మాళవిక అదిత్యని కొత్త స్కూల్ కి తీసుకుని వస్తుంది. ఇదే స్కూల్ లో ఖుషి కూడా చదువుకుంటుందని మాళవిక చెప్తుంది. అది విని ఆది చాలా సంతోషిస్తాడు. ఖుషి, నువ్వు ఒకే స్కూల్ లో ఉంటే మీరిద్దరు హ్యాపీగా ఉండొచ్చు తను నా దగ్గరకి రాకపోయినా నీతో అయిన కలిసి ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాళవిక చెప్తుంది. యశోధర్ మాటలు విని నా గురించి తప్పుగా అనుకుంటూ నాదగ్గరకి రావడం లేదు నువ్వు నా గురించి మంచిగా చెప్పి తన మనసు మార్చమని నూరి పోస్తుంది. ఖుషి ఒక చోట ఆడుకుంటూ ఉంటే ఆదిత్య వస్తాడు. ఇద్దరు చాలా కలుసుకుని చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు. వేద ఖుషి కోసం వచ్చి వెతుకుతూ బయటకి వచ్చి చూసేసరికి ఆది, ఖుషి మాట్లాడుకుంటూ ఉండటం చూసి చాలా సంతోషిస్తుంది.


పేరెంట్స్ మీటింగ్ ఉందని అమ్మా నేను వచ్చామని ఖుషి చెప్తుంది. ఆ మాటకి అంటే మీ నాన్న కూడా వస్తారా అని అడుగుతాడు. లేదు కానీ మన నాన్న అనొచ్చు కదా అని ఖుషి బాధగా అడుగుతుంది.  వాళ్లిద్దర్నీ అలా చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు కదా అని మాళవిక అంటుంది. అన్న చెల్లెళ్ళు కలిస్తే కన్నుల పండుగగానే ఉంటుందని వేద చెప్తుంది. 'వాళ్ళ నవ్వులు చూడు ఆ రెండు నా వల్ల పుట్టాయి. బిడ్డల్ని కనే అదృష్టం లేని నువ్వు పిల్లల గురించి నాకు చెప్తుంటే నవ్వొస్తుంది. నా కూతుర్ని మీ మాటలు చేతలతో నాకు దూరం చేశారు. నన్ను ఒంటరిని చేశారని మురిసిపోయారు. అప్పుడు వచ్చాడు నా కొడుకు నా ఆదిత్య. వాడు ఏంటో వాడి పొగరు ఏంటో పుట్టినరోజునాడు చూశారు కదా. నా బలం, నమ్మకం వాడే. ఖుషికి ఆది అంటే ఇష్టం, ఆదికి ఖుషితో పాటు నేనంటే ఇష్టం తన మనసు మార్చలేడా? మీరు దూరం చేసిన తల్లి కూతుళ్లని నా కొడుకు కలపలేడా ఆ ఆశతోనే నా కొడుకుని ఈ స్కూల్ లో జాయిన్ చేస్తాను. ఆది మాటలతో ఖుషి చుట్టూ నీకు అందనంత ఎత్తులో కంచె కట్టించి నీకు దూరం చేసేలా చేస్తాను’ అని మాళవిక చెప్తుంది.


Also Read:  అసలు ఏం జరుగుతోందని నిలదీసిన కార్తీక్, మోనితకు సవాల్ విసిరి వెళ్లిన దీప!


నువ్వు అసలు తల్లివేనా ఇంత నీచంగా ఆలోచించి పసి పిల్లల మనసుతో ఆడుకుంటావా అని వేద కోప్పడుతుంది. 'ఈ ఆట మొదలు పెట్టింది నువ్వు, నీ మొగుడు యశోధర్. నా కూతురుకి కన్న తల్లిని శత్రువుని చేశారు. పేగు బంధాన్ని దూరం చేసినంత తేలిక కాదు ఆ రక్త సంబంధాన్ని దూరం చెయ్యడం. నా కూతుర్ని దక్కించుకుని తీరతాను. నీకు నీ మొగుడికి చేతనైంది చేసుకొమ్మని' మాళవిక సవాల్ విసురుతుంది. ‘ఆది మీద నమ్మకంతో ఖుషి నీ దగ్గరకి వస్తుందని అంటున్నావ్. ఆదినే నిజమైన ప్రేమ తెలుసుకుని వాళ్ళ నాన్న దగ్గరకి వస్తాడు’ అని వేద సవాల్ విసురుతుంది. అది జరగదు ఈ ఆటలో జరిగేది నేనే గెలిచేది రాసి పెట్టుకో అని మాళవిక అంటుంది.


స్కూల్ లో చేర్పించడానికి మాళవిక ప్రిన్సిపల్ దగ్గరకి వస్తుంది. ఫాదర్ యశోధర్ కదా ఆయన లేకుండా ఎలా కుదరదని చెప్తుంది. ఆఫీసు పనిలో ఆయన బిజీగా ఉన్నారు రాకపోవచ్చు అని మాళవిక అంటే మీ హజ్బెండ్ వస్తేనే అడ్మిషన్ ఇస్తామని లేకపోతే లేదని చెప్తారు. దీంతో మాళవిక అభిమన్యు కి ఫోన్ చేస్తుంది. ఫాదర్ లేకుండా అడ్మిషన్ ఇవ్వమని చెప్తునట్టు చెప్తుంది. అభి స్కూల్ దగ్గరకి వచ్చి ఫాథర్ గా వచ్చి సైన్ చెయ్యమని అడుగుతుంది.. కానీ రాకుండా ఏదో కారణం చెప్పి తప్పించుకుంటాడు. యష్ కి ఫోన్ చేసి ఆఫీసు నుంచి బయటకి వచ్చేలా చెయ్యి అది మనకి చాలా ఉపయోగం అని సలహా ఇస్తాడు. పేరెంట్స్ మీటింగ్ కి ఫాదర్ రాలేదని వేదని తిడుతుంది టీచర్. అది చూసి ఖుషి ఫీల్ అవుతుంది.


Also Read: మనసు మాట్లాడమంటోంది షరతు వద్దంటోంది - ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అంతే!


మాళవిక యష్ కి ఫోన్ చేసి రెచ్చగొట్టేలా మాట్లాడి అడ్మిషన్ తీసుకోడానికి సైన్ చెయ్యడానికి ఒప్పిస్తుంది. నాకు ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆ ప్రాజెక్ట్ నాకు చాలా ముఖ్యం. ఈరోజుకి ఆగు రేపు అడ్మిషన్ తీసుకుందామని చెప్తాడు. కానీ మాళవిక వినదు, వస్తే రా లేదంటే లేదు అని ఫోన్ పెట్టేస్తుంది. మీటింగ్ పోస్ట్ పోన్ చెయ్యమని యష్ వసంత్ ని అడుగుతాడు. కుదరదని చెప్తాడు వసంత్. యష్ మాత్రం నా కొడుకు లైఫ్ ఇది నాకు మీటింగ్ కంటే అదే ఇంపార్టెంట్ అని స్కూల్ కి వెళతాడు. స్కూల్ దగ్గరకి యష్ రావడం ఖుషి చూసి సంతోషిస్తుంది.


తరువాయి భాగంలో..


యష్ కోపంగా ఉంటే హలో మిస్టర్ డాడీ మీమీద నాకు చాలా కోపంగా ఉంది నేను రమ్మంటే బిజీ అని చెప్పి అన్నయ్య కోసం స్కూల్ కి వచ్చావ్ అని అడుగుతుంది. వేద తనని ఆపి తీసుకెళ్దామని చూస్తుంది. కానీ ఖుషి మాత్రం వినకుండా మాట్లాడాలి అంటుంది. నీకు నేనంటే ఇష్టం కన్నా అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం, అన్నయ్య వచ్చేసరికి నా మీద ప్రేమ తగ్గింది, నీకు అన్నయ్య ఉంటే చాలు నేను వద్దు అంతే కదా చెప్పు నాన్న అని అడిగేసరికి యష్ కోపంగా అరుస్తాడు.