ABP  WhatsApp

Pari Paswan Allegation: డ్రింక్ తాగించి.. నాతో పోర్న్ వీడియో షూట్ చేశారు.. మాజీ మిస్ ఇండియా సంచలన వ్యాఖ్యలు

ABP Desam Updated at: 31 Aug 2021 03:34 PM (IST)

తనతో మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి.. పోర్న్ వీడియో షూట్ చేశారని మాజీ మిస్ ఇండియా యూనివర్స్ పరీ పాసవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్ ను మళ్లీ కుదిపేస్తున్నాయి.

మాజీ మిస్ ఇండియా యూనివర్స్ సంచలన వ్యాఖ్యలు

NEXT PREV

బాలీవుడ్ సహా సినీ ఇండస్ట్రీనే షాక్ కు గురి చేసింది రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా. అయితే రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత కొంతమంది అమ్మాయిలు.. తమతో బలవంతంగా పోర్న్ కంటెంట్ లో యాక్ట్ చేయించారని చాలా ఆరోపణలు చేశారు. తాజాగా మాజీ మిస్ యూనివర్స్ పరీ పాసవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పడీ వ్యాఖ్యలు బావీవుడ్ ను కుదిపేస్తున్నాయి.


ఏమన్నారు..?



నేను ముంబయి వచ్చిన కొత్తలో ఓ ప్రొడక్షన్ హౌస్ కి వెళ్లాను. అయితే వాళ్లు ఓ కూల్ డ్రింక్ లో డ్రగ్స్, మత్తుపదార్థాలు కలిపి నాపై పోర్న్ వీడియో షూట్ చేశారు.                  - పరీ పాసవాన్, మాజీ మిస్ ఇండియా యూనివర్స్


ఈ వ్యాఖ్యలు ఓ మాజీ మిస్ ఇండియా యూనివర్స్ చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేగింది. ఆమె ముంబయి వచ్చిన కొత్తలో ఈ ఘటన జరిగినట్లు ఆమె తెలిపారు. అయితే ప్రొడక్షన్ హౌస్ పేరు పాసవాన్ వెల్లడించలేదు. అయితే ఈ పోర్న్ వీడియో చిత్రీకరణ గురించి తెలుసుకున్న వెంటనే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. 


తన భర్త కట్నం గురించి వేధిస్తున్నారని ఇటీవల పాసవాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆమె భర్త నీరజ్ పాసవాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 


2019లో ఆమె మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలిచారు. ఆ తర్వాత నీరజ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే ఆమెపై తన భర్త బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. పరీ పాసవాన్ ముంబయికి చెందిన ఓ ప్రొడక్షన్ హౌస్ లో పోర్న్ ఫిలింలో నటించిందని.. అమాయకులను బుట్టలో వేసుకోవడమే తన పని అని ఆరోపించారు. అంతేకాకుండా ఆమెకు 12 ఏళ్ల కూతురు ఉందని.. ఇంతకుముందే ఇద్దరితో పెళ్లి కూడా అయిందని నీరజ్ సోదరుడు చందన్ పేర్కొన్నారు.


సోషల్ మీడియాలో..


పరీ పాసవాన్ ఇన్ స్టా గ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు. ఆమెకు 3900 మంది ఫాలోవర్లు ఉన్నారు. తరచుగా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.






 









Published at: 31 Aug 2021 03:32 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.