తులసి డాన్స్ స్కూల్ కి వెళ్దామని బయల్దేరుతుంటే ఒకసారి ఫోన్ చేసి వెళ్ళమని పరంధామయ్య చెప్తాడు. దీంతో సరేనని తులసి ప్రిన్సిపల్ కి ఫోన్ చేస్తుంది. నిన్న వస్తానని చెప్పారు కదా ఎందుకు రాలేదు మీ ప్రవర్తన మా మేనేజ్మెంట్ కి నచ్చలేదు మీ డీల్ క్యాన్సిల్ చేస్తున్నాం సారీ మేడమ్ మీరు రావొద్దని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏమైందమ్మా అని అనసూయ అడుగుతుంది. వెళ్లనందుకు అవకాశం పోగొట్టుకున్నానని చెప్పడంతో అంతా ఆ పాప వల్లే అని అనసూయ తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడకి హనీ వచ్చి వాళ్ళ మాటలు వింటుంది. హనీని గమనించిన తులసి ఏంటమ్మా ఇలా వచ్చావ్ అని అడుగుతుంది. 'నా వల్ల తప్పు జరిగింది, మా నాన్న చాలా మాటలు అన్నాడు పోలీస్ స్టేషన్లో పెట్టాడు సారి ఆంటీ' అని చెప్తుంది. ఇప్పటికే మీ నాన్న మ మీద కోపంగా ఉన్నారు, ఆయనకి తెలియకుండా రావడం మంచిది కాదని చెప్తుంది. మీకు ఇంక నా మీద కోపం పోలేదా నన్ను తరిమేస్తున్నారని హనీ అడుగుతుంది. అదేమీ లేదమ్మా అని తులసి సర్ది చెప్తుంది. ఈసారి మా నాన్నని తీసుకుని మీ ఇంటికి వస్తానని చెప్పి తులసికి ముద్దు పెట్టి వెళ్తుంది. 


Also Read: పాపం మిస్టర్ యారగెంట్, వేద ముందు పరువు పోయే- ఎట్టకేలకు సారికను పట్టుకున్న యష్, నిజం బట్టబయలు


బయటకి వెళ్ళిన హనీ ఇంటి ముందు ఉన్న గులాబీ పువ్వు కోసుకుని వెళ్తుండగా తన మెడలోని చైన్ కింద పడిపోతుంది. ఇక సామ్రాట్ తన బాబాయ్ కి ఫోన్ చేసి ఎందుకు తులసిని విడిచిపెట్టావని అడుగుతాడు. అది సరైన నిర్ణయం అందుకే అలా చేశాను నేను ముంబయి నుంచి వచ్చాక దీని గురించి మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. బాబాయ్ కి వయస్సు పెరుగుతున్నకొద్ది చాదస్తం పెరిగిపోతుందని అనుకుంటాడు. ఇక హనీ డాడీ అని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇద్దరు సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే హనీ మెడలో గొలుసు లేదని చూస్తాడు. ఏమైందని అడుగుతాడు. పాప మెడలో చైన్ కనిపించడం లేదని కారులో వెతకమని చెప్తాడు. ఎంత వెతికినా కనిపించదు. ఈరోజు స్కూల్ కి కాకుండా ఇంకెక్కడికైనా వెల్లవా అని అడుగుతాడు. తులసి ఆంటీ దగ్గరకి వెళ్లానని చెప్తే తిడతాడని హనీ మనసులో అనుకుంటూ ఉండగా కారు డ్రైవరు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లావ్ కదా చిన్నమ్మా అని అంటాడు. ఎవరు ఆ ఫ్రెండ్ అని అడగడంతో తులసి ఆంటీ ఇంటికి వెళ్లానని చెప్తుంది. 


తులసి ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉండగా సామ్రాట్ హనీని తీసుకుని వస్తాడు. అన్యాయంగా అక్రమంగా సంపాదించిన తిండితో తింటున్నారు నోట్లో ముద్ద ఎలా దిగుతుందని సామ్రాట్ గట్టిగా అరుస్తాడు. జైల్లో చిప్ప కూడు తినాల్సిన వాళ్ళు మా బాబాయ్ జాలి పడటం వల్ల ఇంటి కూడు తింటున్నావ్ అయిన నీకు బుద్ది రాలేదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. మీరేందుకు వచ్చారు ఏం కావాలని అడుగుతుంది. నువ్వు దొంగతనం చేసిన మా పాప గోల్డ్ చైన్ ఇప్పుడే తిరిగి ఇవ్వాలని అనడంతో అందరూ షాక్ అవుతారు. పాప గోల్డ్ చైన్ గురించి మాకేం తెలియదని తులసి చెప్తున్న సామ్రాట్ వినకుండా మీ ఇంటికి వచ్చేటప్పుడు చైన్ తో వచ్చింది కానీ ఇంటికి చైన్ లేకుండా తిరిగొచ్చిందని చెప్తాడు. దారిలో పారేసుకుందేమో అని అనసూయ నటే కాదు కచ్చితంగా తులసి దొంగతనం చేసిందని అరుస్తూ ఇల్లంతా వెతికి చూడామని పని వాళ్ళకి చెప్తాడు. ఇల్లంతా వెతికినా దొరకలేదని చెప్తారు. నీకు ఒక గంట టైం ఇస్తున్నాను మర్యాదగా చైన్ తెచ్చి ఇవ్వు అని వార్నింగ్ ఇచ్చి సామ్రాట్ వెళ్ళిపోతాడు. 


Also Read: ఆఫీసర్ సారుకి దత్తత పోకుండా తప్పు చేశానన్న దేవి, పట్టరాని ఆనందంలో రుక్మిణి, ఆదిత్య-పగతో రగిలిపోతున్న మాధవ


నందు సామ్రాట్ మాటలు తల్చుకుని టెన్షన్ పడతాడు. యాక్సిడెంట్ చేసింది నేనే అని తెలిస్తే ఏంటి పరిస్థితి అని నందు అంటాడు. అది ఎలా తెలుస్తుంది నువ్వేమి టెన్షన్ పడకు అని లాస్య సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు తులసి కుటుంబం జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటారు. అప్పుడే దివ్య చైన్ తీసుకొచ్చి తులసికి ఇస్తుంది. ఇది పాప చైన్ అయ్యి ఉంటుంది మామన గార్డెన్ లో పడిపోయిందని చెప్తుంది. పొద్దున మన ఇంటికి వచ్చినప్పుడు పడిపోయింది పాప చూసుకుని ఉండదు ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసి వస్తానని వెళ్లబోతుంది. 


తరువాయి భాగంలో.. 


హనీ స్కూల్ లిఫ్ట్ లో ఇరుక్కుపోతుంది. విషయం తెలుసుకున్న సామ్రాట్ స్కూల్ వాళ్ళ మీద అరుస్తాడు. తులసిగారిని చూసి వస్తున్నా అని హుషారుగా లిఫ్ట్ ఎక్కిందని అక్కడ మేడమ్ చెప్తుంది. ఇక సామ్రాట్ తులసికి దణ్ణం పెడుతూ దయచేసి నా పాపని వదిలేయ్ అని అంటాడు.