దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి హిట్టు మీద హిట్టుతో దూసుకుపోతున్నారు. ఒక్కో సినిమా కోసం మూడు, నాలుగేళ్లు కష్టపడే ఈ డైరెక్టర్ ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తీసుకొచ్చింది ఈ సినిమా. 'ఆర్ఆర్ఆర్'తో దర్శకుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నారు రాజమౌళి. 


ఇదిలా ఉండగా.. తాజాగా రాజమౌళి ఓ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. ప్రముఖ కార్ల కంపెనీ వోల్వోకి చెందిన ఎక్స్‌సి40 కారుని కొన్నారు. ఈ సందర్భంగా వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను వోల్వో కార్స్ ఇండియా ఇన్స్టాగ్రామ్ లో ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


రాజమౌళి కొన్న ఈ కారు ధర సుమారు రూ.44.50 లక్షలు. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఎన్నో ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రాజమౌళి కారు కొన్న పోస్ట్ చూసిన నెటిజన్లు ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ఆయన మహేష్ బాబు హీరోగా సినిమాను మొదలుపెట్టనున్నారు. జేమ్స్ బాండ్ తరహాలో సినిమా ఉంటుందని సమాచారం. 


Also Read:సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్