యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా వారం రోజుల్లో సినిమా ఏడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. బ్రేక్ లేకుండా దూసుకుపోతున్న ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం. 

 

ఇక ఈ సినిమా టీమ్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పెషల్ పార్టీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఈ పార్టీని హోస్ట్ చేశారు. దీనికి 'ఆర్ఆర్ఆర్' టీమ్ మొత్తం అటెండ్ అయింది. అలానే ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు కూడా ఈ పార్టీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదివరకు అల్లు అర్జున్ 'మహానటి' టీమ్ కి ఇలానే పెద్ద పార్టీ ఇచ్చారు. ఇప్పుడు దిల్ రాజు 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు టీమ్ కి పార్టీ ఇస్తున్నారు. 

 

ప్రస్తుతం దిల్ రాజు.. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకు ఎన్టీఆర్ తో కొన్ని సినిమాలు చేశారు దిల్ రాజు. తన హీరోలపై ఉన్న అభిమానంతో.. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకురావడంతో దిల్ రాజు ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నారు.