Youtuber Chandu Sai Arrest : ప్రముఖ యూట్యూబ్ చందు సాయి అరెస్ట్ అయ్యాడు. ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి ఆమెపై అత్యాచారం చేసి మోసం చేశాడన్న ఆరోపణలతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి చందు సాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యూట్యూబ్లో మెసేజ్ ఓరియెంటెడ్, కామెడీ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందు సాయి ‘పక్కింటి కుర్రాడు’ అనే ట్యాగ్ తో యూట్యూబ్‌లో పాపులర్ అయ్యాడు. యూట్యూబ్‌లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.


ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న చందు సాయి యువతిపై అత్యాచార ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కాడు. హైదరాబాద్ నగర శివారు నార్సింగికి చెందిన ఓ యువతీ నమోదు చేసిన ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసి చందు సాయిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో తనను చందు సాయి మోసం చేశాడని, తనపై అత్యాచారం కూడా చేయబోయాడని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.


దీంతో చందు సాయిపై రేప్, చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకుంటానని చందు సాయి స్వయంగా చెప్పినట్లు బాధితురాలు తెలిపింది. ప్రేమ పేరుతోనే గతంలో తన పుట్టినరోజు అని చెప్పి ఇంటికి పిలిచి 2021 ఏప్రిల్ 25 తేదీన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఆ యువతి వెల్లడించింది.


Also Read : ఘనంగా ‘ద్వారక’ హీరోయిన్ పూజా జవేరి పెళ్లి - వరుడు ఎవరో తెలుసా?