Bhoomi Shetty : 'మహాకాళి'గా భూమి శెట్టి - టీవీ సీరియల్స్ To మూవీస్... ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
Mahakali Actress : ప్రశాంత్ వర్మ 'మహాకాళి'లో హీరోయిన్ భూమి శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పించగా... ఆమె ఎవరా అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

Mahakali Actress Bhoomi Shetty Background Details : 'హను మాన్'తో బిగ్ సక్సెస్ అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రెండో ప్రాజెక్ట్ 'మహాకాళి'. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరోగా మూవీ రానుండగా... గురువారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'మహాకాళి'గా భూమి శెట్టి నటిస్తున్నారు. దీంతో ఆమె ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
చిన్నప్పుడే యక్షగానం
కర్ణాటకలోని కుందపురలో భాస్కర్, బేబి శెట్టి దంపతుల కుమార్తె భూమి శెట్టి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కూడా ఇదే ఊరిలో జన్మించారు. చదువుకునే రోజుల్లో భూమి కళలపై ఆసక్తి చూపించేవారు. యక్షగానం నేర్చుకున్నారు. సొంతూరిలోనే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఆ తర్వాత దగ్గర్లోని ఆర్ఎన్ శెట్టి పియు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. తర్వాత బెంగుళూరులోని AMC ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారు.
కన్నడ టీవీ సీరియల్‌తో...
చదువుకునే రోజుల్లోనే యక్షగానం నేర్చుకున్న భూమి శెట్టి... కన్నడ టీవీ సీరియల్ 'కిన్నరి'లో 'మణి' పాత్రలో మెరిశారు. కన్నడ, తెలుగు భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే ఆమె... ఆ తర్వాత 'జీ తెలుగు'లో ప్రసారమైన 'నిన్నే పెళ్లాడతా' సీరియల్‌లో మృదుల పాత్రను పోషించారు. తెలుగు షో అత్తారింట్లో అక్కా చెల్లెళ్లులోనూ కనిపించారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న భూమి... కిచ్చా సుదీప్ హోస్ట్‌గా కన్నడ బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షోలోనూ పాల్గొన్నారు. ఇందులో టాప్ 5లో నిలిచారు.
Also Read : 'బాహుబలి ది ఎపిక్' ట్విట్టర్ రివ్యూ - ఎక్స్‌పీరియన్స్ వేరే లెవల్... నెటిజన్స్ ఏమంటున్నారో తెలుసా?
అలా సినిమాల్లోకి ఎంట్రీ
బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. కన్నడ మూవీ 'ఇక్కత్' ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఉంది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో చైతన్యరావు ప్రధాన పాత్రలో నటించిన 'షరతులు వర్తిస్తాయి' మూవీలో హీరోయిన్‌గా చేశారు. అలాగే, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రీసెంట్‌గా వచ్చిన 'కింగ్డమ్' మూవీలో సత్యదేవ్ భార్య గౌరీ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ 'మహాకాళి' మూవీలో లీడ్ రోల్‌లో ఛాన్స్ దక్కించుకున్నారు.
బైకర్ కూడా...
భూమి శెట్టి హీరోయిన్ మాత్రమే కాకుండా బైకర్ కూడా. ఆమెకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె దగ్గర రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ ఉంది. దీనిపై ఆమె లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్తుంటారు. అలా లడఖ్ లడఖ్ వెళ్లిన ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అయ్యాయి. 'లవ్ ఎట్ ఫస్ట్ రైడ్ ఇన్ లేహ్' అంటూ ఈ ఫోటోలకు ఆమె క్యాప్షన్ ఇచ్చారు. బైక్ రైడింగ్ అంటే తన ఉద్దేశం ఫ్రీడమ్ అని చెబుతుంటారు భూమి.
పవర్ ఫుల్ లుక్
నల్లని రంగుతో కూడిన ముఖం, ముక్కు పుడక, రుద్ర రూపం... 'మహాకాళి' అవతారాన్ని కళ్లకు కట్టేలా ఉన్న ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'సృష్టి విశ్వ గర్భం నుంచి విశ్వంలోని అత్యంత క్రూరమైన సూపర్ హీరో మేల్కొంటాడు. భూమి శెట్టిన 'మహా'గా పరిచయం చేస్తున్నాం.' అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 50 శాతం కంప్లీట్ కాగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన గ్రాండ్ సెట్‌లో షూటింగ్ సాగుతోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు.
'మహాకాళి'ని RKD స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ స్టోరీ, స్క్రీన్ ప్లే చేస్తుండగా... పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించి ఇతర నటీనటులు అప్డేట్స్ రానున్నాయి.





















