నందు వాసుదేవ్ కి నిజం చెప్పి క్షమించమని అడుగుతాడు. నువ్వు మోసగాడివి కాదు స్వార్థపరుడివి నిజానికి నువ్వు అబద్ధం చెప్పడం వల్ల నాకు ఏ నష్టం జరగలేదు. కానీ భార్యాభర్తలుగా మీరు నటిస్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో చూశాను. మీరు నటిస్తున్నారని ఎప్పుడో గ్రహించాను మీ అంతట మీరు బయటపడి చెప్తారని అనుకున్నా. ముందు తులసి బయటపడి నిజం చెప్పింది, ఇప్పుడు నువ్వు అదే పని చేశావ్ మీ నిజాయితీ మంచిదని చెప్తాడు. భార్యాభర్తలు కలిసి ఉండటం చాలా తేలిక విడిపోవడం కష్టమైన నిర్ణయం అలాంటి నిర్ణయం తీసుకునే ముందు చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. తులసి లాంటి దేవతని దూరం చేసుకుని చాలా నష్టపోయావ్ ఆ లోటు ఎప్పటికీ తీరదని దేవ్ భార్య అంటుంది. ఆ మాటలు విని లాస్య షాక్ అవుతుంది. వాళ్ళు వెళ్లిపోయినందుకు లాస్య హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది.


నెక్లెస్ తిరిగి ఇచ్చేస్తానని తులసి చెప్తుంది. నందు చేతిలో ఫైల్ తీసుకుని లాస్య తెగ మురిసిపోతుంది. దివ్య విషయంలో మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వనని లాస్య మనసులో అనుకుంటుంది. అటు దివ్య హాస్పిటల్ ముందు కూర్చుని ధర్నా చేస్తుంటే మీడియా వాళ్ళు రాజ్యలక్ష్మి దగ్గరకి వస్తారు. దివ్య పిలిస్తే వచ్చామని మీడియా వాళ్ళు చెప్తారు. ధర్నా చేయడం చూసి సంజయ్, రాజ్యలక్ష్మి షాక్ అవుతారు. మీడియాని పంపించేద్దామని రాజ్యలక్ష్మి అంటుంది కానీ దివ్య మాత్రం వాళ్ళ ముందే మాట్లాడుకుందామని చెప్తుంది.


Also Read: ధర్మరాజుకి రిషి కూల్ వార్నింగ్- రిషిధారగా ఒక్కటయ్యేందుకు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?


రాజ్యలక్ష్మి: నువ్వు ఎప్పుడు ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరించానా లేదా ఇప్పుడు కూడా అదే పని చేయాల్సింది కదా. సమస్య ఏదైనా నాకు కానీ సంజయ్ కి కానీ చెప్పి ఉండాల్సింది కదా


దివ్య: సంజయ్ సమస్య అయితే ఏం చేయాలి


రాజ్యలక్ష్మి: సంజయ్ తో ఏంటి సమస్య


దివ్య: మేడమ్ అడుగుతున్నారు మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? ప్రియ మీ అత్తగారి కాళ్ళకి దణ్ణం పెట్టి దీవెనలు తీసుకో.. ఎక్కువగా వంగకు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి నెలతప్పేలా చేశాడు. అన్యాయం చేయవద్దని బతిమలాడితే నీకు నాకు సంబంధం లేదని చెప్పగానే రాజ్యలక్ష్మి సంజయ్ చెంప పగలగొడుతుంది.


రాజ్యలక్ష్మి: సంజయ్ వల్ల చాలా బాధపెట్టాం సమస్య నాకు తెలిసింది కదా నిశ్చింతగా ఉండు నేను న్యాయం చేస్తానని వెళ్లిపోతుంటే దివ్య ఆపుతుంది.


దివ్య: పరిష్కారం అయిందని మీరనుకుంటే సరిపోతుందా మాకు అనిపించాలి కదా సంజయ్ ప్రియ మెడలో తాళి కట్టాలని డిమాండ్ చేస్తారు. అందరి ముందు ప్రియ మెడలో సంజయ్ తాళి కట్టాలి. నాకు మీ మీద నమ్మకం ఉన్నా సంజయ్ మీద నమ్మకం లేదు. ఛాన్స్ తీసుకోవాలని అనుకోవడం లేదు ప్రియ మెడలో సంజయ్ తాళి కట్టాల్సిందే.. ఇదిగో తాళి


రాజ్యలక్ష్మి: గట్టిగా అరవడానికి బెదిరించడానికి లేకుండా దివ్య మీడియాని అడ్డం పెట్టుకుని నా నోరు నొక్కేసిందని మనసులో అనుకుని సంజయ్ ని తాళి కట్టమని చెప్తుంది. దీంతో సంజయ్ తప్పని పరిస్థితిలో ప్రియ మెడలో తాళి కట్టేస్తాడు. అది చూసి రాజ్యలక్ష్మి అవమానభారంతో రగిలిపోతుంది.


దివ్య: మేడమ్ మంచి ముహూర్తం చూసి గ్రాండ్ గా పెళ్లి జరిపించండి రావడానికి అందరం రెడీగా ఉన్నాం


Also Read: రాజ్ కి మందు తాగిచ్చి కావ్య మీదకి రెచ్చగొట్టిన రాహుల్- నిజం తెలుసుకున్న అప్పు


తులసి, నందు అత్తామామలతో కలిసి హ్యపీగా ఆడుకుంటూ ఉంటారు. లాస్య ఫైల్ పట్టుకుని తెగ సంబరపడిపోతుంది. దివ్య జీవితం నాశనం చేయాలని ప్లాన్ వేస్తుంది. క్యారెమ్స్ ఆడుతున్న నందు వాళ్ళ దగ్గరకి లాస్య వస్తుంది. గేమ్ గురించని అడ్డం పెట్టుకుని నందు, లాస్య సెటైర్ల మీద సెటైర్లు వేసుకుంటారు.