టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవిశ్రీప్రసాద్(DeviSriPrasad) ఒకరు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాతో దేవిశ్రీప్రసాద్ రేంజ్ మరింత పెరిగింది. వరల్డ్ వైడ్ గా ఆయన సాంగ్స్ పాపులర్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ సినిమాలకు సంగీతం అందించాలని దేవిశ్రీప్రసాద్ ను కోరుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)కి కూడా దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ బాగా నచ్చాయి. 


అందుకే తను నటిస్తోన్న 'కిసీ కా బాయ్, కిసీ కా జాన్' అనే సినిమాకి సంగీతం అందించాలని సల్మాన్(Salman)ను కోరారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు అని వార్తలొచ్చాయి. కానీ అభిప్రాయ బేధాలు రావడంతో ఈ సినిమా నుంచి దేవిశ్రీప్రసాద్ తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు చాలా మంది కంపోజర్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై దేవిశ్రీప్రసాద్ స్పందించారు. 


'కీసీ కా బాయ్ కీసీ కీ జాన్' సినిమాలో అన్ని పాటలకు మ్యూజిక్ అందించాలని తనను అడగలేదని దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు. తనను సంప్రదించే సమయానికి చిత్రబృందం దగ్గర కొన్ని పాటలు ఉన్నాయని.. కానీ దర్శకుడు స్క్రిప్ట్ ను వినిపించి పాటలు అందించాలని కోరారని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. కథను వినిపించేప్పుడు సినిమాలో చాలా పాటలకు చోటు ఉందని.. కానీ రన్ టైం పెరుగుతుండడంతో పాటల సంఖ్యను తగ్గించారని చెప్పారు. 


అదే విషయాన్ని తనకు కూడా చెప్పారని.. అయితే సల్మాన్ కోసం క్రేజీ సాంగ్ ను కంపోజ్ చేశామని.. అది అభిమానులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు.   


ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న‘కిసి కా భాయ్ కిసి కా జాన్’  సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పూజ అన్న పాత్రలో వెంకటేష్  కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వెంకటేష్ కు, సల్మాన్ కు మంచి దోస్తీ ఉంది. అందుకే సల్మాన్ తన సినిమాలో నటించాలని కోరడంతో వెంకీ వెంటనే ఓకే చెప్పారట. ఇదే సినిమాలో మరో కీ రోల్ జగపతి బాబు చేస్తున్నారట.   


ఈ సినిమా నుంచి దర్శకుడు ఫర్హాద్‌ సమ్జీ తప్పుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే కరోనా వ్యాపించింది. దీంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. అయితే తొలి షెడ్యూల్ అవుట్ ఫుట్ చూసి.. సల్మాన్‌ నచ్చలేదని చెప్పారట. మళ్లీ రీషూట్ చేద్దామన్నారట. దర్శకుడు అవమానంగా ఫీలై.. వెంటనే సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆయన వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఈ సినిమా బాధ్యతలను సల్మాన్ ఖాన్ చూసుకుంటున్నారట. ఈ సినిమాని దర్శకుడి సహాయం లేకుండా తానే డైరెక్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడట.  


Also Read : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?


Also Read : వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!