యువ కథానాయకుడు రాహుల్ విజయ్ (Rahul Vijay) నటించిన తాజా సినిమా 'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్' (Khel Khatam Darwajaa Bandh Telugu Movie). నేహా పాండే హీరోయిన్. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త పాటను తాజాగా విడుదల చేశారు. 

ఏదో ఏదో... కార్తీక్ పాడిన పాట'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్' సినిమాలో 'ఏదో ఏదో...' అంటూ సాగిన పాటను కార్తీక్ పాడారు. ఇందులో వినిపించే మరో గొంతు హారిణిది. సురేష్ బొబ్బిలి మాంచి మెలోడీ బాణీ అందించగా... సింగర్స్ ఇద్దరూ శ్రావ్యంగా పాడారు. ఈ పాటను పూర్ణాచారి రాశారు.

Also Readఎవరీ సాయి అభ్యంకర్? అల్లు అర్జున్ సినిమాకు మ్యూజిక్ చేసే ఛాన్స్ కొట్టేసిన 20 ఏళ్ల కుర్రాడు ఎవరో తెలుసా?

హిలేరియస్ ఫన్ రైడ్ సినిమాగా 'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్'ను తీస్తున్నామని కొత్త దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నామని నిర్మాత తెలిపారు.

రాహుల్ విజయ్, నేహా పాండే జంటగా నటించిన 'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్'లో అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, 'గెటప్' శ్రీను, 'రచ్చ' రవి, రవి వర్మ, గంగవ్వ, జయశ్రీ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం: మోహన్ జి, నృత్య దర్శకత్వం: ఈశ్వర్ పెంటి, కూర్పు: ఉదయ్ కుమార్ డి, క్రియేటివ్ హెడ్: బాబ్ సునీల్, ఛాయాగ్రహణం: కార్తీక్ కొప్పెర, సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి, నిర్మాత: అర్జున్ దాస్యన్, దర్శకత్వం: అశోక్ రెడ్డి కడదూరి.

Also Readఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!