Jaanvi Swarup Ghattamaneni: ఎవరీ జాన్వీ స్వరూప్? ఘట్టమనేని కుటుంబం నుంచి మరో కథానాయిక... మహేష్ మేనకోడలు గురించి తెలుసుకోండి
Jaanvi Swarup Background: ఘట్టమనేని కుటుంబం నుంచి తొలిసారి ఓ కథానాయిక రానుంది. కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె, మహేష్ మేనకోడలు వెండితెరపై అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఆమె గురించి తెలుసుకోండి.

Know About Jaanvi Swarup: ఎవరీ జాన్వీ స్వరూప్? చిత్రసీమలో ప్రముఖులకు ఈ అమ్మాయి సుపరిచితమే. ఘట్టమనేని అభిమానులకూ ఆమె తెలుసు. మెజారిటీ తెలుగు ప్రేక్షకులకు తెలియదు. ఘట్టమనేని కుటుంబం నుంచి కథానాయికగా రానున్న అమ్మాయి కావడంతో అందరి చూపు ఈమెపై పడింది. ఇంతకీ ఎవరీ అమ్మాయి? ఇప్పుడు ఆమె గురించి ఎందుకు డిస్కషన్ జరుగుతోంది? అనేది తెలుసుకోండి.
కృష్ణ మనవరాలు... మహేష్ మేనకోడలు!
Jaanvi Swarup Family Background: దివంగత సూపర్ స్టార్ కృష్ణకు జాన్వీ స్వరూప్ మనవరాలు. అంటే... ఆయన కూతురి కుమార్తె. కృష్ణకు ముగ్గురు కుమార్తెలు. మొదటి అమ్మాయిని ప్రముఖ పారిశ్రామిక - రాజకీయ కుటుంబానికి చెందిన జయదేవ్ గల్లాకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆఖరి కుమార్తెను హీరో సుధీర్ బాబుకు ఇచ్చి వివాహం చేశారు. మధ్యలో అమ్మాయి మంజుల ఘట్టమనేని. తెలుగులో ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకున్న 'షో'లో నటించారు.
Jaanvi Swarup Parents: మంజుల ఘట్టమనేని కుమార్తె జాన్వీ స్వరూప్. ఆమె తండ్రి కూడా నటుడు. ఆయన పేరు సంజయ్ స్వరూప్. 'ఆరెంజ్'లో రామ్ చరణ్ అక్క బావ పాత్రల్లో మంజుల, సంజయ్ స్వరూప్ నటించారు. బోలెడు సినిమాల్లో స్వరూప్ నటించారు. ఇప్పుడు తమ కుమార్తెను కథానాయికగా పరిచయం చేసేందుకు మంజుల, సంజయ్ స్వరూప్ దంపతులు సిద్ధం అయ్యారు.
కెమెరా ముందుకు వచ్చిన జాన్వీ స్వరూప్!
Jaanvi Swarup Acting Debut: కథానాయికగా జాన్వీ స్వరూప్ మొదటి సినిమా ఎవరి దర్శకత్వంలో, ఎవరి సరసన చేస్తుంది? అనేది వెల్లడించలేదు. నాయికగా ఆమె మొదటి సినిమా గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. కథానాయికగా సినిమా చేయడం ఆమె కొత్త. కానీ, కెమెరా ముందుకు రావడం కాదు.
Jaanvi Swarup Ghattamaneni Birthday: మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది'లో జాన్వీ స్వరూప్ నటించింది. ఒక జ్యువెలరీ యాడ్ కూడా చేసింది. ఆల్రెడీ యాక్టింగ్ డెబ్యూ జరిగింది. ఇప్పుడు హీరోయిన్ డెబ్యూ కోసం వెయిటింగ్ అన్నమాట. జాన్వీ స్వరూప్ పుట్టినరోజు (అక్టోబర్ 29) సందర్భంగా త్వరలో తన కుమార్తె వెండితెరపైకి కథానాయికగా వస్తుందని మంజుల వెల్లడించారు.
కృష్ణ కుటుంబంలో మూడో తరం వారసులు!
Jaanvi Swarup Cousins In Tollywood: 'హీరో', 'దేవకీ నందన వాసుదేవ' సినిమాల్లో కథానాయకుడిగా నటించిన అశోక్ గల్లాకు జాన్వీ స్వరూప్ చెల్లెలు. సుధీర్ బాబు కుమారులు చరిత్ మానస్, దర్శన్... వాళ్లిద్దరికీ జాన్వీ స్వరూప్ సిస్టర్. వీళ్ళందరూ కృష్ణ కుమార్తెల సంతానం. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణకు జాన్వీ స్వరూప్ మరదలు అవుతుంది. సితార ఘట్టమనేనికి జాన్వీ వదిన వరుస. వీళ్ళందరూ కృష్ణ కుటుంబంలో మూడో తరం వారసులు.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
'వన్ నేనొక్కడినే'లో గౌతమ్ నటించగా... 'సర్కారు వారి పాట'లో సితార పాట పాడింది. 'భలే భలే మగాడివోయ్'లో జూనియర్ నానిగా సుధీర్ బాబు తనయుడు చరిత్ నటించాడు. ప్రభాస్ 'ఫౌజీ'లో జూనియర్ ప్రభాస్ రోల్ చేసినది సుధీర్ బాబు రెండో కుమారుడు దర్శన్ అని టాక్. జాన్వీ స్వరూప్ ఒక్కరే కాదు... త్వరలో గౌతమ్, సితార, చరిత్, దర్శన్ సైతం వెండితెరకు హీరో హీరోయిన్లుగా వస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడు జయ్ కృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. తేజ దర్శకత్వంలో రమేష్ బాబు తనయురాలు భారతి సినిమా చేస్తున్నారు. హీరో హీరోయిన్లుగా వాళ్ళిద్దరి సినిమాలు ఖరారు అయ్యాయి. కృష్ణ కుటుంబంలో మూడో తరం చాలా అరడజను మంది హీరో హీరోయిన్లు వస్తారు. అదీ సంగతి! భారతి సినిమా ముందు వస్తుందా? జాన్వీ స్వరూప్ సినిమా ముందు విడుదల అవుతుందా? అనేది చూడాలి. ఇద్దరిలో ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చే మొదటి కథానాయికగా ఎవరు నిలుస్తారో? వెయిట్ అండ్ సీ.
Also Read: ప్రభాస్ 'ఫౌజీ' శ్లోకం మీనింగ్... హీరో క్యారెక్టర్‌లో ఆ ముగ్గురి లక్షణాలు!?





















