శ్రుతి కోసం ప్రేమ్ తన అత్తయ్య వాళ్ళింటి ముందు కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే శ్రుతి, కౌసల్య నవ్వుకుంటూ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న ప్రేమ్ ని చూస్తారు. నన్ను చూడగానే నవ్వు ఎందుకు ఆగిపోయిందని ప్రేమ్ శ్రుతిని అడుగుతాడు. నా బతుకు నవ్వుల పాలు చేసిన మనిషి ఎదురు పడితే ఎలా నవ్వమంటావ్ ప్రేమ్ అని శ్రుతి అంటుంది.


ప్రేమ్: నీకోసం నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను


శ్రుతి: నీ కోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను


కౌసల్య: తన గురించి తప్పితే నీ గురించి ఆలోచించడం తెలియదమ్మా శ్రుతి పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావ్


ప్రేమ్: శ్రుతి జరిగిందంటే మర్చిపోదాం ఇంటికి వెళ్దాం రా శ్రుతి


శ్రుతి: మనస్పూర్తిగానే అంటున్నావ ప్రేమ్


కౌసల్య: ఒట్టేసి చెప్పవయ్య అని ప్రేమ్ చేతిని శ్రుతి తల మీద పెడుతుంది. నీ అంతట నువ్వే వచ్చావా లేదంటే ఎవరైనా ఫోర్స్ చేస్తే వచ్చావా అని అడిగేసరికి ప్రేమ్ తలాడించుకుంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావ్


ప్రేమ్: ఎవరిది తప్పైనా ఎవరికి ఒప్పైనా భార్యభర్తలు కలిసి ఉండాలని అనేసరికి భగవద్గీతలో చదివావా అని కౌసల్య వెటకారంగా అంటుంది. కాదు మా వదిన అంకిత చెప్పింది.


కౌసల్య: అదమ్మా విషయం వదిన చెప్తే వచ్చాదంట ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో..అని శ్రుతికి చెప్తుంటే ఎందుకు శ్రుతిని రెచ్చగొడుతున్నారని ప్రేమ్ ఆవేశంగా అంటాడు. బాగుందయ్య నీకు మీ వదిన సలహా ఇవ్వొచ్చు కానీ నేను శ్రుతికి సలహా ఇస్తే తప్పా


Also Read: తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ


ప్రేమ్: ఇది మా భార్యభర్తల విషయం మీరు జోక్యం చేసుకోకండి, మీ వల్లే మా మధ్య దూరం పెరిగింది. ఆ రోజు శ్రుతి కోసం ఇంటికి వచ్చినట్టు నాకు ఎందుకు చెప్పలేదు


కౌసల్య: నువ్వు శ్రుతి కోసమే ఇంటికి వచ్చినట్టు చెప్పావా, తాగొచ్చి శ్రుతిని నోటికొచ్చినట్టు మాట్లాడవ్ ఇప్పుడు నా మీద నిందలు వేస్తున్నావా


ప్రేమ్: పెద్దవారు శ్రుతికి నచ్చజెప్పి ఇంటికి పంపించాల్సింది పోయి మీ ఇంట్లోనే ఉంచుకుంటే ఏంటి అర్థం మీకు అయినఅ తెలివి ఉండాలి కదా


శ్రుతి: ప్రేమ్.. నువ్వు మాట్లాడుతుంది మా అత్తయ్యతో పెద్ద వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది, తను నా బాధ చూడలేక అలా మాట్లాడింది


ప్రేమ్: నేను నీ కోసం ఎంత ఫీల్ అవుతున్నానో చూడవా


కౌసల్య: అంతా బాధపడుతున్న వాడివి ఇలా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోవు, భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఎంత హైరాన పడుతూ వెతుక్కోవాలి


ప్రేమ్: మీరు మమ్మల్ని కలుపుదామని అనుకుంటున్నారా లేదా శాశ్వతంగా విడగొట్టాలని అనుకుంటున్నారా? అప్పుడు కూడా అంతే మీ నాన్న వెనకాల నిలబడి నీకు అశ్విన్ కి పెళ్లి జరిగేలా చేసి నీ జీవితాన్ని నాశనం చేసింది, ఇప్పుడు కూడా ఇలాగే చేస్తుంది


శ్రుతి: ప్రేమ్.. నువ్వు గొడవ పడటానికి వచ్చావా అలాగైతే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో, నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసుకోడానికి రాలేదు వెళ్లిపో ప్రేమ్. నువ్వు ఇంతక ముందు ప్రేమ్ కాదు మారిపోయావ్, ఒకప్పటి ప్రేమ్ నన్ను ప్రేమగా చూసుకునేవాడు, నేను ఏం చెప్పినా వినేవాడు. నీమీద నమ్మకం పోయింది, మన బంధం బతకదు. నీకు నా మీద ఉన్న ప్రేమ కంటే మన విషయం ఇంట్లో ఎక్కడ తెలిసిపోతుందో అనే భయం ఎక్కువగా ఉంది, అందుకే నా ముందు ఇలా నటిస్తున్నావ్, నీది నటన, ఏ విషయం అయిన ఆంటీకి చెప్పే నువ్వు చెప్పకుండా దాచావ్ అని అంటుంది.


ప్రేమ్: నీ మీద నాకు అంతులేని ప్రేమ్ ఉంది. అలా అంటావెంటీ ఇదంటే మీ కౌసల్య అత్తయ్య వల్లే జరిగిందని అనేసరికి మళ్ళీ నా మీదకి వస్తావ్ ఏంటి అని కౌసల్య అంటుంది.


శ్రుతి: లేదు అత్తయ్య ప్రేమ్ అచ్చం వాళ్ళ నాన్నలాగే బిహేవ్ చేస్తున్నాడు, అది భరించలేకే తులసి ఆంటీ కూడా భర్తకి విడాకులు తీసుకుంది. మళ్ళీ మళ్ళీ అంటాను నువ్వు కూడా మీ నాన్న లాంటి వాడివి, నీకు కూడా మీ నాన్న ఆలోచనే భార్య అంటే అదే చులకన


ప్రేమ్: నీకు నాతో రావడం ఇష్టం లేకపోతే మానేయి, మన బంధం మీద ఇంటరెస్ట్ లేకపోతే ఇక్కడితో తెంపేయ్ అంతే కానీ నన్ను మా నాన్నతో పోల్చకు. నీకు ఒంటరి బతుకే కావాలనుకుంటే అది నీఇష్టం, నీ జోలికి రాను లైఫ్ లో నిన్ను డిస్ట్రబ్ చెయ్యను. మనం కలుసుకోవడం మాట్లాడుకోవడం ఇదే చివరి సారి గుడ్ బై అనేసి కోపంగా అక్కడికి వెళ్ళిపోతాడు.  


Also Read: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్


సీన్ నందు వాళ్ళ హోటల్ కి వెళ్తుంది. వైజాగ్ లో ఇదొక్కటే హోటల్ ఉందా అని నందు అసహనంగా ఉంటాడు. గదిలో తులసి వాళ్ళు ఏం చేస్తున్నారో అని అనుమానంగా వాళ్ళ గది తలుపు కొడతాడు. తులసి వచ్చి డోర్ తెరుస్తుంది. ఒకసారి సామ్రాట్ గారితో మాట్లాడాలి ఆయన ఏ రూమ్ లో ఉన్నారో చెప్తే అని నందు అడుగుతుంటే సామ్రాట్ లోపలికి రమ్మని పిలుస్తాడు. మమ్మల్ని బురిడి కొట్టించి ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉంటారా అని నందు మనసులో తిట్టుకుంటాడు. నందు తులసి గది నుంచి బయటికి రావడం లాస్య చూసి కడుపు నొప్పి తగ్గిందా? సామ్రాట్ ఉన్నాడో లేదో చూడటానికి వచ్చావని తెలిసిపోతుందని అంటుంది.   


తులసి సముద్రం చూసి చాలా సంతోషిస్తుంది. సామ్రాట్ తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఊరి దాటి బయటకి వచ్చింది బయట తిరగాలని అనుకుంటుంది మొహమాటం కొద్ది అడగదు నేనే వెళ్ళి అడుగుతాను అని సామ్రాట్ అనుకుంటాడు.


తరువాయి భాగంలో..


సామ్రాట్ తులసి కళ్ళు మూసి బీచ్ కి తీసుకుని వస్తాడు. అది చూసి చిన్న పిల్లలా సముద్రంలోకి దిగి ఆడుకుంటుంది. సామ్రాట్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆపి ఏమైందని అడుగుతాడు. ఎవరో ఒక ఆవిడ కొట్టుకుపోయిందంట అని చెప్పడంతో సామ్రాట్ తులసి అని గట్టిగా అరుస్తూ బాధపడతాడు.