బిగ్‌బాస్‌ షోకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఇంతాఅంతా కాదు. ఇప్పుడు బిగ్ బాస్5 సీజన్ గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఫినాలేకు సంబంధించి షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది బాలీవుడ్ తారలు కూడా అతిధులుగా వచ్చారు. విన్నర్ గా గెలిచిన వారికి రూ. 50 లక్షల క్యాష్ తో పాటూ, 300 గజాల ప్లాటు దక్కుతుంది. అయితే గత సీజన్లో విన్నర్‌కు దక్కింది చాలా తక్కువే. 


సోహెల్‌కే ప్రత్యేకం...
గత సీజన్ విన్నర్ అభిజిత్. అతనికి రెండున్నర లక్షల రూపాయల బైకుతో పాటూ పాతిక లక్షల రూపాయల చెక్ లభించింది. ఇక  సోహెల్‌కు కూడా పాతిక లక్షల రూపాయలు దక్కాయి. అందుకే ఆ సీజన్లో నిజానికి విన్నర్ అభిజితా లేక సోహెలా అన్న సందేహం వచ్చింది. విన్నర్ కూ, మధ్యలో ఆటను వదిలి వెళ్లిన వ్యక్తికి కూడా అంతే మొత్తం ఇవ్వడం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. ఆ ఫినాలేలో అది ట్విస్టనే చెప్పాలి. నిజానికి ప్రతి సీజన్లో కూడా ఇలా టాప్ 5 లేదా టాప్ 3లో ఉన్న కంటెస్టెంట్లకు డబ్బులు ఆఫర్ చేసి వెళ్లిపోతారా అని అడుగుతారు. అయితే ఆ మొత్తం పదిలక్షల రూపాయలకు మించి ఉండదు. కానీ బిగ్ బాస్ 4లో మాత్రం విచిత్రం. విన్నర్ తో సమానమైన మొత్తాన్ని గెలుచుకున్నాడు మూడో స్థానంలో ఉన్న కంటెస్టెంట్ సోహెల్.


ఈసారి పరిస్థితి?
ఎప్పటిలాగే ఈసారి కూడా టాప్ త్రీలో ఉన్నవారిలో ఒకరికి డబ్బుల బ్రీఫ్ కేస్‌ను ఇచ్చి ఎంతో కొంత ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఆ మొత్తం నాలుగో సీజన్లాగా 20 లక్షలు లేదా పాతిక లక్షలు ఉంటుందా లేక అంతకన్నా ముందు సీజన్లలా పదిలక్షల రూపాయలతో ఆగుతుందా చూడాలి. ఒకవేళ ఆ డబ్బును తీసుకోవడానికి ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు ఒప్పుకోవచ్చు అనేది కూడా చూస్తే.... సన్నీ, షన్నులు ఒప్పుకునే ఛాన్సులు తక్కువే. ఇక శ్రీరామ్ కూడా ఫస్ట్ ఫైనలిస్టు కాబట్టి వెళ్లడానికి ఇష్టపడడు. సిరి, మానస్‌లు తీసుకుంటే లాభపడతారు. తీసుకోకపోతే నాలుగు లేదా అయిదో స్థానాలతో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. 


Also Read: సిరి నువ్వు నాకు పడిపోయావ్.. వెనుక నుంచి వాటేసుకున్న షన్ను.. సన్నీ ఫైట్.. శ్రీరామ్ సైలెంట్!


Also Read: ‘షన్ను.. ఐ లవ్ యూ’.. మనసులో మాట చెప్పేసిన సిరి.. ముద్దులు హగ్గులతో సహన పరీక్ష!


Also Read: సిరి ఓట్లకు గండి కొట్టిన ‘బిగ్ బాస్’.. ఆమె ఎలిమినేషన్‌తో షన్ను ‘లెక్క’ మారుతుందా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి