Ennallo Vechina Hrudayam Serial Today Episode: గాయత్రికి అనంత్‌ తన ప్రేమ విషయం చెబుతున్న సమయంలోనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  సరిగ్గా అదే సమయానికి వేరే వాళ్లు అక్కడికి వస్తారు. ఇదంతా  గమనించని అనంత్‌...గాయత్రిని ప్రేమిస్తున్నట్లు చెబుతుంటాడు. కానీ అప్పటికే  గాయత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన త్రిపుర ఈ మాటలన్నీ విని విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.               బాలా ఆరోగ్యం కోసం ఆమె తల్లి ఆలయం చుట్టూ  అంగప్రదక్షణ చేస్తుంది. బాలా ఆరోగ్యం పాడవ్వడం చూసి తల్లి ఆలయంలో తీవ్రంగా రోదిస్తుంది.ఈలోగా త్రిపుర స్వామివారికి నైవేద్యం వండటం పూర్తవుతుంది. ఆ ప్రసాదాన్ని గుడిలో నేలపై వేసుకుని తింటుంది. త్రిపుర అలా నేలపై ప్రసాదాన్ని తినడాన్ని చూసిన బాలా తల్లి...ఎందుకు వాళ్లు అలా చేస్తున్నారని పంతులుగారిని అడుగుతుంది. స్వామికి ప్రసాదం నైవేద్యంగా పెట్టి అలా స్వీకరిస్తే  ఆ దేవదేవుడి కృప లభిస్తుందని చెప్పడంతో...బాలా తల్లి కూడా త్రిపుర వద్దకు వెళ్లి తనకు కూడూ ప్రసాదం కావాలని అడగటంతో ఆమె కూడా  నేలపైనే  ప్రసాదం పెట్టుకుని స్వీకరిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలాకు కూడా  తల్లి ప్రసాదం తినిపిస్తుంది. ఈ సమయంలో గాయత్రి, త్రిపుర ప్రసాదం తినడం పూర్తవ్వడంతో  గుడి చుట్టూ ప్రదక్షణలు చేయడానికి వెళ్తారు.

                  అఖండ జ్యోతిని వెలిగించేందుకు సాధువు నియమాలన్నీ చెబుతాడు. కుండలో జ్యోతిని వెలిగించుకుని  మోకాళ్లపై మెట్లను ఎక్కి అఖండ జ్యోతి వద్దకు చేరుకోవాలని చెబుతాడు.. ఆ తర్వాత అక్కడ దాని చు‌ట్టూ 11 సార్లు ప్రదక్షణ చేసిన తర్వాత...నిప్పుల గుండంలో నడుచుకుంటూ వెళ్లి అఖండ జ్యోతిని వెలిగించాలని చెబుతాడు. అప్పటి వరకు ఈ కుండలో జ్యోతి కొండెక్కకుండా చూసుకోవాలని ఆజ్ఞాపిస్తాడు. ఇది చాలా కష్టతరమైన పరీక్ష అని....పుష్కరకాలంగా ఎవరూ  ఈ దీక్షను సంపూర్ణం చేయలేకపోయారని...నువ్వు   ఆ దీక్ష పూర్తిచేస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయని సెలవిస్తాడు. దీంతో త్రిపుర నెత్తిపైన దీపం పెట్టుకుని మోకాళ్లతో మెట్లను ఎక్కడం ప్రారంభిస్తుంది. అదంతా  చాటుగా విన్న ఫణి...త్రిపుర దీక్షను చెడగొట్టేందుకు కుట్రలు పన్నుతాడు. ఆమె వెళ్లే మార్గంలో పూలు చల్లినట్లు అందులో  గాజుపెంకులు వేస్తాడు. త్రిపుర ఆ గాజు పెంకుల మీదుగానే మోకాళ్లపై మెట్లను ఎక్కుతుంటుంది.

                             మోకాళ్ల నుంచి రక్తం వస్తున్నా...దీక్షను విరమించదు. ఈలోగా  గుడిలో తప్పిపోయిన బాలా కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుంటారు. ఎట్టకేలకు మెట్లన్నీ ఎక్కిన త్రిపుర...అగ్నిగుండం వద్దకు చేరుతుంది. ఆమె అగ్నిగుండలో నడవడానికి సిద్ధమవ్వగా...అప్పుడే అక్కడికి ఓ వ్యక్తి వచ్చి అగ్నిగుండంలో నడిచే ముందుకు కాళ్ల శివభస్మం రాసుకోవాలని చెబుతాడు.అంతకు ముందే ఆ వ్యక్తికి ఫణి డబ్బులు ఇచ్చి ఆ భస్మంలో కెమికల్ కలుపుతాడు. ఆది రాసుకుని త్రిపుర అగ్నిగుండంలో అడుగుపెట్టగానే మంటలు చెలరేగి అందులోనే పడి చనిపోయేలా ప్లాన్ చేస్తాడు. నిజమేనని నమ్మిన గాయత్రి ఆ భస్మం తీసుకుని అక్క కాళ్లకు రాస్తుంది.సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన నాగసాధువులు....త్రిపుర పసుపు నీళ్లు పోసుకోకుండా వెళ్లడాన్ని గమనిస్తారు.అప్పుడే అక్కడికి వచ్చి న బాలా వారి మాటలు విని పసుపు నీళ్లు తెచ్చి ఆమెపై పోస్తాడు. అప్పుడు త్రిపుర అగ్నిగుండం దాటుతుంది. గాయత్రి చేతిలోఉన్న శంఖం తీసుకుని బాలా గట్టిగా ఊదుతాడు. అప్పుడే త్రిపుర అగ్నిగుండం వద్దకు చేరుకోవడంతో ఇవాల్టి ఏపిసోడ్ ముగుస్తుంది.