నందు, లాస్య తులసి ఇంటికి వస్తారు. సామ్రాట్ ముందు నందు పరువు తియ్యలని రెడ్ అయ్యింది. తన తమ్ముడిని భూమి పూజకీ పిలిపించింది. మాట మాట పెరిగేలా చేసి నందునే తన మాజీ భర్త అని తెలిసేలా చేసిందని లాస్య అంటే మీరు ఇది నమ్ముతున్నారా అని తులసి నందుని అడుగుతుంది. నమ్ముతున్న అని నందు అనేసరికి నాకు ఆ ఉద్దేశమే ఉంటే భూమి పూజ రోజే అలా జరిగేలా ఎందుకు చేస్తాను. భూమి పూజ అంటే నాకు పండగతో సమానం నేనే ఎందుకు పాడు చేసుకుంటాను అని తులసి అంటుంది. నిజం చెప్పాలని అనుకుంటే ఆరోజే చెప్పేది ఇప్పటి వరకు ఆగేది కాదని పరంధామయ్య కూడా అంటాడు. మీ మాజీ కోడలికి ఇమేజ్ అంటే ప్రాణం అందుకే ఇప్పటి వరకు ఆగిందని నందు చెప్తాడు. అమ్మకి ఆ అవసరం ఏముందని ప్రేమ్ అంటాడు. మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసి రోడ్డున పడేయాలని చూసిందని నందు కోపంతో ఊగిపోతాడు.
సోరి వెరీ వెరీ సోరి అని తులసి చేతులెత్తి దణ్ణం పెడుతుంది. ఎందుకు సోరి చెప్తున్నావ్ నా పరువు తీసినందుకా నీ మాజీ భర్తని అని సామ్రాట్ కి తెలిసేలా చేసినందుకా అని నందు అడుగుతాడు. తులసి వెళ్ళి పితా తీసుకుని వచ్చి నందు ముందు వేసుకుని దాని మీద నిలబడి ధైర్యంగా చూస్తుంది. నేను సోరి చెప్పింది మీరు అనుకున్నది ఏది కాదు మిమ్మల్ని భయపెట్టినందుకు అని తులసి అంటుంది. భయమా నాకా అని నందు అంటాడు. నేను మీ ఆయనతో సమానంగా ఎక్కడ ఎదిగిపోతానో అని భయం, నేను ఎక్కడ ఎదుగుతానో అని భయం తులసి అంటుంది. నేను ఎప్పుడు నీ ఎదుగుదలని ఆపలేదు అని నందు చెప్తాడు.
Also Read: మాధవ్ పని అయిపాయే- దొంగ తండ్రి గురించి నిజం తెలుసుకున్న దేవి
తులసి: ఒకప్పుడు నా గొంతు తగ్గి ఉండి మీ వెనక ఉండేదాన్ని కానీ ఇప్పుడు నా గొంతు తగ్గదు మీ వెనక పదే ప్రసక్తే లేదు. ఇది నీకు కూడా కలిపి చెప్తున్నా లాస్య. ఇంతక పదింతలు గొడవలు రేపి నాకు సమస్యలు సృష్టించాలని అనుకున్నా అవి నన్ను ఏమి చేయలేవు, నేను ఎదగకుండా ఆపలేరు. ఇన్ని రోజులు అందరి గురించి ఆలోచించాను. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకుంటున్నా. పాతికేళ్లు మీరు పంజరంలో బంధించిన చిలుక ఇప్పుడు స్వేచ్చగా ఎగురుతుంది. అది చూసి మీరు భయపడుతున్నారు. మీకు మనశ్శాంతి ఇవ్వమని దేవుడిని ప్రార్ధిస్తున్నా.
నందు: నీది అంతా తెచ్చి పెట్టుకున్న ఆర్భాటం తులసి.. ఎదగడానికి నువ్వు ఎంత ప్రయత్నించిన నేను నీకంటే ఎత్తులోనే ఉంటాను.
తులసి: కానీ మీరు నా ముందు తలవంచుకునే ఉంటారు. నేను మీ ముందు తల ఎత్తుకునే ఉంటాను
ఆ మాటలకి ఇంట్లో వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టి తులసిని అభినందిస్తారు. సామ్రాట్ జరిగింది తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. పూజలో వేసిన చేతి ముద్రల కాగితం చింపేయబోతుంటే పెద్దాయన వచ్చి ఆపుతాడు. ఎవరి మీద కోపంతో ఆ పేజీ చింపేస్తున్నావ్, నందు తన మాజీ భర్త అని చెప్పలేదని కోపమా లేక అభి నిన్ను మాటలు అన్నాడనా అని అడుగుతాడు. నా మీద నాకే కోపం బాబాయ్. తులసి గారికి సహాయం చెయ్యాలని అనుకున్నానే తప్ప వాటి వల్ల వచ్చే సమస్యల గురించి ఆలోచించలేదు. తులసి గారితో కలిసి బిజినెస్ పార్టనర్ అయితే ఆమెకి గుర్తింపు వస్తుందని ఆలోచించానే తప్ప అది ఆమె పాలిట శాపం అవుతుందని అనుకోలేదు, ఇవన్నీ నా తప్పులే కదా అని సామ్రాట్ బాధపడతాడు.
Also Read: యష్ ప్రాజెక్ట్ అభి చేతికి- స్కూల్ లో యష్ ని చూసి కోపంతో అలిగిన ఖుషి, వేద
జీవితం అంటే తెలియని వాడు ఉక్రోషంతో ఏదో వాగితే ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నావ్ అని పెద్దాయన అంటాడు. నేను మగాడిని దులిపేసుకుంటాను కానీ తులసిగారు అలా కాదు కన్న కొడుకు అలాంటి నిందలు వేస్తుంటే ఆమె ఎలా తట్టుకుంటారు. ఇదంతా నా వల్లే కదా అని సామ్రాట్ ఫీల్ అవుతాడు. తులసిని నువ్వు దూరం పెడితే జనాలు అనుకున్నది నిజమవుతుందని పెద్దాయన చెప్తాడు. ప్రేమ్, శ్రుతిలు మళ్ళీ తమ గిల్లికజ్జాలు మొదలుపెడతారు. అది చూసి ఎందుకు అలా అరుసుకుంటున్నారని తులసి అడుగుతుంది. మీ అబ్బాయి వల్ల నాకు ప్రాబ్లం ఉందని కాసేపు టెన్షన్ పెట్టి ప్రేమ్ ని ఆటపట్టిస్తుంది. కావాలని ఏడిపించడానికి పాలల్లో ఉప్పు కలిపిందని ప్రేమ్ మనసులో అనుకుంటాడు. ఆ పాలు తాగడానికి తెగ తంటాలు పడతాడు. నందు పూజ దగ్గర జరిగింది తలుచుకుంటూ ఉంటాడు. తులసికి ఏం జరిగినా కారణం నేనేనా ఎందుకు అన్నిటికీ నన్నే బ్లెమ్ చేస్తారని నందు ఫీల్ అవుతాడు.
తరువాయి భాగంలో..
తులసి సామ్రాట్ కి మెసేజ్ పెడుతుంది. మ్యూజిక్ స్కూల్ విషయంలో ఇంతవరకు మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. ఈరోజుతో మీ వ్యాపార భాగస్వామ్యాన్ని వదులుకుంటున్నా అని తులసి మెసేజ్ పంపిస్తుంది. అది చూసి సామ్రాట్ షాక్ అవుతాడు. అనసూయ నందుకి ఫోన్ చేసి నీ తప్పు సరిదిద్దుకో అని చెప్తుంది. నిన్ను వదిలేసి ఆ తులసిని మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మ చెప్తుంది ఒప్పుకుంటావా అని నందు లాస్యతో చెప్తాడు.