'కేజీఎఫ్'తో కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash)కు పాన్ ఇండియా ఫాలోయింగ్ పెరిగింది. ప్రేక్షకులకు ఆయన రాకీ భాయ్ అయ్యారు. యష్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic Movie). ఈ సినిమాకు గీతూ మోహన్‌ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల సినిమా టీజర్‌ విడుదల చేశారు. ప్రేక్షకులలో అది అంచనాలు పెంచింది. త్వరలో ఈ సినిమాలోని మొదటి పాటను కూడా విడుదల కానుంది. ఇక సినిమా టికెట్ రేట్లు, అదీ ఏపీలో ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

ఏపీలో 'టాక్సిక్' టిక్కెట్ రేట్లు ఎంతంటే?ఆంధ్రప్రదేశ్‌లో 'టాక్సిక్' టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉందని టాక్. ఏపీ మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేటు రూ. 277, సింగిల్ స్క్రీన్‌లలో రూ. 222గా నిర్ణయించినట్టు తెలిసింది. మల్టీప్లెక్స్‌లలో దాదాపు రూ. 100, సింగిల్ స్క్రీన్‌లలో రూ. 75 వరకు పెరగవచ్చు.

Also ReadVijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?

 కొన్ని గంటల్లో టాక్సిక్ మొదటి పాట 'తుబాహి' విడుదలToxic first song release date: టాక్సిక్ సినిమాలోని మొదటి పాట 'తబాహి'ను విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాతలు ప్రకటించారు. ఆ పాట మార్చి 2న విడుదల కానుంది. పాట పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముఖ్యంగా యష్, కియారా అద్వానీల కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. కియారా ముఖం పూర్తిగా స్పష్టంగా కనిపించనప్పటికీ... ఆమె గ్లామరస్ లుక్ అభిమానులలో ఆసక్తిని పెంచుతోంది.

Also ReadGeetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ

టాక్సిక్ సినిమా విడుదల ఎప్పుడు?'టాక్సిక్' సినిమాలో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్చి 19న 'టాక్సిక్' విడుదల కానుంది. బాక్సాఫీస్ బరిలో అదే రోజున రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' కూడా విడుదల కానుంది. ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also ReadRenu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు