వేద విన్నీ ఇంటికి వచ్చి థాంక్యూ చెప్తుంది. నువ్వు, మా అమ్మ చెప్పకపోయి ఉంటే ఆయనకి ఇంత దగ్గర అయ్యే దాన్ని కాదు, మీరే చెప్పకపోయి ఉంటే ఆయన మీద నాకున్న ప్రేమ ఆయనకి తెలిసేది కాదు. మనం ఇష్టపడే మనిషి మీద ఇష్టాన్ని మన మనసులో ఉన్న ప్రేమను దాచుకోకుండా చెప్పాలనుకుంటే మనసు ఇంత హ్యపీగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. మనసులో భారం దించేసినట్టు రిలీఫ్ గా ఉందని వేద సంతోషంగా చెప్తుంది. నీలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని అంటాడు. ఫస్ట్ యానివర్సరీ కదా ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నావ్ అని అడుగుతాడు. మోకాళ్ళ మీద ఆయన వేలికి ఉంగరం తొడుగుతూ ఐలవ్యు అని మనసులో మాట చెప్పాలని ఉందని వేద చెప్తుంది. పైకి మాత్రం మెచ్చుకుంటూనే లోలోపల మాత్రం తిట్టుకుంటాడు. ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఐడియా ఇవ్వమని అంటే వాచ్ ఇవ్వమని చెప్తాడు.


Also Read: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ


తనే గిఫ్ట్ ఇంటికి తీసుకొస్తానని అంటాడు. మీ మధ్య ఊహించనంత గ్యాప్ క్రియేట్ చేసి నిన్ను అమెరికా ఎత్తుకెళ్ళిపోతానని విన్నీ మనసులో అనుకుంటాడు. వేద, యష్ ఇద్దరూ పెళ్లి జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ తలుచుకుని చాలా సంతోషంగా ఉంటారు. ఇంకొక గంటలో ఫస్ట్ యానివర్సరీ వచ్చేస్తుందని సంబరపడతారు. ఆయనకి విసేష్ చెప్పాలని సర్ ప్రైజ్ చేయాలని ఇద్దరూ అనుకుంటారు. విన్నీ కోపంతో యష్, వేద పెళ్లి కార్డుని తగలబెట్టేస్తాడు. వెంటనే వేదకి కాల్ చేసి కడుపులో నొప్పి చాలా ఎక్కువగా ఉంది తట్టుకోలేకపోతున్నా ఒక్కసారి రా అని నటిస్తూ ఫోన్ లో మాట్లాడతాడు. అది నిజమని అనుకుని వేద కంగారుగా వెళ్తు యష్ కి చెప్తుంది. విన్నీకి హెవీగా కడుపులో నొప్పి వస్తుందట సీరియస్ గా ఉందని చెప్పి హడావుడిగా వెళ్తుంది. వేద వెళ్లిపోవడంతో యష్ బాధపడతాడు.


వేద రావడం చూసి విన్నీ కడుపు నొప్పి బాధతో విలవిల్లాడిపోతున్నట్టు నటిస్తాడు. తనకి జాగ్రత్తలు చెప్తూ ట్రీట్మెంట్ ఇస్తుంది. నొప్పి తగ్గిపోతుందని అంటుంది. 12 అయ్యే సమయానికి వేద వచ్చేస్తుంది. తనకి కూడా చాలా ఎగ్జైట్ మెంట్ గా ఉంటుంది కదా అని అనుకుంటాడు. తన కోసం యష్ ఎదురుచూస్తూ ఉంటాడని పెళ్లిరోజు కదా ఇద్దరం కలిసి సెలెబ్రేట్ చేసుకోవాలని మనసులో అనుకుంటుంది. ప్రాబ్లమని చెప్పగానే ఈ టైమ్ లో కూడా వచ్చావ్ థాంక్స్ అని విన్నీ అంటాడు. నేనొక డాక్టర్ ని పేషెంట్ కి ఏ టైమ్ లో అయినా ట్రీట్మెంట్ ఇవ్వాలని అంటుంది. వేద కచ్చితంగా బయల్దేరే టైమ్ కి విన్నీ కావాలని నొప్పి అంటు బాత్ రూమ్ కి వెళతాడు. శ్రీమతి గారు ఇంకా ఇంటికి రాలేదేంటి ఏదైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందా ఏంటని మురిసిపోతాడు.


Also Read: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్


చాలా భయంగా ఉందని నటిస్తూ వేదని పట్టుకుంటాడు. యష్ బెడ్ రూమ్ లో గోడ మీద పూలతో ‘హ్యపీ వెడ్డింగ్ యానివర్సరీ మిసెస్ న్యూసెన్స్’ అని చక్కగా అలంకరిస్తాడు. తనకి తగ్గే వరకు వెళ్లొద్దని విన్నీ అడగటంతో వేద ఉండిపోతుంది. ఇంటి దగ్గర యష్ పూల బొకే పట్టుకుని తన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.