Director Jithu Madhavan About Mohanlal Cameo Role In Suriya 47 Movie : రీసెంట్‌గా కరుప్పుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కోలీవుడ్ స్టార్ సూర్య. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో డైరెక్ట్ తెలుగు మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.
ఆ తర్వాత జితూ మాధవన్ దర్శకత్వంలో 'సూర్య 47' మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా... మలయాళ స్టార్ మోహన్ లాల్ క్యామియో రోల్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై డైరెక్టర్ జితూ మాధవన్ క్లారిటీ ఇచ్చారు.
సరైన టైంలో అప్డేట్స్
'సూర్య 47' సినిమాలో మోహన్ లాల్ అతిథి పాత్ర చేయడంతో పాటు ఆయన పాత సినిమాలోని ఓ పాటను ఇందులో యాక్షన్ సీన్ కోసం వాడుతున్నారంటూ ప్రచారం కూడా సాగింది. దీనిపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో జితూ మాధవన్ రియాక్ట్ అయ్యారు. 'ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలే ఉంది. మేమింకా పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. ఇందులో మోహన్ లాల్ లేరు. సరైన టైంలో మరిన్ని అప్డేట్స్ ఇస్తాం.' అని చెప్పారు. మోహన్ లాల్ పాత సినిమాలో సాంగ్‌ను ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్‌లో వాడుతున్నారా? అనే ప్రశ్నకు డైరెక్టర్ జితూ సమాధానం దాటవేశారు.
సంక్రాంతి బరిలో...
యాక్షన్ కామెడీ జానర్‌లో రూపొందుతోన్న సూర్య 47 మూవీలో ఆయన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సూర్య సరసన నజ్రియా నజిమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా... ప్రేమలు ఫేం నస్లెన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. జూన్ చివరి నాటికి షూటింగ్ పూర్తి కానుండగా... ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కావాల్సిన మూవీ... వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
Also Read : Anil Ravipudi : రక్తం చిందించిన అనిల్ రావిపూడి - మరీ అంత వయలెన్స్ అవసరమా?
