Game Changer next schedule details: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. సౌత్ ఇండియన్ లెజెండరీ ఫిలిం మేకర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారి ఓ తెలుగు కథానాయకుడితో ఆయన చేస్తున్న చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంస్థలో 50వ చిత్రమిది. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు.
మైసూర్ వెళ్లనున్న రామ్ చరణ్!
'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ ఈ నెల 23 (గురువారం) నుంచి మైసూరులో మొదలు కానుంది. అందులో రామ్ చరణ్ సహా ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారు. ఆ షెడ్యూల్ కోసం గ్లోబల్ స్టార్ మైసూర్ వెళ్లనున్నారు.
'గేమ్ ఛేంజర్'లో పలు కీలకమైన సన్నివేశాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కీలకమైన పట్టణాలు, నగరాల్లో తెరకెక్కించారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ సీన్లను రాజమండ్రి, విజయవాడ, విశాఖలో తీశారు. ఇప్పుడు యూనిట్ అంతా మైసూర్ వెళుతోంది.
Also Read : 'ధృవ నక్షత్రం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - విక్రమ్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ ఛేంజర్' పాటలతో నిర్మాతకు రూ. 33 కోట్లు!
'గేమ్ ఛేంజర్'లో తొలి పాట 'జరగండి జరగండి...'ని దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... టెక్నికల్ రీజన్స్ వల్ల విడుదల వాయిదా వేశారు. పాటలు విడుదలకు ముందు, వాటి ద్వారా కోట్ల రూపాయలు వచ్చాయని ఫిలిం నగర్ ఖబర్. ఈ సినిమా మ్యూజిక్ హక్కుల్ని ఫ్యాన్సీ రేటుకు ప్రముఖ ఆడియో కంపెనీ సరేగమ సొంతం చేసుకుంది. అందుకు రూ. 33 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం తెలిసింది. ఒక్క పాట కూడా విడుదల కాకుండా ఇంత అమౌంట్ రావడం అంటే పెద్ద విషయమే.
Also Read : పూనమ్ టార్గెట్ మెగాస్టారేనా? - త్రిష, మన్సూర్ గొడవలో చిరు మద్దతుపై విమర్శలు?
శంకర్ సినిమాల్లో పాటలు ఎప్పుడూ సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటాయి. ఆ మాటకు వస్తే... సౌత్ ఇండియన్ సినిమాల్లోని పాటల్లో భారీతనం శంకర్ తీసే సినిమాలతో మొదలైందని చెప్పవచ్చు. మరోవైపు రామ్ చరణ్ అంటే హిందీ ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ ఉంది. అందుకని, 33 కోట్లకు డీల్ కుదిరిందట.
Game Changer Movie Cast And Crew: ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. 'వినయ విధేయ రామ' తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రమిది. తెలుగమ్మాయి అంజలి మరో కథానాయిక. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలో చరణ్ భార్యగా ఆమె కనిపిస్తారని తెలిసింది. సముద్రఖని, ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ఇతర ప్రధాన తారాగణం. 'గేమ్ ఛేంజర్' చిత్రానికి రచయితలు : ఎస్.యు. వెంకటేశన్, ఫర్హద్ సామ్‌జీ & వివేక్, స్టోరీ లైన్ : కార్తీక్ సుబ్బరాజ్, మాటలు : సాయిమాధవ్ బుర్రా, సహ నిర్మాత : హర్షిత్, ఛాయాగ్రహణం : ఎస్. తిరుణావుక్కరసు, సంగీతం : తమన్, నిర్మాతలు: దిల్ రాజు & శిరీష్, దర్శకత్వం : శంకర్.