అన్వేషించండి

Entertainment Top Stories Today: కొండా సురేఖ వ్యాఖ్యలపై అఖిల్ స్ట్రాంగ్ రియాక్షన్, రజనీకాంత్ డిశ్చార్జ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: కొండా సురేఖ వ్యాఖ్యలపై అఖిల్ స్ట్రాంగ్ రియాక్షన్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అఖిల్ అక్కినేని స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘స్వాగ్’ సినిమా శుక్రవారం విడుదల అయింది. ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి తల్లి శుక్రవారం మరణించారు. రజనీకాంత్ సినిమా ‘వేట్టయన్’ను బ్యాన్ చేయాలని కోర్టులో కేసు వేశారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అఖిల్ తీవ్ర ఆగ్రహం
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అమ‌ల కొడుకు, యువ నటుడు అఖిల్  సీరియస్ అయ్యారు. అర్థం లేని విష‌యంపై స్పందించాల్సి రావ‌డం ప‌ట్ల విచారం వ్యక్తం చేశాడు. కానీ, కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డం త‌ప్ప వేరే మార్గం లేదన్నారు. “కొండా సురేఖ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు, అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ఉన్న ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె వ్యాఖ్యలు మా కుటుంబ సభ్యుల గౌరవాన్ని కించపరిచాయి. అగౌరవ పరిచాయి. ఆమె స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం ఎలాంటి సంబంధం లేని తమ కుటుంబాన్ని లాగడం అభ్యతరకరం. ఆమె ఆడిన రాజకీయ క్రీడలో మాలాంటి అమాయకులను బలిపశువులుగా నిలబెట్టారు. బాధిత కుటుంబ సభ్యుడిగా, సినీ నటుడిగా ఈ విషయంపై నేను మౌనంగా ఉండను. ఈ సిగ్గుమాలిన వ్యక్తికి న్యాయపరంగా తగిన బుద్ది చెప్పే ప్రయత్నం చేస్తాం. సమాజంలో ఆమె లాంటి వాళ్లకు ఉండే అర్హత లేదు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు” అంటూ ట్విట్టర్ వేదికగా తన కోపాన్ని వెల్లగక్కారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తలైవర్
ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సెప్టెంబర్ 30వ తేదీన తలైవర్ రజనీకాంత్ తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. గుండెకు అనుసంధానం అయి ఉండే ప్రధాన రక్త నాళం బృహద్ధమనిలో సమస్య తలెత్తినట్లు తెలిసింది. ఈ సమస్య కోసం ఆయన గుండెలో ఒక స్టంట్ వేశారు. అనంతరం ఆయన కండీషన్ స్టేబుల్ అయింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'శ్వాగ్' రివ్యూ: 'రాజ రాజ చోర' మేజిక్ రిపీట్ అయ్యిందా...
రాజ రాజ చోర'తో శ్రీ విష్ణు భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా దర్శకుడు హసిత్ గోలితో ఆయన చేసిన తాజా సినిమా 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో శ్రీవిష్ణు నాలుగు రోల్స్ చేశారు. రీతూ వర్మ కథానాయికగా... మీరా జాస్మిన్, దక్షా నగార్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 'సామజవరగమన', 'ఓం భీం బుష్' తర్వాత శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ ఇచ్చిందా? లేదా? ఎలా ఉందో చూడండి. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

వేణు స్వామి ఇంట్లో విషాదం
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖుల జీవితాల గురించి ఆయన చెప్పిన విషయాలపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంలో ఓ విషాదం చోటు చేసుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

చిక్కుల్లో రజనీకాంత్ మూవీ.. బ్యాన్ చేయాలంటూ కేసు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో కొంత మంది మధురై కోర్టులో కేసు వేశారు. ‘వేట్టయాన్‌’ ప్రివ్యూ లోని డైలాగులు అభ్యంతకరంగా ఉన్నాయని, ఎన్ కౌంటర్లను ప్రోత్సహించేలా ఉన్నాయని వెల్లడించారు. ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget