మోసం చేశావని తెలిస్తే అంకిత అమెరికాలో ఉన్న నిన్ను వదిలేసి వచ్చేస్తుందని తులసి అభికి జాగ్రత్తలు చెప్పాలని చూస్తుంది. ఆడదాని మనసు గెలుచుకోవాలంటే ఆస్తులతో కాదు నమ్మకంతో జీవితంలో భార్య కంటే ఏది ఎక్కువ కాదని నమ్మకం ఇస్తే భార్య ప్రాణం ఇస్తుంది ఆలోచించుకో అనేసి వెళ్ళిపోతుంది. లాస్య నందులో వచ్చే మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నందుని ఒంటరిగా వదిలేస్తే కష్టం అనుకుని తనతో పాటి కేఫ్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. లాస్య నందుకి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటే తన ఫాంట్ లో నెక్లెస్ చూస్తుంది. ప్రేమికుల దినోత్సవం కదా గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకొచ్చాడేమో అని సంబరపడుతుంది. తను ఇచ్చినప్పుడే తీసుకుంటానని మళ్ళీ ఏమి తెలియనట్టు ఫాంట్ లోనే పెట్టేస్తుంది.


Also Read: మాళవికని తప్పుదారి పట్టించిన అభిమన్యు- వేదకి వార్నింగ్ ఇచ్చిన యష్


తులసితో పాటు బైక్ మీద కలిసి వెళ్ళి తనకి నెక్లెస్ ఇస్తే తీసుకుంటుంది, ఎవరు చూడరని నందు ప్లాన్ వేస్తాడు. కారు స్టార్ట్ కాకుండా వైర్ కట్ చేద్దామని అనుకునేలోపు అంకిత కాఫీ పట్టుకుని వస్తుంది. కాసేపు కంగారు పడతాడు. తిక్క తిక్కగా బిహేవ్ చేస్తూ కాసేపు నవ్విస్తాడు. తర్వాత కారు స్టార్ట్ కాకుండా చేసేసి ఎగురుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక రోజు తులసికి నెక్లెస్ ఇవ్వకుండా ఎవరూ ఆపలేరు. కాపురం చేసేటప్పుడు ఎటూ పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు కూడా తనని పట్టించుకొకపోతే ఎలా, తనతో పాటు బైక్ మీద వెళ్ళి నెక్లెస్ ఇచ్చి రుణం తీర్చుకుంటానని అనుకుంటాడు. తర్వాత లాస్య కూడా తనతో బయల్దేరుతుందని అనుకుంటాడు. లాస్య తనతో పాటు వస్తే తులసితో పాటు బైక్ మీద వెళ్లాలనుకున్న ప్లాన్ అప్సెట్ అవుతుంది కదా అని టీ కింద పోసి కావాలని దాని మీద లాస్య చీర పడేలా చేస్తాడు.


ఇప్పుడు రెడీ అవడానికి మ్యాచింగ్ శారీ లేదని లాస్య బిక్కమొహం వేస్తుంది. టైమ్ అయిపోతుంది నేను వెళ్లిపోతాను నువ్వు కూల్ గా రా అని తనని సైడ్ చేసేసి వెళ్ళిపోతాడు. ఇక బయటకి వచ్చి తన కారు స్టార్ట్ కావడం లేదని బైక్ మీద డ్రాప్ చేయొచ్చు కదా అని నందు అడిగేస్తాడు. ఒక్కసారి మీ ఓనర్ ని అడిగి రండి అని తులసి అంటుంది. ఇక బైక్ మీద వెళ్ళడం కోసం ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఈవిడతో మాట్లాడుతూ పెట్టుకుంటే రాక్షసి లాస్య వచ్చేస్తుందని అనుకుని బతిమలాడి బైక్ ఎక్కేస్తాడు. వాళ్ళిద్దరూ బైక్ మీద వెళ్ళడం లాస్య చూస్తుంది. హనీమూన్ కపుల్ లా బైక్ మీద చెక్కేస్తున్నారని లాస్య అనుకుంటుంది.


Also Read: మహేంద్ర, జగతి దెబ్బకు తోకముడిచిన దేవయాని- రిషికి నిజం చెప్పాలని డిసైడ్ అయిన వసు


తులసి ఏదో మాట్లాడుతుంటే నందు మాత్రం నెక్లెస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనకి చెప్పకుండా బ్యాగ్ వేసి విషయం చెవిలో చెప్దామని అనుకుంటాడు. అప్పుడే పక్కన ఇంకొక అబ్బాయి అమ్మాయి బైక్ మీద వెళ్తూ ఉంటుంటే వాళ్ళని ఆపి తిడుతుంది. నా గర్ల్ ఫ్రెండ్ కి రింగ్ ప్రజెంట్ చేస్తున్నా అనేసరికి వాళ్ళకి క్లాస్ పీకుతుంది. దీంతో నందు మళ్ళీ నెక్లెస్ పెట్టకుండా జేబులో పెట్టేసుకుంటాడు. కేఫ్ కి వెళ్ళిన తర్వాత నందు తులసికి నెక్లెస్ ఇద్దామని అనుకునే లోపు తను లోపలికి వెళ్ళిపోతుంది. పెళ్లి అయినప్పుడు తులసి కూడా నాకు ఏదైనా విషయం చెప్పడానికి ఇలాగే ట్రై చేసేది కానీ నేను కావాలని తప్పించుకునేవాడిని అని అనుకుంటాడు. తులసిని పక్కకి లాక్కెళ్లి ధైర్యంగా నెక్లెస్ ప్రజెంట్ చేద్దామని మనసులోనే అనుకుంటాడు. అప్పుడే లాస్య వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది.