గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చిన్న కుమార్తె కెమెరా ముందుకు వచ్చారు. తండ్రి సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను కొన్ని రోజుల నుంచి ఆవిడ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కానీ కెమెరా ముందుకు వచ్చి నటించినది లేదు. ఇప్పుడు కూడా తేజస్విని సినిమాల్లోకి రాలేదు... ఒక నగల కంపెనీకి యాడ్ చేశారు. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ కోసం కెమెరా ముందుకు వచ్చారు. ఇంతకీ, ఆ కంపెనీ ఎవరిది? ఆ యాడ్ తేజస్విని చేయడం వెనుక కహానీ ఏమిటో తెలుసా?
సిద్ధార్థ ఎవరో కాదు... తేజస్విని మరిది!Who Is Siddhartha, Know His Relation With Tejeswini Nandamuri Mathukumilli?: సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ పేరులో సిద్ధార్థ్ ఎవరో తెలుసా? తేజస్విని నందమూరికి స్వయానా మరిది. నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ సొంత తమ్ముడు. ఇప్పుడు అర్థం అయ్యిందిగా... తేజస్విని యాడ్ చేసిన కంపెనీ ఎవరిదో!?
సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ కంపెనీ ఎవరిదో కాదు... తేజస్విని సొంత కుటుంబానిది. ఆమె యాడ్ లాంచ్ ప్రోగ్రాంలో అత్తగారు శ్రీమణి కూడా పాల్గొన్నారు. తమ కంపెనీకి కోడలు బ్రాండ్ అంబాసిడర్ కావడం పట్ల అత్తగారు మాట్లాడుతూ... ''మాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పటి వరకు తేజు (తేజస్విని) ప్రయివేట్ పర్సన్. ఎప్పుడూ బయటకు రాలేదు. చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది. పైగా కన్జర్వేటివ్ ఫ్యామిలీ. మొదటిసారి ధైర్యం చేసి బయటకు వచ్చినందుకు నా అభినందనలు. ఎంతో బాగా చేసింది. షూట్ చేసేటపుడు సింగిల్ టేక్ లో అన్ని షాట్స్ చేసింది. ఒక్క రోజులో యాడ్ పూర్తి అయ్యింది. వాళ్ళ నాన్నను నిజమైన వారసురాలు అనిపించింది. ఆమె నా కోడలు కావడం మా అదృష్టం. యాడ్ చేసినందుకు నాకు చాలా కృతజ్ఞతా భావం ఉంది'' అని చెప్పారు.
Also Read: అల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ - మరి ఉపాసన సీమంతంలో అల్లు కుటుంబం ఎక్కడ?
చిత్ర నిర్మాణంలోనూ తేజస్విని అడుగు!కెమెరా ముందుకు రావడం ఒక్కటే కాదు... చిత్ర నిర్మాణంలోనూ తేజస్విని అడుగు పెట్టారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'అఖండ 2 తాండవం'కు ఆమె సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ యాడ్ చూశాక తేజస్విని చక్కగా చేశారని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.