Siddhu Jonnalagadda Remuneration: నటీనటులు వరుసగా హిట్స్ సాధించిన తర్వాత కచ్చితంగా వారి రెమ్యునరేషన్‌పై ఫోకస్ పెడతారు. వారికి స్టార్‌డమ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్‌ను పెంచాలని సన్నాహాలు చేస్తుంటారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా యాడ్ అయ్యాడు. సిద్ధు అంటే ఎవరో గుర్తుపట్టని ప్రేక్షకులు కూడా ‘డీజే టిల్లు’ అంటూ గుర్తుపడతారు. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. ‘డీజే టిల్లు’ మాత్రమే కాదు.. దాని సీక్వెల్‌తో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు సిద్ధు. దీంతో తన రెమ్యునరేషన్‌ను అమాంతం మూడు రెట్లు పెంచేశాడని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మూడు రెట్లు ఎక్కువ..
ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సిద్ధు జొన్నల్లగడ్డకు ‘డీజే టిల్లు’ సినిమా గుర్తింపును తెచ్చిపెట్టింది. యూత్‌ను ఆకట్టుకొని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మామూలుగా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కిస్తే.. అవి అదే రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా లేదా అనే డౌట్ ఉంటుంది. కానీ ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’తో కూడా అదే రేంజ్‌లో సక్సెస్ చూశాడు సిద్ధు. దీంతో తన తరువాతి సినిమాలకు తీసుకోవాల్సిన రెమ్యునరేషన్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడట. ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కంటే మూడు రెట్లు పెంచాలని ఈ యంగ్ హీరో డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
మినిమమ్ గ్యారెంటీ హీరో..
సిద్ధు జొన్నలగడ్డ.. ఇకపై తన చేసే సినిమాలకు రూ.15 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఒకేసారి రూ.15 కోట్లు డిమాండ్ చేస్తుండడంతో మేకర్స్ షాకవుతున్నారట. కానీ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో సిద్ధు కూడా ఒక మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. తను ఒక సినిమాలో నటిస్తున్నాడంటే.. థియేటర్‌కు వచ్చి ఆ సినిమాను చూడాలనుకునే యూత్ సంఖ్య భారీగానే ఉంటుంది. దీంతో మేకర్స్ కూడా ఈ మినిమమ్ గ్యారెంటీ హీరో అడిగినంత రెమ్యునరేషన్‌ను ఇవ్వడానికి వెనకాడడం లేదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ని హిట్లు కొట్టినా.. స్టోరీ సెలక్షన్ విషయంలో మాత్రం సిద్ధు తొందరపడడం లేదు.
అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్..
ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. సెలబ్రిటీ డిజైనర్ నీరజా కోనా.. దర్శకురాలిగా మారుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’లో సిద్ధు హీరోగా నటిస్తున్నాడు. తన రెగ్యులర్ మాస్ లుక్‌ను పక్కన పెట్టి ‘తెలుసు కదా’ కోసం కూల్ అండ్ స్టైలిష్‌గా మేక్ ఓవర్ అయ్యాడు ఈ హీరో. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ విడుదలయ్యాయి. దీంతో పాటు బొమ్మరిల్లు భాస్కర్‌తో కూడా ఒక మూవీని లైన్‌లో పెట్టాడు సిద్ధు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా సైలెంట్‌గా జరిగిపోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటితో పాటు టిల్లు ఫ్రాంచైజ్‌లో మూడో సినిమా అయిన ‘టిల్లు క్యూబ్’ కూడా సిద్ధు ఖాతాలో ఉంది.