నీ కోసం ఎంత బాధని, కష్టాన్ని అయినా ఓర్చుకుంటాను. అమ్మా అనే నీ పిలుపు కోసం అని మనసులోనే వేద చాలా బాధపడుతుంది. యష్ మాళవికని అభి ఇంట్లో వదిలిపెట్టి బయటకి వస్తాడు. అప్పుడే అభిమన్యు వచ్చి ఏ ధైర్యంతో నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చావ్ అని యష్ ని అడుగుతాడు.


యష్: ధైర్యం కాదు బాధ్యతతో వచ్చాను


అభి: ఓ.. నీ పాత పెళ్ళాం మీద పుట్టిన కొత్త మోజుకి బాధ్యత అని పేరు పెట్టారా


యష్: మాళవిక గురించి నా భార్యగా మాట్లాడితే అది భార్య స్థానాన్ని అవమానించినట్లే.. ఇప్పుడు నా దృష్టిలో మాళవిక కేవలం నా కొడుకు ఆదిత్యకి తల్లి మాత్రమే. నేను ఏం చేసినా మాళవిక కోసం కాదు ఆది సంతోషం కోసం మాత్రమే


మాలిని ఇంట్లో యష్ కోసం కోపంగా ఎదురుచూస్తుంది. ఈ టైమ్ లో ఆ యష్ తో మాళవిక ఎందుకు ఉంది అని రత్నం కూడా కోప్పడతాడు. వేద జరిగింది తలుచుకుని చాలా ఏడుస్తుంది. అప్పుడే యష్ ఇంటికి వస్తాడు. తల్లి మొహం చూసి తలదించుకుంటాడు. ఫైర్ యాక్సిడెంట్ విషయం తెలిసింది దాని నుంచి నువ్వు క్షేమంగా బయటపడినందుకు సంతోషించాలో లేదంటే ఆ టైమ్ లో నీతో మాళవిక ఉన్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదని రత్నం అంటాడు.


Also Read: ఎట్టకేలకి దేవి చెంతకి ఆదిత్య, రుక్మిణి- అక్కడ మాధవ్ ఇచ్చిన షాక్ కి బిత్తరపోయిన రాధ


మాలిని: నీతో బంధాన్ని తెంచుకుని నీ కొడుకుని నీకు దూరం చేసింది ఆ మాళవిక. నీ కూతుర్ని అనాథ చేసింది, నీ మనసు ముక్కలు చేసి మన పరువు బజారున పడేసింది. అట్లాడింటిది మళ్ళీ నీకు దగ్గర అవ్వాలనుకోవడం దాని దుర్భుద్ది, వేదకి నీకు మధ్య చిచ్చు పెట్టాలని దాని ఆలోచన అర్థం కావడం లేదా. అది చేసిన దానికి దాని నీడ కూడా నీ మీద పడటానికి వీల్లేదు అలాంటిది దాన్ని ఎందుకు దగ్గరకి రానిస్తున్నావ్. అసలు ఆ మాళవికకి నీకు మధ్య కొత్తగా ఏం జరుగుతుంది


యష్: మీరు అనుకున్నట్టు ఏమి జరగలేదు


మాలిని: జరిగింది కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏం జరగడం లేదని మమ్మల్ని ఎలా నమ్మమంటావ్. యష్ నీకు నేను కన్నతల్లిని.. నీ కళ్ళు నన్ను మోసం చేయలేవు. దించుకున్న తల చెప్తుంది ఏదో తప్పు జరుగుతుందని, మనం ఇంత బాగున్నామ్ అంటే కారణం ఎవరో తెలుసా వేద.. మన మొహాల్లో వెలుగు, సంతోషం వచ్చింది దీనంతటకి కారణం ఎవరు వేద. కానీ మనం ఏం చేస్తున్నాం తనని కష్టపెడుతున్నాం ఇది న్యాయమేనా. సూటిగా సమాధానం చెప్పు నిన్ను ప్రశ్నించే హక్కు తల్లిగా నాకు ఉంది


వేద: లేదత్తయ్య.. ఆయన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. ఆయన మీకు కొడుకు ఒప్పుకుంటాను కానీ ఆయన నా భర్త, నేను ఆయన భార్యని. భార్యగా నా తరపున ఆయన్ని నిలదీసే హక్కు ఎవరికి లేదు. నాకు నా భర్తకి మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకునే హక్కు ఎవరికి లేదు అది అత్తయ్య అయినా అమ్మ అయిన ఎవరైన సరే అనేసి యష్ చెయ్యి పట్టుకుని ఏడ్చుకుంటూనే లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. యష్ మాట్లాడటానికి ట్రై చేస్తాడు కానీ వినిపించుకోదు.


Also Read: అభి, ప్రేమ్ కొట్లాట- తులసిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న పరంధామయ్య


అభి వచ్చి మాళవికని పలకరిస్తాడు. అసలు ఆ హోటల్ కి ఎందుకు వెళ్ళావ్ అని అడుగుతాడు. యాక్సిడెంట్ విషయంలో లాయర్ ని కలవడానికి వెళ్ళాను ఆ విషయంలో యష్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు, ఫైర్ యాక్సిడెంట్ నుంచి కూడా కాపాడింది యశోధర్ అని మాళవిక చెప్తుంది. అంటే నీ ఎక్స్ హజ్బెండ్ చాలా చేస్తున్నాడా అని అభి వెటకారంగా మాట్లాడతాడు. నీ కంటే వందరెట్లు బెటర్ అని మాళవిక అభి ఇగో మీద హర్ట్ చేస్తుంది. యష్ ని వదిలేసి నీ దగ్గరకి వచ్చింది నీ మీద ప్రేమతో కానీ నువ్వు ఏం చేశావ్ నాకు తాళి కట్టావా.. కనీసం ఆ యశోధర్ ని చూసి అయినా నేర్చుకో అని మాళవిక అంటుంది. ఎంత పొగరు నీకు నన్నే ఎదిరిస్తావా హద్దు మీరుతున్నావ్ మాళవిక నీకు తెలిసిన అభిమన్యు లోపల నీకు తెలియని అభి ఉన్నాడు వాడు బయటకి వస్తే భరించలేవని అనుకుంటాడు.