రమ్ నందు వాళ్ళకి బట్టలు పెడతాడు.


Also Read: ముకుందని పుట్టింటికి పంపించేందుకు రేవతి ప్రయత్నం- కృష్ణ, మురారీ క్యూట్ రొమాన్స్


లాస్య కేఫ్ కి ఆడవాళ్ళని తీసుకొచ్చి గొడవ చేస్తుందని నందుకి మేనేజర్ ఫోన్ చేసి చెప్తాడు. దీంతో వాళ్ళు హడావుడిగా వెళ్లిపోతారు. పెళ్ళాంతో కాపురం చేయనని అంటున్నారు కనీసం కేఫ్ చూసుకుని బతిమలాడుతుంటే వినవెంటని ఆడవాళ్ళు నందుని నిలదీస్తారు. వాళ్ళు నందుని తిడుతుంటే ప్రేమ ఉన్నట్టు మళ్ళీ నటిస్తుంది. ఇలా అణిగి మణిగి ఉండే భార్యలు నూటికో కోటికి ఒక్కరు ఉంటారని అంటారు. అంత ప్రేమ ఉంటే కేసు వెనక్కి తీసుకోమని తులసి చెప్తుంది. నందుని పక్కన ఉండి కావాలని తులసి రెచ్చగొడుతుందని లాస్య ఎక్కిస్తుంది. అందరి మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. తులసి మాయలాడి పురుగులు పడి పోతుందని నోటికొచ్చినట్టు లాస్య తిడుతుంది. దీంతో నందు తన చెంప పగలగొడతాడు. కేఫ్ నుంచి బయటకి వెళ్లాల్సింది నువ్వేనని తనని బయటకి గెంటేస్తాడు.