అక్కినేని హీరోలు అందగాళ్ళు అని తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు ఉంది. ఆఫ్ కోర్స్... వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా సరే ఆ మాట చెప్పేయొచ్చు. అక్కినేని అభిమానుల్లో మహిళలు, అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు. ఆ ఫ్యామిలీ హీరోల మీద మనసు పారేసుకున్న అమ్మాయిల జాబితా తీస్తే చాలా మంది ఉంటాయి. వారిలో పెళ్ళైన హీరోయిన్ కూడా ఉన్నారు. అసలు వివరాల్లోకి వెళితే...


అఖిల్ అక్కినేని... ఆనంది...
టీవీలో ఓ సిగ్గుపడిన మూమెంట్!
జీ తెలుగు టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతున్న డాన్స్ రియాలిటీ షో 'డాన్స్ ఇండియా డాన్స్'. ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్‌కు చేరుకుంది. దానికి అఖిల్ అక్కినేని గెస్టుగా వచ్చారు. ఆ షోలో హీరోయిన్లు సంగీత, ఆనందితో పాటు కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. 


స్టేజి మీద అఖిల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ''అఖిల్ గారిని చూస్తుంటే... ఎందుకు ఇంత ఫాస్టుగా పెళ్ళి చేసుకున్నానా? అనిపిస్తోంది'' అంటూ ఆనంది ముసిముసి నవ్వుల్లో మునిగి తేలారు. ''మీరు నేను సిగ్గుపడేలా చేశారు'' అని అఖిల్ రిప్లై ఇచ్చారు. 


అయ్య గారే నంబర్ వన్!
అఖిల్ వీరాభిమానుల్లో ''అయ్య గారే నంబర్ వన్'' అంటూ ఓ అభిమాని హల్ చల్ చేశాడు! గుర్తుందా? ఆ తర్వాత అతడు కొన్ని రియాలిటీ షోల్లో కూడా కనిపించాడు. అయ్య గారే నంబర్ వన్ అనేది కూడా పాపులర్ అయ్యింది. 'డాన్స్ ఇండియా డాన్స్' ఫినాలే ఎపిసోడ్ స్టేజి మీద లేడీ కమెడియన్ రోహిణి వచ్చి ''అయ్య గారే నంబర్ వన్'' అని అన్నారు. అదీ సంగతి!


'ఏజెంట్'గా అఖిల్...
వచ్చేది ఎప్పుడు?
అఖిల్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తున్నారు. ఇదొక స్పై థ్రిల్ల‌ర్‌. హీరోగా అఖిల్‌కు 5వ సినిమా. ఇందులో పాత్ర కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేశారు. హెయిర్ స్టైల్ కొత్తగా ట్రై చేశారు. ఒంటి మీద టాటూలతో కనిపిస్తున్నారు. అఖిల్ లుక్ వైరల్ అవుతోంది.


Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?   




అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఎక్కువ సినిమాలు ఉండటంతో వాయిదా వేశారు. దాంతో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.  



'సైరా నరసింహా రెడ్డి' తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. వక్కంతం వంశీ కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ ప్రేక్షకులకు నచ్చింది. సినిమాపై అంచనాలు పెంచింది. దీనిపై అఖిల్ కూడా చాలా నమ్మకం పెట్టుకున్నారట. యూనిట్ అంతా సినిమా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ చూపిస్తోంది.


Also Read : జగనూ, నీకు మానవత్వం లేదు! - పృథ్వీ పంచ్ ఎవరి మీద?


అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ రెడ్డికి చెందిన స‌రెండ‌ర్ 2 సినిమా ప‌తాకాల‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: రాగూల్ హెరియన్ ధారుమాన్, ఎడిటర్‌: నవీన్ నూలీ, ఆర్ట్ డైరెక్టర్‌: అవినాష్ కొల్లా, సహ నిర్మాతలు: అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తి దీపారెడ్డి.