రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) హీరో నటిస్తుండటంతో పాటు ఓ నిర్మాతగా రూపొందుతున్న సినిమా 'టాక్సిక్' (Toxic Movie). దీనికి గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ చేస్తున్నారు. 'ధురంధర్ 2'తో పాటుగా రిలీజ్ కావాల్సిన ఈ మూవీని ఇప్పటి వరకు వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరగా జూన్ 4న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్‌ని కూడా మార్చేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని యశ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు యశ్.

Continues below advertisement

అవును... జూన్ 4న 'టాక్సిక్' విడుదల కావడం లేదు!'టాక్సిక్' విడుదల వాయిదా పడిన విషయాన్ని యశ్ కన్ఫర్మ్ చేశారు. ''కొన్ని సినిమాలు ఆడియన్స్ ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా, ప్రేమలో పడేలా చేస్తాయి. మా 'టాక్సిక్' ప్రయాణం కూడా అలాంటిదే. సినిమాకాన్ అనే అంతర్జాతీయ వేదిక మీద మా సినిమా ప్రదర్శించినప్పుడు అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఇది వరల్డ్ వైడ్ సినిమా ప్రేమికుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం వచ్చింది. 'టాక్సిక్' సినిమా పూర్తి అయ్యింది. వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇంతకు ముందు ప్రకటించినట్టుగా జూన్ 4న ఈ మూవీని రిలీజ్ చేయడం లేదు. అన్ని దేశాలకు సరిపడే ఓ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. త్వరలోనే టాక్సిక్ అందరి ముందుకు వస్తుంది'' అని యశ్ తెలిపారు. 

Also Read: Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్

Continues below advertisement

ఇంకా ''ప్రస్తుతం మన సినిమాలు అంతర్జాతీయ వేదికలపై మన దేశాన్ని ప్రతిబింబించేలా ఉంటున్నాయి.. దానికి తగ్గట్టుగానే మా టాక్సిక్ కూడా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమా సత్తాని, టాక్సిక్ ప్రభావాన్ని ఉండేలా ఓ నిర్మాతగా, నటుడిగా నాకు ఈ గొప్ప అవకాశం దొరికింది.. ఈ ప్రయాణంలో మాకు ఎన్నో సవాళ్లు ఎదురైనా మా వెంటే ఉండి నడిపిస్తున్న, ప్రేమను పంచుతున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్.  కొన్ని కథలు మన సహనాన్ని పరీక్షిస్తాయి. కొన్ని ప్రయాణాలు వాటిని డిమాండ్ చేస్తాయి..  సినిమాని సెలెబ్రేట్ చేసుకునేలా టాక్సిక్‌ను రూపొందించాం.. ఇండియన్ సినిమాకి గర్వకారణంగా ఈ టాక్సిక్ ఉంటుంది'' అని యశ్ ప్రకటించారు.

Also ReadLenin First Review: కొత్త అఖిల్‌ను చూస్తారు - 'లెనిన్' చూసిన నాగార్జున... ఫస్ట్ రివ్యూ ఇదిగో

'టాక్సిక్' సినిమా పదే పదే వాయిదా పడుతూ ఉంటే... ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ కాస్త తగ్గుతుందనే సందేహాలు కొంత మందిలో ఉండొచ్చు. అయితే 'కేజీయఫ్ 2' తరువాత యశ్ ఇంత వరకు థియేటర్లలోకి రాలేదు. అందువల్ల క్రేజ్ ఉంటుంది.  మళ్లీ తన సత్తాను, లక్‌ను బాక్సాఫీస్ వద్ద చూపిస్తారని చెప్పవచ్చు. 'కేజీయఫ్' ఫ్రాంచైజీ కాకుండా యశ్ వేరే సినిమాతోనే తన బాక్సాఫీస్ పొటెన్షియల్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టాక్సిక్ ఎప్పుడు వస్తుందా? యశ్ స్టామినాను చూపిస్తుందో ఎదురు చూడాల్సిందే.

Also ReadAshu Reddy Audio Leaked: టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్